EPAPER

KomatiReddy: సగం టికెట్లు ముందే ఇవ్వాలి.. ముందస్తు ఎన్నికలు పక్కా.. కోమటిరెడ్డి వాయిస్..

KomatiReddy: సగం టికెట్లు ముందే ఇవ్వాలి.. ముందస్తు ఎన్నికలు పక్కా.. కోమటిరెడ్డి వాయిస్..

KomatiReddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన డిమాండ్ చేశారు. ఎన్నికల బరిలో దిగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ముందే ప్రకటించాలన్నారు. అందరినీ ఎంపిక చేయలేకపోయినా.. కనీసం 50శాతం సీట్లలోనైనా అభ్యర్థులను ప్రకటించాలని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రేను కోరారు.


సీఎం కేసీఆర్ ఏ సమయంలోనైనా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లొచ్చని కోమటిరెడ్డి అన్నారు. అందుకే, అభ్యర్థులను ఎంపిక చేసి.. పోరుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పోటీ ఉన్న చోట.. ఆశావహులను పిలిపించి మాట్లాడాలని.. వారికి నచ్చజెప్పి ఓ అభ్యర్థిని ఎంపిక చేయాలని చెప్పారు.

ఈ సందర్భంగా కొందరు కాంగ్రెస్ నేతల తీరుపైనా విమర్శలు గుప్పించారు. పార్టీ కొన్ని ఆందోళన కార్యక్రమాలకు పిలుపిస్తే.. ఏదో మొక్కుబడిగా చేస్తున్నారని మండిపడ్డారు. ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని తప్పుబట్టారు. నేతల తీరు మారాలని.. కాంగ్రెస్ కోసం చిత్తశుద్ధిగా పని చేయాలని హితవు పలికారు.


కాంగ్రెస్ ను ఎలా అధికారంలోకి తీసుకురావాలనే దానిపై పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రేకు పలు సలహాలు, సూచనలు ఇచ్చానని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇంఛార్జ్ కేవలం హైదరాబాద్ కే పరిమితం కావొద్దని.. జిల్లాల పర్యటనలు చేయాలని చెప్పారు. జిల్లాలకు వెళితే వాస్తవాలు తెలుస్తాయని.. అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకోవచ్చని అన్నారు. తన ప్రతిపాదననకు థాక్రే అంగీకరించారని కోమటిరెడ్డి తెలిపారు.

అటు, ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభ మీదా స్పందించారు వెంకట్ రెడ్డి. ప్రభుత్వ సొమ్ముతో బీఆర్ఎస్ సభ పెట్టిందని.. జనాన్ని బలవంతంగా తరలించారని అన్నారు. ఆ డబ్బులు తనకిస్తే.. అంతకంటే ఎక్కువే జనసమీకరణ చేసి చూపిస్తానని సవాల్ చేశారు.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×