BigTV English

Kishan Reddy: కిషన్‌రెడ్డికి అధ్యక్ష పదవి అంటగట్టారా? ముళ్ల కిరీటమేనా?

Kishan Reddy: కిషన్‌రెడ్డికి అధ్యక్ష పదవి అంటగట్టారా? ముళ్ల కిరీటమేనా?
kishan reddy

Kishan Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి. ఆయన హైదరాబాద్‌లో ఉండగా.. ఢిల్లీలో ప్రకటించింది అధిష్టానం.అధ్యక్ష పదవి వచ్చిందని తెలీగానే.. ఎగిరి గంతేయలేదాయన. కనీసం స్పందించనూ లేదు. మీడియా మైకులు తోసుకుంటూ వెళ్లిపోయారు. వెంటనే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.


ఏంటి సంగతి? పార్టీ బాధ్యతలు ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదని తెలుస్తోంది. అధ్యక్ష మార్పుపై కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలోనూ కిషన్‌రెడ్డి విముఖంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఆయన వద్దంటున్నా.. అధిష్టానం ఆయనే కావాలంటోందని ప్రచారం జరిగింది. అన్నట్టుగానే కిషన్‌రెడ్డి సీనియార్టీకే పట్టం కట్టింది అధిష్టానం. ఆయన హర్ట్ కాకుండా.. కేంద్రమంత్రి పదవి కూడా అలానే ఉంచింది. రెండు పడవల మీద కాలును కంటిన్యూ చేసింది.

ప్రస్తుత సమయంలో పార్టీ అధ్యక్ష పదవి అంటే ఆశామాషీ కాదు. అది ముళ్ల కిరీటమేనని భావిస్తున్నారు కిషన్‌రెడ్డి. రోజూ వార్తల్లో ఉండాలి. ప్రతీరోజూ కేసీఆర్‌ను తిట్టిపోస్తుండాలి. ఎక్కడ ఏం జరిగినా స్పందించాలి. నేతలకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి. ప్రెస్‌మీట్లతో ఊదరగొట్టాలి. పంచ్ డైలాగులు, స్ట్రాంగ్ వార్నింగులు ఇవ్వాలి. మరీ ముఖ్యంగా.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి పోటాపోటీగా రాజకీయం చేయాలి. ఇవన్నీ కిషన్‌రెడ్డి వల్ల అయ్యేవేనా?


ఈ విషయం ఆయనకూ బాగా తెలుసు. కిషన్‌రెడ్డిపై సాఫ్ట్ లీడర్‌గా అనే ముద్ర ఉంది. దూకుడు తక్కువ. మాటలు మెతక. బండి సంజయ్‌లా కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అనే రకం కాదు. బీజేపీకి అలాంటి లీడర్ అస్సలు షూట్ అవరు. అందులోనూ బండి సంజయ్ తర్వాత బాధ్యతలు స్వీకరిస్తే.. ఆ పోలికా, తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందుకే, కిషన్‌రెడ్డి పార్టీ పదవిపై అంత ఆసక్తిగా లేరని తెలుస్తోంది.

కేంద్రమంత్రిగా బిందాస్‌గా ఉన్నారు కిషన్‌రెడ్డి. ప్రధాని మోదీకి సన్నిహితంగా మెదులుతున్నారు. పార్లమెంట్‌లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. జాతీయ స్థాయిలో బాగా ఇమేజ్ సంపాదిస్తున్నారు. ఇలా కొంతకాలంగా కూల్‌గా సాగిపోతున్న లైఫ్‌స్టైల్.. పార్టీ అధ్యక్ష పదవితో ఒక్కసారిగా కుదుపులు తప్పకపోవచ్చు. ఇన్నాళ్లూ చెమట పట్టకుండా రాజకీయం చేస్తూ వస్తున్న కిషన్‌రెడ్డి.. ఇప్పుడిక పార్టీ కోసం చెమటలు కక్కాల్సిన సమయం వచ్చేసరికి.. వెన్ను చూపిస్తున్నారని అంటున్నారు. ఇష్టం లేకపోయినా.. వద్దు మొర్రో అంటున్నా.. ఎలాగూ తన పేరు ప్రకటించేశారు కాబట్టి.. హైకమాండ్‌తో ఫైనల్ టాక్స్ కోసం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు కిషన్‌రెడ్డి. మరి, అంటగట్టిన పదవిని వదిలించుకుని తిరిగొస్తారో.. లేదంటే, ముళ్ల కిరీటంతోనే వస్తారో.. చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×