EPAPER

Khammam Floods: మరోసారి డేంజర్ బెల్స్..అప్రమత్తమైన ప్రభుత్వం

Khammam Floods: మరోసారి డేంజర్ బెల్స్..అప్రమత్తమైన ప్రభుత్వం

Heavy Floods in Khammam District Government Alert: ఖమ్మంలో మరోసారి డేంజర్ బెల్స్ నెలకొన్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి మున్నేరు నదికి వరద పెరిగింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద పెరిగింది.


రాత్రి కురిసిన భారీ వర్షానికి మున్నేరుకు వరద క్రమంగా పెరుగుతుంది. దాదాపు రాత్రి 8 అడుగుల నీటి ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం 16 అడుగులు దాటి ప్రవాహం వస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ నేపథ్యంలో శివారు కాలనీలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. దానవాయిగూడెం, రామన్నపేట, ప్రకాష్ నగర్, మోతీనగర్  ముంపు ప్రాంతాల ప్రజలను అర్దరాత్రి పునరావాస కేంద్రాలకు తరలించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.


మరోవైపు, భారీ వర్షాలు, వరదలతో ప్రధాన నదులు పొంగిపొర్లుతున్నాయి. అయితే రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగండంగా మారనుంది. మూడు రోజుల పాటు వాయు గుండం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదిలా ఉండగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాత్రి ఖమ్మం చేరుకున్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించారు. మున్నేరు శివారు ప్రాంతంలోని ప్రజలను పరామర్శించారు. వరద ఉద్ధృతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.

అలాగే, మున్నేరు నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం సహాయక చర్యల శిబిరాలను మళ్లీ తెరవాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి భారీ వర్షాలు కురిశాయి. శనివారం రాత్రి 8.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అత్యధికంగా మహబూబాబాద్‌లో 18.2 సెం.మీ వర్షపాతం నమోదైంది.

ఖమ్మంలో జిల్లా తల్లాడలో 12.2 సెం.మీ, రంగారెడ్డి జిల్లా చుక్కాపూర్‌లో 11.1సెం.మీ, అమనగల్‌లో 9.8, భద్రాద్రి జిల్లా చంద్రుగొండలో 9.3 సెం.మీల వర్షం కురిసింది. ఈ వర్షాలకు మున్నేరు నదితోపాటు పలు వాగులకు వరద ఉధృతి పెరిగింది.

Also Read: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

ఇదిలా ఉండగా, ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ఖమ్మంలోని 16వ డివిజన్ ధంసాలపురంలో వరద బాధితులను పరామర్శించనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని తిర్మలాయపాలెం, రాకాసి తండాలో బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద బాధితులకు కిషన్ రెడ్డి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నారు.

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×