EPAPER

Khairtabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జనం పూర్తి.. ఊపిరి పీల్చుకున్న అధికారులు

Khairtabad Ganesh: ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జనం పూర్తి.. ఊపిరి పీల్చుకున్న అధికారులు

Khairtabad Ganesh idol Immersion: ఖైరతాబాద్ భారీ వినాయకుడి విగ్రహం గంగమ్మ ఒడికి చేరుకుంది. సూపర్ క్రేన్ సాయంతో మహా గణపతి నిమజ్జన కార్యక్రమం నిర్వంచారు. ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ -4 వద్ద హుస్సేన్ సాగర్ లో భారీ గణనాథుడిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాాయి. ఎక్కడ చూసినా భక్తులతో హుస్సేన్ సాగర్ పరిసరాలు కిటకిటలాడుతున్నాాయి. అనుకున్న సమయంలోగా ప్రశాంత వాతావరణంలో భారీ వినాయకుడి నిమజ్జనం పూర్తవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మిగతా వినాయకుల నిమజ్జన ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇటు బలాపూర్ భారీ గణేషుడు కూడా హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ క్రేన్ 12 వద్ద ఈ వినాయకుడిని హుస్సేన్ సాగర్ నిమజ్జనం చేయనున్నారు. భక్తులు, యువత, కుటుంబ సమేతంగా ప్రజలు ట్యాంక్ బండ్ కు భారీగా చేరుకుని వినాయకుల నిమజ్జనాాలను తిలకిస్తున్నారు. యువత పెద్ద ఎత్తున బ్యాండ్ చప్పుళ్ల మధ్య స్టెప్స్ వేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. దీంతో హుస్సేన్ సాగర్ పరిసరాలు యువత కేరింతలతో కోలాహలంగా మారింది. ఈ క్రమంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.


Also Read: హుస్సేన్ సాగర్‌కు వెళ్లిన సీఎం రేవంత్.. అక్కడే రోడ్లు ఊడుస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిని చూసి..


Related News

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Bhadradri Temple chief priest: భద్రాచలం ప్రధాన అనుచరుడిపై వేటు.. లైంగిక వేధింపులు.. లాగితే విస్తుపోయే నిజాలు!

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Special Trains: సంక్రాంతి.. కోచ్‌ల పెంపు, ఆపై ప్రత్యేకంగా రైళ్లు!

Hydra: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

Big Stories

×