EPAPER

Free RTC Bus Journey: బ్రేకు డ్యాన్సులు అంటూ.. మహిళలపై కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు

Free RTC Bus Journey: బ్రేకు డ్యాన్సులు అంటూ..  మహిళలపై కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఈ అవకాశంపై రాష్ట్రంలోని మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగాలు చేసే మహిళలు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. మహిళాలోకమంతా ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఒక వైపు హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో చోటుచేసుకున్న మార్పులపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్ల నుంచి కొంత నిరసన వ్యక్తమైంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ అవకాశాన్ని చాలా మంది మహిళలు దుర్వినియోగం చేస్తున్నారంటూ కామెంట్లు చేశాయి. ఇదే కోవలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేశారు. హేళనగా మాట్లాడటమే కాదు.. మహిళల పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.


ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేసుకోవచ్చు అంటూ కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కుట్లు, అల్లికలే కాదు.. అవసరమైతే డ్యాన్సులు కూడా చేసుకోండని అవమానకరంగా మాట్లాడారు. తాము తప్పు అని అనడం లేదని, బస్సులు పెంచండని, అవసరమైతే ఒక్కొక్కరికి ఒక్కో బస్సు కేటాయించండి అంటూ హేళనగా కామెంట్ చేశారు.

Also Read: Naga Shaurya: ప్రజలారా ఇకనైనా మేల్కోండి.. : నటుడు నాగశౌర్య ధర్మాగ్రహం


‘ఆర్టీసీ బస్సుల్లో అల్లం ఎల్లిపాయలు ఏరితే తప్పేంటి? అంటూ మొన్న మా సీతక్క అంటున్నది. మేం తప్పు అని ఎప్పుడు అన్నం అక్కా.. కుట్లు, అల్లికలు ఏమిటీ అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు కూడా వేసుకోవచ్చు. మేం తప్పు అనడం లేదు. కానీ, వీటి కోసమే ఆర్టీసీ బస్సుల నడుపుతారని మాకు తెలియలేదు. మీరు అప్పుడే మాకు చెప్పలేదు. మేం తప్పు అనడం లేదు. బస్సులు ఎక్కువ పెట్టండి. తన్నుకుంటున్నారు.. మంచిగా లేదు. అందుకే ఎక్కువ బస్సులు పెడితే.. మొత్తం కుటుంబానికి కుటుంబమంతా వెళ్లి.. అందులో కుట్లు, అల్లికలు, బ్రేక్ డ్యాన్సులు.. రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవచ్చు. మేం తప్పు అని చెప్పడం లేదు’ అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు.

ఈ కామెంట్లపై మహిళలు సీరియస్ అవుతున్నారు కేటీఆర్ తీరును తప్పుబడుతున్నారు. బస్సుల్లో బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు వేసేవాళ్లలా తెలంగాణ మహిళలు కనిపిస్తున్నారా? అని నిలదీశారు. ‘మీ కుటుంబంలోని మహిళల పట్ల అలాంటి వ్యాఖ్యలు చేస్తే మీరు ఊరుకుంటారా?’ అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.

Tags

Related News

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

Big Stories

×