EPAPER
Kirrak Couples Episode 1

KCR : నాడు హేళన చేశారు.. నేడు తెలంగాణ పునర్నిర్మాణానికి కొత్త సచివాలయమే సాక్ష్యం : కేసీఆర్

KCR : నాడు హేళన చేశారు.. నేడు తెలంగాణ పునర్నిర్మాణానికి కొత్త సచివాలయమే సాక్ష్యం : కేసీఆర్

KCR : హైదరాబాద్ లో తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్‌ తన సందేశం ఇచ్చారు. అత్యద్భుతంగా నిర్మించిన స‌చివాల‌యం తన చేతుల మీదుగా ప్రారంభించ‌డం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉందని స్పష్టం చేశారు. సచివాలయ తరహాలోనే తెలంగాణ పల్లెలు వెలిగిపోతున్నాయని వివరించారు.


చాలాకాలం పోరాటం చేసిన త‌ర్వాత రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్‌ అన్నారు. స‌మైక్య పాల‌న‌లో తెలంగాణ‌లో చాలా విధ్వంసం జ‌రిగిందని ఆరోపించారు. నీళ్లు రావడం సాధ్యం కాదని.. తెలంగాణ వెనుక‌బ‌డిన ప్రాంతం అని చెప్పారని గుర్తు చేశారు. ప్లానింగ్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియాలో కూడా హైద‌రాబాద్ మిన‌హా అన్ని జిల్లాల‌ను వెనుక‌బ‌డిన జిల్లాల్లో చేర్చారని తెలిపారు. నేడు తెలంగాణ సాధించిన ప్రగ‌తిలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. అందరూ క‌లిసి ప‌ని చేయ‌డం వ‌ల్లే ప్రగ‌తి సాధ్యమైందని స్పష్టం చేశారు. అద్భుత‌మైన రాష్ట్రాన్ని నిర్మించుకున్నామన్నారు.

స‌మాన హ‌క్కుల కోసం ఉద్యమించాల‌ని, స‌మీక‌రించు, బోధించు, పోరాడు అని సందేశం ఇచ్చిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో గాంధేయమార్గంలో పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ చెప్పారు. అంబేద్కర్ చూపించిన మార్గంలోనే ప్రయాణం కొన‌సాగుతోందని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ -3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నిత్యం అంబేద్కర్ స్ఫుర‌ణ‌కు రావాల‌నే ఉద్దేశంతో స‌చివాల‌యానికి ఆ మ‌హానీయుడి పేరు పెట్టామన్నారు. అంబేద్కర్ అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తామ‌ని హామీ ఇచ్చారు.


తెలంగాణ ఏర్పడిన కొత్తలో పున‌ర్నిర్మాణం కోసం అంకిత‌భావంతో అడుగేసే స‌మ‌యంలో కొంద‌రు హేళన చేశారని కేసీఆర్ విమర్శించారు. మొత్తం తెలంగాణ‌నే కూల‌గొట్టి క‌డతారా? అని చిల్లర ప్రశ్నలు వేశారని మండిపడ్డారు. ఆ విమర్శలను ప‌ట్టించుకోకుండా రాష్ట్రాన్ని పున‌ర్నిర్మాణం చేసుకున్నామన్నారు. సమ్మిళిత అభివృద్ధితో తెలంగాణ ముందుకెళ్తోందని కేసీఆర్ అన్నారు. ఐటీలో బెంగళూరును దాటి ముందుకెళుతోందన్నారు. యాదాద్రి.. భూలోక వైకుంఠంగా విరాజిల్లుతోందన్నారు. కొత్త సచివాలయం తెలంగాణ పునర్నిర్మాణానికి నిలువెత్తు సాక్ష్యం అని కేసీఆర్‌ స్పష్టంచేశారు.

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Big Stories

×