EPAPER

KTR Campaign : బీఆర్ఎస్‌కు బూమరాంగ్ అవుతున్న కేటీఆర్ ప్రచారం

KTR Campaign | అసలే ఎలక్షన్ సీజన్. ఇప్పుడు ఏ ఘటన జరిగినా అది గెలుపోటములపై చాలా ఎఫెక్ట్ చూపుతుంటుంది. అయితే బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా ఇటీవల వరుసబెట్టి కొన్ని ఘటనలు జరిగాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి ఎవరో ఒకరి అకౌంట్ లోకి తోసెయ్ అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. అది అటు తిరిగి ఇటు తిరిగి బీఆర్ఎస్ కే బూమరాంగ్ అవుతోంది. అందులో కేటీఆర్ కే ఎక్కువ ఎఫెక్ట్ పడుతోంది.

KTR Campaign : బీఆర్ఎస్‌కు బూమరాంగ్ అవుతున్న కేటీఆర్ ప్రచారం
KTR News Today

KTR News Today(Telangana politics):

అసలే ఎలక్షన్ సీజన్. ఇప్పుడు ఏ ఘటన జరిగినా అది గెలుపోటములపై చాలా ఎఫెక్ట్ చూపుతుంటుంది. అయితే బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా ఇటీవల వరుసబెట్టి కొన్ని ఘటనలు జరిగాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి ఎవరో ఒకరి అకౌంట్ లోకి తోసెయ్ అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. అది అటు తిరిగి ఇటు తిరిగి బీఆర్ఎస్ కే బూమరాంగ్ అవుతోంది. అందులో కేటీఆర్ కే ఎక్కువ ఎఫెక్ట్ పడుతోంది.


ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ మంత్రి కేటీఆర్ కన్ఫ్యూజ్ అవుతున్నారా.. తడబడుతున్నారా.. టెన్షన్ పడుతున్నారో తెలియదు గానీ.. తన మాటలు తనకే రివర్స్ అవుతున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. ఫాక్స్ కాన్ కంపెనీ విషయంలో కేటీఆర్…, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పై విమర్శలు చేశారు. డీకే శివకుమార్ ఫాక్స్‌కాన్ సీఈఓకి లేఖ రాశారని, పాక్స్‌కాన్‌ కంపెనీని బెంగుళూరుకు మార్చాలని కోరినట్లు తెలిపారు. అయితే అంతటితోనే ఆగకుండా ఇంకా కొన్ని కామెంట్లు చేసినట్లు వెల్లడించారు కేటీఆర్‌. త్వరలోనే తెలంగాణలో ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుందని, అక్కడ ఉన్న ప్రముఖ కంపెనీలన్నీ మార్చేస్తాం అని డీకే లేఖలో రాసినట్లు ఆరోపించారు. ఇది కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక ప్రభుత్వం చేసే కుటిల ప్రయత్నమని విమర్శలు చేశారు కేటీఆర్‌.

డీకే శివకుమార్ పై కేటీఆర్ ఇలా ఆరోపణలు చేయగానే ఆయన ఎంట్రీ ఇచ్చారు. కేటీఆర్ చేసిన ఆరోపణలపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఆ లేఖ నకిలీదని తేల్చేశారు. అంతేకాదు.. సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ కూడా చేశారు.


ఫాక్స్ కాన్ ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి రచ్చగా మారడంతో కేటీఆర్ వెనక్కు తగ్గారు. కాంగ్రెస్ నేతలు కౌంటర్ల మీద కౌంటర్లు వేయడంతో సెల్ఫ్ గోల్ నుంచి బయటకు రాలేని పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఫాక్స్‌కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించుకుపోతారంటూ గతంలో తాను చేసిన కామెంట్స్ పై కేటీఆర్ మాట మార్చారు. తాను నిర్ధారించుకోకుండా అలా మాట్లాడానంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్ నేతలు ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో నెంబర్ వన్ అంటూ కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్‌పై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మార్చడానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటున్నారు.

అటు కాళేశ్వరం కుంగడంపైనా కేటీఆర్ మాటల మీద మాటలు మారుస్తున్నారు. చిన్న పర్రె పడితే అదేదో బ్యారేజ్ మొత్తానికే కూలిపోయిందన్నట్లుగా కాంగ్రెస్ మాట్లాడుతోందన్నారు. మొదట విద్రోహ చర్య అని బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. రాహుల్ రేవంత్ బ్యారేజ్ దగ్గరకు వెళ్లి పరిశీలించి వస్తే… ఎక్స్ పాన్షన్ జాయింట్ ను కుంగినట్లుగా చూపిస్తున్నారంటూ మాట్లాడారు. అన్నీ అటు తిరిగి ఇటు తిరిగి బీఆర్ఎస్ కే బూమరాంగ్ అయ్యాయి.

దుబ్బాక నియోజకవర్గంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి ఇష్యూపైనా కేటీఆర్ ఏవేవో మాట్లాడేశారు. ఆ దాడి ఘటనను మొదట బీజేపీ అకౌంట్ లోకి తోసే ప్రయత్నం చేశారు. అది కుదరకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో తోయాలని చూశారు. అంతే కాదు.. రేవంత్ రెడ్డి వంటి వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉంటే ఇలాంటివే జరుగుతాయంటూ కేటీఆర్ బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ గూండాల పనే అని ట్వీట్ చేశారు.

లండుదో మొండితో కత్తి మాకు దొరకదా అని సీఎం కేసీఆర్ కూడా అన్నారు. ఇవన్నీ చివరకు బీఆర్ఎస్ కే బూమరాంగ్ అయ్యాయి. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఘటనకు రాజకీయాలతో సంబంధం లేదని, సెన్సేషన్ కోసమే ఘాతుకానికి పాల్పడ్డాడని తేల్చారు. ఇక్కడ కేసీఆర్, కేటీఆర్ విశ్వసనీయతకే ఎఫెక్ట్ పడ్డాయి. ఒక ఎంపీపై దాడి జరిగితే దాన్ని గులాబీ పార్టీ చిల్లర రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రయత్నం చూస్తుంటే ఎన్నికల్లో ఓటమి ఖాయమైనట్లు తెలుస్తోందన్నారు.

వరంగల్ జిల్లాకు చెందిన ప్రవల్లిక పరీక్షలు వాయిదాల మీద వాయిదాలు పడుతుండడంతో సూసైడ్ చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యపై బీఆర్ఎస్ నేతలు.. రకరకాలుగా మాట్లాడారు. అసలు పోటీ పరీక్షలకు అప్లై చేయలేదన్నారు. తీరా గ్రూప్స్ హాల్ టిక్కెట్లు బయటపెట్టేసరికి సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమ వ్యవహారాన్ని అంటగట్టారు. చివరకు పోలీసులు శివరాం అనే యువకుడిపై కేసు పెట్టినా.. ఆధారాలు లేకపోవడంతో కోర్టు కొట్టేసింది.

ఎవరో దిగువ శ్రేణి నాయకులు ఏదో ఒకటి మాట్లాడారంటే అదంత పెద్ద మ్యాటర్ కాదు. కానీ కేటీఆర్ లాంటి నేతలు ఇలా వెనకా ముందు చూసుకోకుండా, నిజాలు నిర్ధారణ చేసుకోకుండా.. ఏదో ఒకటి మాట్లాడేయడం ఆ తర్వాత సరి చూసుకోలేదని చెప్పడమే జనంలో రోజురోజుకూ విశ్వసనీయత మరింత తగ్గేలా చేస్తోంది.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×