EPAPER

BRS MP Candidates First List : బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఇద్దరు పేర్లు ప్రకటించిన కేసీఆర్..

BRS MP Candidates First List : బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. ఇద్దరు పేర్లు ప్రకటించిన కేసీఆర్..

 


BRS MP Candidates First List

BRS MP Candidates First List : సార్వత్రిక ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేర్లను కేసీఆర్ ప్రకటించారు.


ఆదివారం తెలంగాణ భవన్ కు కేసీఆర్ వచ్చారు. కరీంనగర్, పెద్ద పార్లమెంట్ నియోజకవర్గాలతో నాయకులతో సమావేశమయ్యారు. మార్చి 10న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ అంశంపై ఆ నియోజకవర్గ నేతలతో చర్చించారు. ఈ నెల 12న కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు. ఈ భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేతలు హరీశ్ రావు, సంతోష్ కుమార్, వినోద్ కుమార్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు.

త్వరలో బస్సు యాత్రలు చేద్దామని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ సర్కార్ నీళ్లు, విద్యుత్‌ ఇవ్వట్లేదని ర ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన మాట ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో  సమస్యలు రావడం మాములు విషయంగా పేర్కొన్నారు. సమస్య వస్తే వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. పన్ను పాడైతే చికిత్స చేసుకుంటాం తప్ప పళ్లన్నీ పీకేసుకోలేం కదా అంటూ ప్రశ్నించారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కరీంనగర్ స్థానాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో బోయినపల్లి వినోద్ కుమార్ లోక్ సభ సభ్యుడిగా విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో గులాబీ పార్టీకి షాక్ తగిలింది. వినోద్ కుమార్ అనూహ్యంగా ఓడిపోయారు. అప్పుడు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సంచలన విజయం సాధించారు.  ఈ సారి కరీంనగర్ అభ్యర్థిగా బీజేపీ ఇప్పటికే బండి సంజయ్ ను ప్రకటించింది. ఒకరోజు వ్యవధిలోనే బీఆర్ఎస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తిగా మారింది.

Read More: సీఎం రేవంత్‌ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. నిధులివ్వాలని వినతి..

2014 ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున బాల్క సుమన్ విజయం సాధించారు.  2019 ఎన్నికల్లో కూడా కారు ఇక్కడ దూసుకుపోయింది. ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున వెంకటేశ్ నేత గెలిచారు. తాజాగా వెంకటేశ్ నేత బీఆర్ఎస్ షాకిచ్చారు. కారు దిగి హస్తం గూటికి చేరారు. దీంతో పెద్దపల్లి అభ్యర్థి కోసం కేసీఆర్ కసరత్తు చేశారు. చివరి కొప్పుల ఈశ్వర్ కి ఇచ్చారు.

కొప్పుల ఈశ్వర్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురిలో ఓటమిపాలయ్యారు. ఆయన బీఆర్ఎస్ సీనియర్ నేతగా ఉన్నారు. 2009, 2019 వరకు జరిగిన ఎన్నికల్లో  ధర్మపురిలో ఆయనే విజేతగా నిలిచారు. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ కు కేసీఆర్ మరో ఛాన్స్ ఇచ్చారు.

Tags

Related News

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Ram Charan : హాలీవుడ్‌లో అరుదైన గౌరవం… గ్లోబల్ స్టార్ అంటే ఇదే మరీ..!

CID Shakuntala: ఇండస్ట్రీలో విషాదం.. సిఐడి శకుంతల కన్నుమూత..!

Bigg Boss 8: చంద్రముఖిలా మారిన యష్మీ.. ఏడిపించేసిన విష్ణు

Big Stories

×