EPAPER
Kirrak Couples Episode 1

KCR : మళ్లీ అధికారం మాదే.. 95 సీట్లు ఖాయం : కేసీఆర్

KCR : మళ్లీ అధికారం మాదే.. 95 సీట్లు ఖాయం : కేసీఆర్

KCR : తెలంగాణలో మళ్లీ అధికారం బీఆర్ఎస్ దేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గత ఎన్నికల కంటే 7,8 సీట్లు ఎక్కువగానే వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావం- సాధించిన ప్రగతిపై శాసన సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో కేసీఆర్ మాట్లాడారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సాధించిన ప్రగతిని కేసీఆర్ వివరించారు. నెల రోజుల్లో రైతు రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. గ్రూప్‌-2 సహా ఉద్యోగ నియామక పరీక్షలు దశల వారీగా నిర్వహిస్తామని తెలిపారు.


మజ్లీస్‌ బీఆర్ఎస్ కు ఎప్పుడైనా మిత్ర పక్షమేనని కేసీఆర్ అన్నారు. భవిష్యత్‌లోనూ ఆ పార్టీని కలుపుకొని పోతామని ప్రకటించారు. బ్రాహ్మణులకైనా, మైనార్టీలకైనా బహిరంగంగానే మంచి చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎప్పుడూ లౌకికవాద పార్టీయేనని స్పష్టం చేశారు. అమలు చేయలేని హామీలను ఎప్పుడూ ఇవ్వమన్నారు. తమ అమ్ముల పొదిలో చాలా అస్త్రాలు ఉన్నాయని తెలిపారు. ఆ అస్త్రాలు సంధిస్తే విపక్షాలు గాలిలో కొట్టుకుపోతాయని హెచ్చరించారు. ఆర్థిక వనరులు సమకూరగానే మళ్లీ ఉద్యోగుల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఐఆర్‌ ప్రకటిస్తామన్నారు.

ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంటింటికీ 20 వేల లీటర్ల మంచినీరు ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. 13 రాష్ట్రాలు, కొన్ని దేశాల ప్రతినిధులు మిషన్‌ భగీరథను అధ్యయనం చేస్తున్నాయన్నారు. పారిశుద్ధ్యం, మంచినీరు విషయంలో కేంద్రం ఎన్నో అవార్డులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణకు రూపాయి ఇవ్వని కేంద్రం అవార్డులు మాత్రం ఎక్కువ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో 35 వేల చెరువులు అదృశ్యమయ్యాయని ఆరోపించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారన్న కేసీఆర్.. ఆ ప్రాజెక్టు నుంచే తుంగతుర్తి, కోదాడ, డోర్నకల్‌కు నీళ్లు వెళ్తున్నాయని తెలిపారు.


కేంద్రంపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో తీవ్ర నష్టం జరిగితే కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకపోతే ఎఫ్‌ఆర్‌బీఎంలో కేంద్రం కోత విధించిందని మండిపడ్డారు. దీంతో ఐదేళ్లలో రూ.25వేల కోట్లు నష్టపోయామన్నారు.

ధాన్యం దిగుమతిలో పంజాబ్‌ను తెలంగాణ అధిగమిస్తోందని తెలిపారు. గోదాముల్లో ప్రస్తుతం కోటి టన్నులు ధాన్యం ఉందని వెల్లడించారు. ధరణి వల్ల 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయని తెలిపారు. రైతు చనిపోయిన వారంలోనే బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇస్తున్నామని వివరించారు.హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి స్థిరాస్తి కంపెనీలు వస్తున్నాయన్నారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2.47 లక్షల కోట్లకు పెరిగాయని వెల్లడించారు.

Related News

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు నైనికా వెన్నుపోటు, సీత చేతికి ఆయుధం.. ఈసారి చీఫ్ అయ్యేది ఎవరు?

Medigadda: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు!

Monkeypox Virus: డేంజర్ బెల్స్.. మరో మంకీపాక్స్‌ కేసు.. ఎమర్జెనీకి దారితీసిన వైరస్ ఇదే!

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Big Stories

×