EPAPER

KCR Fake Promises: కేసీఆర్‌తో అట్లుంటది మరి..

KCR Fake Promises: కేసీఆర్‌తో అట్లుంటది మరి..

KCR Fake Promises: ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్‌కు ముందు ఓ సారి ఈ వ్యాఖ్యలు వినండి.. తమ పాలనలో సంక్షేమం నాలుగు కాళ్లపై నడవడం కాదు. పరిగెత్తింది. కాంగ్రెస్‌ వచ్చాక పథకాలన్ని పక్కేసుకొని పడుకున్నాయి అంటున్నారు కేసీఆర్. మరి ఇది నిజంగా నిజమేనా? అసలు ఈ పథకాలు ఎప్పుడు ఆగిపోయాయి? ఎందుకు ఆగిపోయాయి? ఒక్కసారి డిటెయిల్స్‌పై ఫోకస్ చేద్దాం.కేసీఆర్ మొన్న పచ్చని పొలాల మధ్య నిర్వహించిన పొలంబాట తర్వాత ప్రెస్‌మీట్ నిర్వహించారు. అప్పుడే ఈ వ్యాఖ్యలు చేశారు.. అయితే కేసీఆర్‌ చేసిన ఆరోపణల్లో నిజమెంత? నిజంగా పథకాలు ఎప్పటి నుంచి ఆగాయి? అని ప్రభుత్వ పెద్దలు ఫోకస్ చేశారు.


ఈ వివరాలన్నింటితో ఓ రిపోర్ట్ తయారు చేసి దానిని సీఎం రేవంత్ డెస్క్‌పైకి పంపారు.. ఇప్పుడీ డీటెయిల్స్‌ చూస్తే కాస్త షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. కాంగ్రెస్‌ సర్కార్ వచ్చాక కాదు.. అసలు బీఆర్ఎస్‌ హాయంలోనే లక్షలాది అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.. అంటే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచే ఈ పథకాలు ఆగిపోయాయి.. అనే విషయం క్లారిటీ వస్తుంది.కాస్త డెప్త్‌గా వెళదాం.. కళ్యాణలక్ష్మీ.. ఆడబిడ్డ పెళ్లి ఖర్చు కోసం తీసుకొచ్చిన పథకం.. గతేడాది జనవరి నుంచి.. గతేడాది అంటే 2023 జనవరి నుంచి కాంగ్రెస్‌ గవర్నమెంట్ అధికారం చేపట్టే వరకు.. అంటే డిసెంబర్ 7 నాటికి.. లక్షకు పైగా అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

ఇవి క్లియర్‌ చేయాలంటే అక్షరాలా వెయ్యి కోట్ల వరకు నిధులు ఖర్చు చేయాలి. ఎమ్మార్వో స్థాయి వెరిఫికేషన్‌లో 30 వేలు.. ఆర్డీవో స్థాయిలో మరో 55 వేలు.. ట్రెజరీలో బిల్లులు సాంక్షన్ కాకుండా మరో 20 వేలు.. ఇవీ పెండింగ్ లిస్ట్‌.. ప్రతిసారీ బడ్జెట్‌లో పెట్టడం.. నిధులు ఇవ్వకపోవడం. ఇదే సీన్‌ రీపిట్ అవుతోంది. 2023-24లో 3 వేల 210 కోట్లు కేటాయించింది బీఆర్ఎస్‌ సర్కార్.. కానీ ఆ స్థాయిలో మాత్రం నిధులను విడుదల చేయలేదు. అంటే అప్లికేషన్‌ ఇచ్చిన ఏడాది తర్వాత కూడా చెక్ వచ్చే పరిస్థితి లేదు. మరో స్కీమ్ చూద్దాం.. కేసీఆర్‌ హుజూరాబాద్ ఎన్నికల ముందు తీసుకొచ్చిన దళితబంధు స్కీమ్‌లో కూడా ఇదే సీన్.. అసలు రెండేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేసిన పరిస్థితే లేదు.. బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు తప్ప.. ఒక్క పైసా రిలీజ్‌ చేయలేదని అధికారుల రిపోర్ట్ చెబుతోంది.


Also Read: గుండెపోటుతో సీనియర్ ఐపీఎస్, విజిలెన్స్‌ డీజీ రాజీవ్‌ రతన్‌ కన్నుమూత

బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల 35 వేల కోట్ల నిధులు కొలాప్స్‌ అయినట్టు తెలుస్తోంది. 2022-23లో 15 వందల మంది లబ్ధిదారులకు 17 వేల 700 కోట్లు కేటాయించింది. 2023-24లోనూ సేమ్ కేటాయింపులు. సో.. రెండెళ్లలో మొత్తం 35 వేల కోట్లు లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది.. కానీ ఒక్కరికి కూడా ఇవ్వలేదు.. ఇదీ దళితబంధు కథ. నెక్ట్స్ గొర్రెల పంపిణీ.. ఈ విషయంలో కూడా ప్రజలను గొర్రెలను చేసింది అప్పటి ప్రభుత్వం. రెండో విడత గొర్రెల పంపిణీకి సంబంధించి 2018 నుంచి 2023 వరకు.. అంటే దాదాపు నాలుగున్నరేళ్లు ఎలాంటి ప్రాసెస్​ చేయలేదు. ఇవి కూడా అధికారులు రిపోర్ట్‌లో చెప్పిన మాటే. బై ఎలక్షన్స్​ జరిగిన రెండు నియోజకర్గాల్లో తప్పితే.. నాలుగేళ్లుగా ఎక్కడా పంపిణీ చేయలేదు. లాస్ట్ ఇయర్‌లో జూన్‌‌‌‌‌‌‌‌లో రెండో విడత గొర్రెల పంపిణీని ప్రారంభించింది అప్పటి బీఆర్ఎస్‌ సర్కార్.. అప్పుడే గొర్రెలు వస్తాయన్న ఆశతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డీడీలు కట్టారు.

లబ్ధిదారు వాటా కింద దాదాపు 85 వేల మంది ఒక్కొక్కరు 43 వేల 750 చొప్పున బ్యాంకుల్లో డీడీలు తీశారు. మరి గొర్రెలు పంచారా అంటే అదీ లేదు. ఇక జరిగిన గొర్రెల పంపిణీలో కూడా అవినీతి, అక్రమాలు. ఇప్పటికే ఈ విషయంలో విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు ఏసీబీ కూడా కేసు నమోదు చేసింది. సో ఓవరాల్‌గా చూస్తే పథకాలు ఆగింది బీఆర్‌ఎస్‌ పాలనలో ఉన్నప్పుడే అని తెలుస్తోంది.. అంతేకాదు పథకాలన్ని బీఆర్ఎస్‌ ఎన్నికల స్టంట్సే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అప్పటికప్పుడు హడావుడి చేయడం.. ఆ తర్వాత అటకెక్కించడం కేసీఆర్‌కు అలవాటే అంటున్నారు.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×