Big Stories

Komatireddy : మోదీతో కోమటిరెడ్డి భేటీ.. ఆ విషయాలపైనే చర్చ..

Komatireddy : ప్రధాని మోదీతో భేటీ తర్వాత కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన విషయాలేవి ప్రకటించలేదు. మోదీతో దాదాపు 20 నిమిషాలపాటు వివిధ చర్చించానని కోమటిరెడ్డి వెల్లడించారు. మూసీనది ప్రక్షాళన చేయాలని కోరానన్నారు. గతంలో గుజరాత్‌లో సబర్మతి నది కూడా మూసిలాగే ఉండేదన్నారు. హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి 6 లైన్స్ చేయాలని కోరానని తెలిపారు. జీఎంఆర్ సంస్థ 6 లైన్స్ నిర్మాణం ఆలస్యం చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రధానికి వివరించానన్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్‌లో ఉందా అని ప్రధాని అడిగారన్నారు. అన్ని పరిస్థితులు మీకే తెలుసు అని అన్నానని ఎంపీ కోమటిరెడ్డి వివరించారు.

- Advertisement -

ఎన్నికలకు ముందే రాజకీయాలపై మాట్లాడుతానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేస్తానా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా అనేది అప్పుడే చెప్తానన్నారు. ప్రస్తుతం రాజకీయాలపై మాట్లాడనని తేల్చేశారు. ఎన్నికలకు ఒక నెల ముందు మాట్లాడుతానని తెలిపారు. ప్రధానితో చర్చించిన కొన్ని అంశాలు బయటకు చెప్పలేనన్నారు. కాంగ్రెస్ కమిటీలో చోటు దక్కలేదని బాధలేదన్నారు. మంత్రి పదవిని లెక్క చేయలేదని… తెలంగాణ కోసం రాజీనామా చేశానని గతంలో చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ కోమటిరెడ్డి చొప్పుకొచ్చారు.

- Advertisement -

ప్రధానితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ రాజకీయ కోణంలో జరిగిందేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీలో చేరడం ఖాయమనే చర్చ నడుస్తోంది. సోదరుడు బాటలోనే కాషాయ కండువా కప్పుకుంటారని టాక్ నడుస్తోంది. ఇక కాంగ్రెస్ గుడ్ బై చెబుతారని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మోదీతో భేటీ అయ్యారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News