EPAPER

KTR Comments: సీఎం రేవంత్ కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

KTR Comments: సీఎం రేవంత్ కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

KTR Comments: రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసింందే. అయితే, పథకం అమలుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన సారీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, మరోసారి కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నవేళ కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. దీంతో ఆయనపై కాంగ్రెస్ మరోసారి భగ్గుమంటోంది. ఇష్టానుసారంగా మాట్లాడొద్దంటూ ఆయనను కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు.


అయితే, రుణమాఫీ విషయమై కేటీఆర్ మాట్లాడుతూ.. ‘రేపట్నుంచి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతలం పర్యటనలు చేస్తాం. బీఆర్ఎస్ కాల్ సెంటర్ కు లక్షకు పైగా రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. రైతుల కోసం బీఆర్ఎస్ పోరాడుతుంది.

రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టతలేదు. అందరికీ రుణమాఫీ చేయలేదు. కొంతమందికి మాత్రమే రుణమాఫీ చేశారు. ఎన్నికల ముందు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు. రూ. 40 వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు. 40 శాతం రైతులకు మాఫీ చేసి వంద శాతం చేసినట్టు ఫోజులు కొడుతున్నారు. మిగతా 60 శాతం రైతులకు రుణమాఫీని ఎగ్గొట్టారు. రుణమాఫీ జరిగింది 22.37 లక్షల మంది రైతులకు మాత్రమే. రైతులంతా రుణమాఫీ అయ్యిందంటే నేను రాజీనామా చేస్తా. సీఎం, డిప్యూటీ సీఎం జిల్లాల్లో కొద్ది మంత్రికి మాత్రమే రుణమాఫీ అయ్యింది. రుణమాఫీ అందరికీ అయ్యిందంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. వడ్డీ కడితేనే రుణమాఫీ చేస్తామంటూ బ్యాంకు నోటీసులు ఇస్తున్నారు. ప్రభుత్వం చేసిన తప్పుకు రైతులెందుకు వడ్డీ భరించాలి?. రైతులకు రైతుభరోసా ఇంతవరకు ఇవ్వలేదు? మా హయాంలో రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేసినం.. రైతుబంధు ఇచ్చినం’ అంటూ ఆయన పేర్కొన్నారు.


Also Read: రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌ తో ఫాక్స్‌కాన్ ఛైర్మన్, నాలుగో సిటీపై చర్చ.. త్వరలో..

రుణమాఫీ సక్సెస్ అయ్యిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరూపిస్తే నేను రాజకీయాలను వదిలేస్తా. రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజకీయం సన్యాసం తీసుకుంటా. నా సవాల్ ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించాలి. అమెరికా పర్యటన సక్సె కాలేదు.

రైతులకు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులను పూర్తిగా మోసం చేసింది. రూ. 40 వేల కోట్ల రుణమాఫీ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. రైతులకు ఎంతవరకు రుణమాఫీ చేసిందో చెప్పాలి. ఇన్ కమ్ టాక్స్ కడుతున్నరని, రేషన్ కార్డు లేదని చాలామంది రైతులకు రుణమాఫీ చేయలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క రైతు వేదికలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని కనీసం ఒక్క రైతుతోనైనా చెప్పించండి. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసింది నిజమే అయితే, ఆయన సొంత జిల్లా, సొంత నియోజకవర్గానికి మీడియాతో కలిసి వెళ్దాం. ఒకవేళ్ ఆ గ్రామంలో వంద శాతం రుణమాఫీ అయిందని అక్కడ తేలితే.. వెంటనే అక్కడనే రాజీనామా సమర్పిస్తా’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×