EPAPER

KTR: రాష్ట్రంలో ఈసారి బతుకమ్మ పండుగ జరుగుతున్నట్టే లేదు: కేటీఆర్

KTR: రాష్ట్రంలో ఈసారి బతుకమ్మ పండుగ జరుగుతున్నట్టే లేదు: కేటీఆర్

హైదరాబాద్, స్వేచ్ఛ: ఈ ఏడాది బతుకమ్మ పండుగలానే లేదని, డిజేలు బంద్ పెట్టారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ నేత అల్లావుద్దీన్ బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, అధికారులు గ్రామాల్లోకి పోతే ప్రజలు కొట్టే పరిస్థితి ఉన్నదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, మహిళలందరికీ రూ.2,500 ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, అధికారంలోకి రాగానే అతీలేదు గతీలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మితో పాటుగా తులం బంగారం ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. తులం ఇనుము కూడా ఇవ్వ లేదని సెటైర్లు వేశారు. ఇచ్చిన హామీలకు డబ్బులు లేవు గానీ, మూసీకి మాత్రం లక్ష 50 వేల కోట్లు ఖర్చు చేస్తారా అంటూ ప్రశ్నించారు. మూసీ పేరు మీద వందల కోట్లను రాహుల్ గాంధీకి పంపించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధం అయ్యారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు కేటీఆర్.


Also Read: 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్.. ఆ తర్వాతే కొత్త ఉద్యోగ…

‘‘రైతులకు ఏదైనా సమస్య వస్తే కలెక్టర్లకు చెప్పాలంట. ఇంటింటికి ఓట్ల కోసం వచ్చిన వాళ్లను మాత్రం అడగవద్దంట. ప్రజలకు ఇదేం కర్మ. ఎవరైతే మనకు తప్పుడు హామీలు ఇచ్చారో వాళ్లనే పట్టుకోవాలి. బారాబర్ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులను పట్టుకొని గట్టిగా నిలదీయాలి. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసింది. హర్యానాలో ఏడు గ్యారెంటీలంటూ మోసం చేయబోయారు. కానీ ఆ మోసాలను గుర్తుపట్టి ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ బుద్ది తెచ్చుకోవాలి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. లేదంటే మీకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పటం ఖాయం. పట్నం నరేందర్ రెడ్డి బేషరతుగా విడుదల చేయాలి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతులు ఆందోళన చేస్తున్నారు’’ అని అన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఇప్పుడు కేసీఆర్ సీఎంగా లేరన్న బాధలో ఉన్నారని చెప్పారు కేటీఆర్. ఒకవేళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి రైతు బంధు పైసలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చేవని చెప్పారు. సెక్యులరిజాన్ని కొనసాగిస్తామని, మనిషిని మనిషిగా చూస్తూ భవిష్యత్‌లోనూ అదే తరహా రాజకీయం చేస్తామని స్పష్టం చేశారు. ‘‘మోదీ మమ్మల్ని బెదిరించేందుకు ప్రయత్నించారు. మా చెల్లిని జైల్లో పెట్టారు. అయినా సరే మేము తల వంచలేదు. మోదీతోనే పోరాటం చేశాం. అదే పోరాట స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుంది. పేదలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటాం’’ అని అన్నారు.


Related News

Corrupt wife: భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త.. ఏకంగా వీడియోలు రిలీజ్!

CM Revanth Reddy: రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. 48 గంటల్లోనే మీ అకౌంట్లోకి ఆ డబ్బులు..

BJP MLA: బడా కబ్జాల సంగతేంటి..? ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే రమణా రెడ్డి సవాల్

Minister Ponnam: మీకు కడుపు మంట ఎందుకు..? కేటీఆర్‌కు పొన్నం కౌంటర్

CM Revanth Reddy: 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్.. ఆ తర్వాతే కొత్త ఉద్యోగ…

CM Revanth Reddy: దసరా వేళ ఆదివాసీలకు ప్రత్యేక శుభవార్త..

Big Stories

×