EPAPER

KTR Controversial Tweet: వాట్ ఈజ్ దిస్ కేటీఆర్.. చూసుకోవాలి కదా..

KTR Controversial Tweet: వాట్ ఈజ్ దిస్ కేటీఆర్.. చూసుకోవాలి కదా..

2022-23 సంవ‌త్సరంలో తెలంగాణ‌ నుంచి 57 వేల 706 కోట్ల ఐటీ ఎగుమ‌తులు ఉంటే 2023-24 కాలానికి 26 వేల 948 కోట్ల ఎగుమతులే జరిగాయని అన్నారు. ఇక ఐటీ ఎంప్లాయిమ్మెంట్ కల్పన కూడా భారీగా పడిపోయిందని ట్వీట్ చేశారు. 2022-23 కాలంలో లక్షా 27 వేల 594 కొత్త ఉద్యోగాలు వస్తే. 2023-24 లో కేవ‌లం 40 వేల 285 ఉద్యోగాలు మాత్రమే కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరేడేళ్లలో తెలంగాణలో ఐటీ ప్రగతి గణనీయంగా పెరిగేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.
అలాంటి ఐటీని రంగాన్ని పట్టించుకోకపోతే రాష్ట్రం ఆర్థికంగా, ఉపాధి కల్పన పరంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఇదీ ఆయన ట్వీట్ సారాంశం.

బాగుంది.. విపక్షం అంటే ప్రశ్నించాలి. ప్రజల సంక్షేమం కోసం పోరాడాలి. ప్రస్తుతం బీఆర్ఎస్‌ నేత కేటీఆర్‌ కూడా తాను అదే చేస్తున్నానని అనుకుంటున్నారు. కానీ ఆయన.. చెప్పిందాంట్లో నిజముందా.. లేదా.. ఇదంతా పక్కకు పెడితే.. పార్టీ పోయిందన్న బాధలో ఆయన అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలపై అవగాహన లేనట్టుగా తెలుస్తోంది. అవును మరి.. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ సహా టాప్ ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. ఇంటర్నేషనల్ కంపెనీలో ఉద్యోగాలకు.. రాష్ట్రప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంటుందా ఈ విషయం కూడా కేటీఆర్ కు తెలియదా.. మినిమం మ్యాటర్ తెలియకుండా ఉద్యోగాలు తగ్గాయంటే.. ఎలా..?


సరే ఇదంతా కాదు. కాంగ్రెస్ వచ్చాకే ఉద్యోగాలు తగ్గాయా అంటే ప్రభుత్వం వచ్చే 8 నెలలు. కనీసం సంవత్సరం కూడా కాలేదు. కేటీఆర్ చెప్పిన ప్రకారం.. అయినా2023-24 ఆర్థిక సంవత్సరం అంటే.. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకూ కదా.. అందులో డిసెంబర్ వరకూ పాలనలో ఉంది బీఆర్‌ఎసే కదా..అప్పుడు ఐటీ మంత్రి కేటీఆరే కదా.. అంటే 8 నెలలు బీఆర్‌ఎస్ పాలన, 4 నెలల కాంగ్రెస్ పాలనకు సంబంధించిన రిపోర్ట్‌నే కదా కేటీఆర్ ప్రస్తావించింది. ఆ లెక్కన ఎగుమతులు తగ్గడంలో ఎక్కువ పాత్ర మీదే అవుతుంది కదా.. ఆ మాత్రం తెలియకపోతే ఎలా.. వాట్ ఈజ్ దిస్ కేటీఆర్..  చూసుకోవాలి కదా.

Also Read: భద్రాచలంలో భారీ వర్షం.. రామాలయాన్ని చుట్టుముట్టిన వరద!

ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట అంటూ.. తగుదునమ్మా అంటూ బీఆర్ఎస్ నేతలు వంతూ పాడారు. మైకు ఉంది కదా అని కేటీఆర్ ట్వీట్ ను చదివారు క్రిశాంక్ .. ఇక కాంగ్రెస్ తరపున రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కేటీఆర్ కు గట్టిగానే కౌంటరిచ్చారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో.. రెండేళ్లుగా మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న విషయం మీకు తెలీదా? అని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఎగుమతులపై యుద్ధ ప్రభావం పడిందనీ.. ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగాలను తొలగించాయన్న విషయం గుర్తులేదా?అని సెటైర్లు వేశారు. భారత్ సహా తెలంగాణలో కూడా ప్రభావం చూపిందన్నారు.

ఇప్పటికైనా మీ వ్యక్తిగత ఇమేజ్‌ని పెంచుకునే ప్రయత్నం మానుకోవాలని సూచించారు అనిల్.. ఇన్నేళ్లుగా ఐటీ మినిష్టర్ గా చేసిన మీ తెలివి ఇదేనా .. ఇలా ఐతే ఎలా కేటీఆర్.. ఏదీ.. ఎవరికి సంబంధించిందో.. కాస్త తెలుసుకోవాలి కదా. తప్పులను ఎత్తిచూపాలి.. ప్రశ్నించాలి.. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ లేని తప్పును ఎత్తి చూపి.. మీరు తప్పులో కాలేసి.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తా అంటే మాత్రం అస్సలు కుదరదు. ఎందుకంటే ప్రజలంతా తెలివితక్కువ వారు కాదు.

ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి కాస్త బాధ్యతతో మెలిగితే ఉన్న పరువు దక్కుతుంది. ఇక తప్పుల విషయానికి వద్దాం. తాము చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పుఅన్నట్టు ఉంటుంది కేటీఆర్‌  వ్యవహారం. తెలంగాణకు కాబోయే సీఎం అనే రేంజ్‌లో ప్రచారం జరిగిన కేటీఆర్ గారి తీరు ఇది. కేటీఆర్ వన్ సజేషన్.. ఇప్పటికే ప్రజలు మీ తీరు నచ్చక పక్కన పెట్టేశారు. కానీ మీ తీరు మాత్రం మారడం లేదు. మాటలు తగ్గిపోయి. ట్వీట్స్ పెరిగిపోయాయి. కనీసం ఆ ట్వీట్స్‌ అయినా.. ముందు వెనుకా కాస్త ఆలోచించి చేయండి.

Related News

Telangana Liberation Day: బలిదానాలు, త్యాగాలతోనే తెలంగాణకు స్వాతంత్య్రం.. కిషన్ రెడ్డి

Telangana Vimochana Dinotsavam : ఢిల్లీ బంగ్లాదేశ్‌లో లేదు.. ఎన్నిసార్లైనా వెళ్తా: బీఆర్ఎస్‌‌కు సీఎం రేవంత్ కౌంటర్

Balapur Ganesh 2024 Laddu Auction: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. ఆల్ టైమ్ రికార్డు ధర

Ganesh Laddu All Time Record: ఆల్‌టైం రికార్డ్.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డూ.. ఎక్కడంటే?

Khairatabad Ganesh: ప్రారంభమైన ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర.. ఉత్కంఠగా బాలాపూర్ లడ్డూ వేలం

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Big Stories

×