EPAPER

Komatireddy Venkat Reddy vs KTR: సిరిసిల్లలో తేల్చుకుందాం.. కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్..

Komatireddy Venkat Reddy vs KTR: సిరిసిల్లలో తేల్చుకుందాం.. కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్..

Komatireddy Venkat Reddy newsKomatireddy Venkat Reddy vs KTR(TS politics): ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సిరిసిల్లలో పోటీ చేస్తానని దమ్ముంటే కేటీఆర్ రాజీనామా చేసి తన మీద పోటీ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. ఒకవేళ తనపై కేటీఆర్ గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తున్నట్లు ప్రకటించాలని మంత్రి పేర్కొన్నారు.


గత కొన్నిరోజులుగా తెలంగాణలో రాజకీయ సవాళ్ల కాలం నడుస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్‌‌పై విమర్శల వర్షం గుప్పించారు. దీంతో సీఎం వ్యాఖ్వలపై స్పందించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరిలో తనపై పోటీకి దిగాలని సవాల్ విసిరారు.

కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ విసిరారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. కేటీఆర్ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని.. ఇద్దరం సిరిసిల్లలో తాడోపేడో తేల్చుకుందాంమని సవాల్ విసిరారు. కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేస్తున్నట్లు ప్రకటించాలని పేర్కొన్నారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనపై పోటీ చేసి గెలిచే దమ్ముందా కేటీఆర్ అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.


Read More: Dharani Special Drive : ధరణి స్పెషల్ డ్రైవ్‌‌లో అధికారులు ఏం చేస్తారంటే..!

ప్రజలు బీఆర్ఎస్‌ను బొందపెట్టారని మంత్రి తెలిపారు. మేడిగడ్డ పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. కేటీఆర్ సిరిసిల్లో గెలవాలని రూ. 200 కోట్లు ఖర్చుచేశారని.. కేవలం 30 వేల ఓట్ల మెజార్టీతో బ్రతికి బయటపడ్డారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఒక వేళ తాను అలా గెలిస్తే మాత్రం రాజీనామా చేసేవాడినని మంత్రి స్పష్టం చేశారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల గతే పడుతుందని మంత్రి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కల్వకుంట్ల కుటుంబం ఏటీఎంలా వాడుకుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలను విమర్శించే వారిలో ముందు వరుసలో ఉంటారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులపై తనదైన శైలిలో విమర్శిస్తుంటారు. ప్రతిపక్షాలకు సవాల్ విసిరే నేతల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు ముందు వినిపిస్తుంది.

2018లో నల్గొండ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కోమటిరెడ్డి ఆ తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో మళ్లీ నల్గొండ నుంచే పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 50 వేల పై చిలుకు మెజార్టీతో సమీప అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కంచర్ల భూపాల్ రెడ్డిపై ఘనవిజయం సాధించారు.

తాజాగా మంత్రి కోమటిరెడ్డి నల్గొండ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా కేటీఆర్‌కు సిరిసిల్లలో రాజీనామా చేసే దమ్ముందా అని ప్రశ్నించడంతో మంత్రి సవాల్‌ను స్వీకరించే ధైర్యం కేటీఆర్‌కు ఉందా అని పార్టీ నేతల్లో కొత్త చర్చలకు దారి తీస్తోంది.

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×