EPAPER

KCR Speech at Assembly: ఆర్థిక మంత్రి వొత్తి వొత్తి పలకడం తప్ప కొత్తగా ఏమీ లేదు: కేసీఆర్

KCR Speech at Assembly: ఆర్థిక మంత్రి వొత్తి వొత్తి పలకడం తప్ప కొత్తగా ఏమీ లేదు: కేసీఆర్

KCR Speech at Assembly(Latest news in Telangana): ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందంటూ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.


‘ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచారు. ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాలకు నిరాశే. గొర్రెల పంపిణీ పథకాన్ని పూర్తిగా మూసివేసినట్లు అర్థమవుతోంది. దళిత వర్గాల కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు ప్రస్తావనే లేదు. మత్స్యకారులకు భరోసా లేదు. ఆర్థిక మంత్రి వొత్తి వొత్తి పలకడం తప్ప కొత్తగా ఏమీ లేదు. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని అనుకున్నాం. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది. బడ్జెట్‌లో ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకాన్ని ప్రకటించలేదు. బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉంది.. కొత్తేమీ లేదు. ప్రతి అంశాన్ని కూలంకషంగా వివరించాల్సి అవసరం ఉంది. రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతు శుత్రు ప్రభుత్వంగా మారింది కాంగ్రెస్. ఐటీ పాలసీ లేదు.. వ్యవసాయ స్థిరీకరణ లేదు. ఏ ఒక్క పాలసీ నిర్దిష్టంగా లేదు. ఈ బడ్జెట్‌పై చీల్చి చెండాడుతాం’ అంటూ కేసీఆర్ అన్నారు.

Also Read: అన్నదాతలకు సున్నం.. మహాలక్ష్ములకు మహామోసం: కేటీఆర్


‘బీఆర్ఎస్ హయాంలో మేం రెండు పంటలకు కూడా రైతుబంధు ఇచ్చాము. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ఎగ్గొడుతామని చెబుతున్నది. మేము రైతులకు ఇచ్చిన డబ్బులను దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వమని అర్థమవుతోంది. రాష్ట్రంలో ధాన్యంను కొనుగోలు చేయలేదు. విద్యుత్, నీటి సరఫరా, గొర్రెల పంపిణీ ఏమయ్యింది.? కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, వృత్తి కార్మికులను వంచించుతున్నది. ఇది పేదల, రైతు బడ్జెట్ కానేకాదు.

రైతు భరోసాలో అనేక ఆంక్షలు పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ ప్రభుత్వం ప్రజల గొంతు కోసింది. దళిత బంధు పథకం ప్రస్తావనే తీసుకరాకపోవడంతే ఈ ప్రభుత్వం తీరు ఏందో అర్థమవుతుంది. దళితులంటే ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదు. గొర్రెల పెంపకం పథకానికి ఈ ప్రభుత్వం తూట్లు పొడిచింది. బడ్జెట్ లో ఒక్క పద్దు కూడా పద్ధతిగా లేదు’ అంటూ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×