EPAPER

KTR : కొత్తగూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం.. అందుకే హైదరాబాద్‌ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్: కేటీఆర్

KTR : కొత్తగూడ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం.. అందుకే హైదరాబాద్‌ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్: కేటీఆర్

KTR : హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసింది. ఐటీ కారిడార్‌లో మరో ఫ్లైఓవర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగూడ-బొటానికల్‌ గార్డెన్‌ పైవంతెనను తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, హైదరాబాద్‌ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొన్నారు. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా రూ. 263 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో కొండాపూర్‌- గచ్చిబౌలి మార్గంలోని ముఖ్యమైన కూడళ్ల వద్ద వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తీరిపోయాయి.


తెలంగాణకు హైదరాబాద్ కల్పతరువు లాంటిదని కేటీఆర్ అన్నారు. లక్షల మందికి ఉపాధి ఇస్తున్న నగరంలోనే ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ. 8 వేల కోట్లకుపైగా నిధులతో వివిధ ప్రాజెక్టులు చేపట్టామని చెప్పారు. ఎస్‌ఆర్‌డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో 20 పూర్తి చేశామన్నారు. మరో 11 ప్రాజెక్టులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. నాలాల అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టామన్నారు. 31 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్మిస్తున్నామని కేటీఆర్ వివరించారు. నగరానికి 3వేల ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకొస్తున్నామని ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే 50 ఏళ్ల వరకు తెలంగాణలో మంచినీటి కొరత లేకుండా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.

ఫ్లై ఓవర్‌ ఉపయోగాలు..
గచ్చిబౌలి వైపు నుంచి ఆల్విన్‌కాలనీ జంక్షన్‌ వైపు వన్‌వే ఫ్లైఓవర్‌గా అందుబాటులోకి వచ్చింది. గచ్చిబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలు, మసీద్‌బండ, బొటానికల్‌ గార్డెన్‌ నుంచి వచ్చే వాహనాలు ఫ్లైఓవర్‌ పైకి వెళ్తాయి. ఈ వాహనాలు మాదాపూర్‌ లేదా హఫీజ్‌పేట్‌ వైపు వెళ్లవచ్చు. హఫీజ్‌పేట్‌ నుంచి వచ్చే గచ్చిబౌలి, బొటానికల్‌ గార్డెన్‌ వైపు వెళ్లే వాహనాలు అండర్‌ పాస్‌ ద్వారా వెళ్తాయి. దీంతో శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్, కొత్తగూడ జంక్షన్లపై ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంది. కొండాపూర్, మాదాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట్, బొటానికల్‌ గార్డెన్, గచ్చిబౌలి ప్రాంతాలకు సులభంగా రాకపోకలు సాగించవచ్చు. కొత్తగూడ, కొండాపూర్‌, బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్లలో వాహనదారులకు ఇబ్బందులు తొలగిపోయాయి. ఆల్విన్‌ కాలనీ నుంచి గచ్చిబౌలి కూడలి వరకు సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణం సాగించవచ్చు. మాదాపూర్‌ నుంచి బొటానికల్‌ గార్డెన్, గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు ఇక సులభంగా రాకపోకలు సాగించే అవకాశం కలిగింది.


Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×