EPAPER
Kirrak Couples Episode 1

Minister Ponnam: ఆ సమయంలో నాకు చాలా ఆనందం వేసింది: మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Ponnam: ఆ సమయంలో నాకు చాలా ఆనందం వేసింది: మంత్రి పొన్నం ప్రభాకర్

Konda Laxman Bapuji death Anniversary: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా కొండా లక్ష్మణ్ బాపూజీని గౌరవించుకుంటదని, అందుకు సంబంధించిన చర్యలు తీసుకుని ఆయనకు సముచిత స్థానం కల్పిస్తున్నామంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ‘ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం పక్షాన ఘన నివాళులు అర్పించాం. 27వ తేదిన వారి జయంతి వేడుకలను ప్రభుత్వం పక్షాన ఘనంగా నిర్వహిస్తున్నది. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలంటూ నిన్న(శనివారం) రాష్ట్ర కేబినెట్ ఆమోదించినప్పుడు నాకు బలహీన వర్గాల మంత్రిగా చాలా ఆనందం వేసింది.


Also Read: సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి ఇది ఎలా ఇచ్చారు?: కేటీఆర్

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ.. నేను పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో మాకు మార్గదర్శకత్వం చేసిన వ్యక్తి. బలహీన వర్గాల బిడ్డ, అందరికీ ఆదర్శప్రాయుడు కొండా లక్ష్మణ్ బాపూజీకి సముచిత స్థానం దొరకాల్సి ఉన్నా కూడా గత పది సంవత్సరాలుగా నిర్లక్ష్యం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా కొండా లక్ష్మణ్ బాపూజీని గౌరవించుకునే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. వారికి సముచిత స్థానం కల్పిస్తున్నాం. బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీకి హృదయ పూర్వక ఘన నివాళులు’ అంటూ మంత్రి పేర్కొన్నారు.


Also Read: హైదరాబాద్ ఇక వరదల నుంచి సేఫా..? ముంపు ముప్పు తొలగిపోయినట్లేనా..?

Related News

Ponguleti: కేటీఆర్‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి.. త్వరలోనే కోర్టుకు వెళ్లక తప్పదా..?

Yennam Srinivas Reddy: ఆ మీటింగ్ తరువాత అన్ని బయటపడుతాయ్.. తొందరెందుకు? : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

KTR: సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి ఇది ఎలా ఇచ్చారు?: కేటీఆర్

Hyderabad: హైదరాబాద్ ఇక వరదల నుంచి సేఫా..? ముంపు ముప్పు తొలగిపోయినట్లేనా..?

BJP Targets Rahul: మోదీజీ మీ స్థాయి ఇది కాదు: భట్టి విక్రమార్క

PAC Meeting: పీఏసీ మీటింగ్, బీఆర్ఎస్ వాకౌట్.. ఆ సంగతేంటి?

Big Stories

×