EPAPER

Konda Surekha: కేసీఆర్‌ను కేటీఆర్ చంపేశారేమో?

Konda Surekha: కేసీఆర్‌ను కేటీఆర్ చంపేశారేమో?

అదే విధంగా తమకు కేసీఆర్ ఎక్కడున్నాడో కనబడటం లేదు. తమకు షాది ముబారక్ చెక్కులు ఆగిపోయినాయి. ఆయన వల్ల తాము నష్ట పోతున్నామంటూ వెల్లడించింది. గజ్వేల్ లో కేసీఆర్ కనపడటం లేదని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపింది. సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని తమపై పిచ్చి రాతలు రాస్తున్నారంటూ మండిపడింది.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చారు. ఒక మహిళా మంత్రిపైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఆమెను కించరిచే విధంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలోనే ఇంకా కొపంతో కొండా సురేఖ కేటీఆర్ పైన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.


Also Read: రండి మార్కింగ్ వేయండి.. నేనే కూల్చేస్తా.. అంటూ సీఎం కు లేఖ రాసిన కేవీపీ

అంతే కాకుండా ఒక మీడియాలో ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను కూడా  ప్రధానంగా అమె మాట్లాడారు. కేటీఆర్ ఇప్పటికైనా ఒళ్లు దగ్గరపెట్టుకో అంటూ మండిపడ్డారు. బడ్జెట్ రోజు వచ్చిన కేసీఆర్ మళ్లీ కనపడకుండా పోయారని, ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఏం చేస్తున్నారో తెలియదని ఆమె పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో సిద్ధిపేట, గజ్వేల్ నియోజక వర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆమె పేర్కొంది. కవిత బెయిల్ కోసం ప్రధానితో మాట్లాడి ఒప్పందం చేసుకుని బీఆర్ఎస్, పార్టీ నుంచి బీజేపీ క్రాస్ ఓటింగ్ వేయించారని కొండా సురేఖా అన్నారు. సిసోడియా కంటే తక్కువ రోజుల్లో కవిత జైలు నుంచి బయటికి వచ్చిందంటే చీకటి ఒప్పందం కాదా? అని ప్రశ్నించారు. రోజుకు ఒకతీరులో బతుకమ్మ ఆడినట్టుగా నిన్న ఒక తీరు, ఈరోజు ఒక తీరుగా, అనవసరంగా ఈవిడతో పెట్టుకున్నామే అనేలా బీఆర్ఎస్ పార్టీ పశ్చాత్తాపపడేలా కొండా సురేఖ మాట్లాడారు.

Related News

TG Govt: త్వరలో ఆర్ఓఆర్ చట్టం అమలు.. ధరణి పోర్టల్ రద్దు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

KA Paul: హైడ్రాపై హైకోర్టుకు వెళ్లిన పాల్.. కూల్చివేత ఆపలేం కానీ..

Medigadda Repair Works: మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ల భారం ఎవరిది? నిర్మాణ సంస్థ మౌనానికి కారణం ఏంటి?

KVP: రండి మార్కింగ్ వేయండి.. నేనే కూల్చేస్తా.. సీఎం రేవంత్‌కు కేవీపీ లేఖ

Akkineni Nagarjuna: నాగార్జున వెనుక ఆ బడా నేత? టాలీవుడ్ పెద్దలంతా అప్పుడేమయ్యారు? సమ్‌థింగ్ ఫిషీ!

KTR and Harish Rao: కేటీఆర్‌, హ‌రీష్‌రావులు బుక్కయ్యారు, పిలుపు ఎప్పుడు?

Big Stories

×