EPAPER
Kirrak Couples Episode 1

BRS: ఏపీలో బీఆర్ఎస్ కి అంత డిమాండ్ ఉందా? కేసీఆర్ గోల్ మాల్ పాలి-ట్రిక్స్?

BRS: ఏపీలో బీఆర్ఎస్ కి అంత డిమాండ్ ఉందా? కేసీఆర్ గోల్ మాల్ పాలి-ట్రిక్స్?

BRS: ఏపీ బీజేపీకి తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా ప్రకటించారు కేసీఆర్. రావెల కిశోర్ బాబును జాతీయ రాజకీయాల్లో వాడుకుంటానన్నారు. వాళ్లిద్దరితో పాటు మరో నలుగురు ఐదుగురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. అలా.. ఎలాగోలా.. ఏపీలో బీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభించేశారు గులాబీ బాస్. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన పలు వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి.


సంక్రాంతి తర్వాత ఏపీ బీజేపీ కార్యాలయం నేతలతో కిక్కిరిసిపోతుందని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ లో చేరుతామంటూ తనకు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఫోన్ చేశారంటూ బాంబు పేల్చారు. మీరెందుకు వస్తామంటున్నారు.. మీరు ఇప్పటికే సిట్టింగులు కదా..అని అడిగితే.. ఇక్కడ ఫిట్టింగ్ కాలేకపోతున్నామని వారు కేసీఆర్ తో చెప్పారట. గులాబీ బాస్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీలో రాజకీయ కలకలం రేపుతున్నాయి.

అవునా? నిజమా? ఏపీలో బీఆర్ఎస్ కు అంత డిమాండ్ ఉందా? అని అవాక్కవుతున్నారు కేసీఆర్ స్పీచ్ విన్నవారు. నేతలతో పార్టీ ఆఫీస్ కిక్కిరిసిపోతుందంటే.. కొత్తపార్టీ అన్నాక.. ఏదో ఒక రాజకీయ వేదిక కోసం చూసే ఎవరో ఒకరు బీఆర్ఎస్ లో చేరడం కామన్. కానీ, ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని కేసీఆర్ చెప్పడం.. అది నిజమే అయితే, ఇది మామూలు విషయం మాత్రం కాదు.


ప్రస్తుతం ఏపీలో వైసీపీ, టీడీపీలకే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. జనసేన సభ్యుడు అధికారపార్టీ కండువా కప్పేసుకున్నారు. మరి, బీఆర్ఎస్ లోకి సిట్టింగులు వెళ్లాలంటే అది వైసీపీ నుంచి గానీ, టీడీపీ నుంచి గానీ వెళ్లాల్సి ఉంటుంది. అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఎందుకు చేరుతారు? ప్రస్తుతం బలంగా ఉన్న పార్టీ నుంచి కొత్తగా వచ్చే బీఆర్ఎస్ లోకి ఎవరైనా ఎందుకెళతారు? ఒకవేళ జగన్ సర్వేలో నెగెటివ్ రిపోర్ట్ వచ్చి, వచ్చేసారి టికెట్ రాదనే అనుమానం ఉన్నవాళ్లు కేసీఆర్ తో టచ్ లోకి వెళ్లారా? అనే అనుమానం కూడా లేకపోలేదు.

ఇక, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు ఏమైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా? ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనంటూ జనసేనాని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే, టీడీపీ-జనసేన-బీజేపీ కలిస్తే.. బలమైన కూటమిగా మారడం ఖాయం. అందుకు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు టీడీపీ సిట్టింగులు చంద్రబాబును కాదని.. బీఆర్ఎస్ వైపు ఎందుకు చూస్తారు? వైసీపీలోనైనా కొందరు సిట్టింగులకు టికెట్లు రావేమో కానీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ మరోసారి పార్టీ తరఫున బరిలో దిగుతారు. ఈ లెక్కన.. అటు వైసీపీ, ఇటు టీడీపీ.. ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ బీఆర్ఎస్ లో చేరే అవకాశమే లేదని కొట్టిపడేస్తున్నారు. ఇదంతా కేసీఆర్ మార్క్.. గోల్ మాల్ గత్తర్ పాలి-ట్రిక్స్ అంటున్నారు.

కావాలనే.. పార్టీలను, నేతలను కన్ఫ్యూజన్ లో పడేయాలనే టార్గెట్ తోనే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. ఏపీలో బీఆర్ఎస్ కు ఏమాత్రం స్కోప్ లేకున్నా.. ఏదో జరిగిపోతోంది.. ఎవరో రాబోతున్నారు.. నేతలతో కిక్కిరిసిపోతుందంటూ.. ఆయనకు ఆయనే బిల్డప్ ఇచ్చుకుని.. బీఆర్ఎస్ ను ప్రమోట్ చేసుకునే స్ట్రాటజీ కాక మరొకటి కాదంటున్నారు విశ్లేషకులు.

అయితే, ఏపీలో బీఆర్ఎస్ ఓ అవకాశం మాత్రం ఉండొచ్చు. వైసీపీ నుంచి టికెట్ రాని వాళ్లు బీఆర్ఎస్ లో చేరొచ్చు. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తే.. పొత్తులో భాగంగా టికెట్ రాని ఆశావహులు, తాము సొంతంగా గెలవగలమనే ధీమా ఉన్న వాళ్లకు.. బీఆర్ఎస్ రూపంలో ఓ ఆప్షన్ అయితే ఉండొచ్చు. అలా చేస్తే, ఎలక్షన్ కు పార్టీ ఫండ్ రూపంలో ఆర్థికంగా కాస్త కలిసిరావొచ్చు. కానీ, పోయిపోయి ఆంధ్ర వ్యతిరేకిగా ముద్ర ఉన్న కేసీఆర్ పార్టీలో చేరేంత సాహసం ఏపీ నేతలు చేస్తారా? బీఆర్ఎస్ లో చేరడం ఆయా నేతలకు ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? భారీగా చేరికలు ఉండబోతున్నాయనడం కేసీఆర్ స్టైల్ బిల్డప్ రాజకీయమేనా?

Related News

Pawan Kalyan : దేవాలయాలకు అసలైన అర్థం ఇదే.. ఇస్రో మాజీ చీఫ్ వీడియోపై పవన్ ట్వీట్

Tirumala Laddu: టెర్రరిస్ట్ లు కూడా ఈ పని చేయరు.. లడ్డు వివాదంపై అగ్ర హీరో సంచలన కామెంట్స్

Naga Babu : పెద్దల సభకు మెగా బ్రదర్ నాగబాబు ? అదే జరిగితే చిరు తర్వాత నాగబాబే !

AP Govt: రేషన్ కార్డ్ ఉంటే చాలు.. ఈ స్కీమ్ తో వేల రూపాయల ఆదా.. దీపావళి నుండే ప్రారంభం..

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Nara Bhuvaneshwari: ప్లీజ్ ఈ ఒక్క మాట వినండి.. ప్రజలను కోరిన సీఎం సతీమణి

Perni Nani: మీ హాస్పిటల్ లో భజన చేసుకోండి.. ఒక్క హిందువుకైనా ఫ్రీగా వైద్యం అందించారా.. బీజేపీ మహిళా నేతకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్

Big Stories

×