EPAPER

KCR vs Revanth Reddy : కేసీఆర్‌కు రేవంత్ ఫీవర్!

KCR vs Revanth Reddy : కేసీఆర్‌కు రేవంత్ ఫీవర్!

KCR vs Revanth Reddy : బీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే అన్ని ఆరోపణలను ఏకరవు పెడుతున్నారు. కరెంట్‌, రైతు బంధు అంటూ ఇన్నాళ్లూ కర్ణాటక జపం చేసిన గులాబీ బాస్‌.. తాజాగా మరో అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పాచికలు ఏవీ పారడం లేదని భావించి ముఖ్యమంత్రుల ప్రస్తావన తెస్తున్నారు. అందులోనూ రేవంత్‌రెడ్డి సీఎం కాబోరంటూ కేసీఆర్ కామెంట్స్‌ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. హస్తం పార్టీలో 15 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని చెబుతూనే .. 20 సీట్లు కూడా గెలవరనడం వెనక మతలబు ఏంటనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ గెలవడం.. అందులోనూ రేవంత్‌రెడ్డి సీఎం అయితే తనకి గడ్డు పరిస్థితి వస్తుందనే ఆలోచనతో కేసీఆర్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే రేవంత్‌ జోరును అడ్డుకునేందుకు కొడంగల్‌లో కేసీఆర్‌ ప్రజాశీర్వాద సభ నిర్వహించి.. కామారెడ్డిలోనూ గెలవనీయొద్దని పిలుపునిస్తున్నారు.


సాధారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరును ప్రస్తావించరు. ఆయన మాటెత్తేందుకు కూడా సాహసించరు. రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌ను గట్టిగా కార్నర్‌ చేయడమే అందుకు ప్రధాన కారణం. కల్వకుంట్ల కుటుంబం అవినీతి అంటూ పీసీసీ చీఫ్‌ లెక్కలతో సహా బయటపెడుతుంటారు. ఈసారి కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కేసీఆర్‌ను జైల్లో వేస్తామని వార్నింగ్‌ ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దగ్గర్నుంచి.. మేడిగడ్డ కుంగుబాటు వరకు బీఆర్ఎస్‌ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతున్నారు. ధరణి కుంభకోణం సహా ఔటర్‌ రింగ్‌రోడ్డు అక్రమాలు ఇలా అన్నింటిని నిలదీస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఎన్ని ఆరోపణలు చేసినా వాటిపై కేసీఆర్‌ ఇన్నాళ్లూ స్పందించలేదు. రేవంత్‌రెడ్డి మాటలను లైట్‌గా తీసుకున్నారు. కానీ, ఉన్నట్టుండి గులాబీ బాస్‌ రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. అందులోనూ రేవంత్‌ పోటీ చేస్తున్న అతని సొంత ఇలాఖా కొడంగల్‌ వెళ్లి మరీ నరేందర్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని గెలిపిస్తారేమో అనే సందేహాన్నీ వెలిబుచ్చారు కేసీఆర్‌. అలాగే కామారెడ్డిలోనూ పోటీ చేస్తూ కొరకరాని కొయ్యగా మారారు. రెండు చోట్లా రేవంత్‌రెడ్డిని ఓడించాలని స్వయంగా కేసీఆర్‌ బతిమాలుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ 20 సీట్లు గెలవదని చెబుతూనే 15 మంది ముఖ్యమంత్రి కేండెట్లు ఉన్నారని అంటున్నారు. అందులోనూ రేవంత్‌రెడ్డి సీఎం అవుతారంటే మోసపోవద్దని అనడం కేసీఆర్‌కి సిగ్నల్స్‌ ఉన్నట్లు కనిపిస్తోంది.

అనేక అంశాల్లో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలంటూ రేవంత్‌రెడ్డి ప్రశ్నలు సంధించారు. మేడిగడ్డ కుంగుబాటు, ధరణిపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. కర్ణాటకలో కరెంట్‌ సరఫరా.. గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు రావాలని కామారెడ్డిలో ఎదురు చూశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లీజ్‌ వ్యవహారం, ఇలా ఒకటి కాదు బీఆర్ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం పోరాడుతున్నారు. చివరకు ఎన్నికల్లో బీజేపీ-బీఆర్ఎస్‌-మజ్లిస్‌ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని ఎండగడుతున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణానికి రావాలని సవాల్‌ విసిరారు. చాలా ఇష్యూస్‌లో రేవంత్‌రెడ్డి బలమైన వాదనలు వినిపిస్తున్నారు. బీఆర్ఎస్‌ అవినీతిని ఎండగడుతున్నారు. కేసీఆర్‌ను బీజేపీ హైకమాండ్‌ కాపాడుతోందని.. బీ-టీమ్‌ వ్యవహారాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్‌ అయ్యారు. అందుకే గతానికి భిన్నంగా కేసీఆర్‌… రేవంత్‌రెడ్డి పేరెత్తుతున్నారు. అందులోనూ తెలుగు భాషను అన్ని యాంగిల్స్‌లో పాండిత్యాన్ని ప్రదర్శించే కేసీఆర్‌.. లేటెస్ట్‌గా రేవంత్‌రెడ్డి మాటతీరును తప్పుపట్టడం చర్చకు దారితీస్తోంది. అలాగే ముఖ్యమంత్రి అవుతారేమో అని రేవంత్‌రెడ్డికి ఓటు వేస్తారేమో అనే సందేహాలు లేవనెత్తడం కూడా కొడంగల్‌లో హాట్‌ టాపిక్‌ అయింది.


కొండగల్‌లో తనపై పోటీ చేయాలంటూ రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌కు‌ సవాల్‌ విసిరారు. ఆయన స్పందించకపోవడంతో రేవంత్‌ .. కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీకి దిగారు. మైనార్టీ అభ్యర్థి షబ్బీర్‌ అలీపై కేసీఆర్‌ కక్ష సాధింపు రాజకీయాలు చేసే ప్రయత్నానికి గట్టిగా బదులిచ్చారు. కేసీఆర్‌ తరహాలోనే… రేవంత్‌రెడ్డి కామారెడ్డితో పాటు కొడంగల్‌లో రెండు చోట్లా పోటీ చేయడం గులాబీ బాస్‌కు మింగుడు పడకుండా చేసింది. రేవంత్‌ కూడా ముఖ్యమంత్రి క్యాండెట్‌లా రెండు చోట్లా పోటీ చేయడం గుబులు పట్టుకునేలా చేసింది. రేవంత్‌ సీఎం అవుతారని రెండు చోట్లా అతన్నే జనం గెలిపించేలా ఉన్నారని కేసీఆర్‌ .. కొడంగల్‌లో చేసిన వ్యాఖ్యలతో క్లారిటీ వస్తోంది. అలాగే కాంగ్రెస్‌ పార్టీ 20 సీట్లు కూడా గేలవదంటూనే 15 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారనే విషయం కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నమని స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌ సీఎంను నిర్ణయించేంది హైకమాండ్.. ఓట్లేసి గెలిపించేది రాష్ట్ర ప్రజలు.. మరి అలాంటిది రేవంత్‌రెడ్డి పేరు చెప్పి కేసీఆర్‌ భయపడటం వెనక ఆంతర్యం ఏంటనేది పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చకు దారితీస్తోంది. రేవంత్‌ను కామారెడ్డిలోనే కేసీఆర్‌ అడ్డుకోవచ్చు.. అలాంటిది కొడంగల్‌ వెళ్లి మరీ సీఎం అవ్వడనడనం వెనక మతలబు ఏంటి.. రేవంత్‌రెడ్డి సీఎం అయితే కొరకరాని కొయ్యగా మారతారానేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. 80 నుంచి 90 సీట్లలో జయకేతనం ఎగురవేయడం ఖాయమని హస్తం నేతలు ధీమాగా చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి సైతం అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రచార సభల్లో దూసుకెళ్తున్నారు. జనాన్ని ఉత్సాహపరిచేలా అభయ హస్తం ఆరు గ్యారెంటీలను బలంగా వినిపిస్తున్నారు. దీనికి తోడు రేవంత్‌రెడ్డి హాజరవుతున్న కాంగ్రెస్‌ విజయభేరి సభల్లో సీఎం.. సీఎం.. అంటూ జనం ఉత్సాహపరుస్తున్నారు. తాజాగా కేసీఆర్‌ .. రేవంత్‌ పేరును ప్రస్తావిస్తుండటం ఫ్యూచర్‌ కళ్లకు కనిపిస్తోందనే టాక్‌ నడుస్తోంది.

.

.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×