EPAPER

KCR: కేసీఆర్ కళ్లద్దాల ధర 9 లక్షలా? కంటివెలుగు అద్దాల ధర ఎంతో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ లోనూ యాడ్ ఇచ్చారా?

KCR: కేసీఆర్ కళ్లద్దాల ధర 9 లక్షలా? కంటివెలుగు అద్దాల ధర ఎంతో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ లోనూ యాడ్ ఇచ్చారా?

KCR: రాజకీయ దృష్టిలానే.. కేసీఆర్ కంటిచూపు కూడా బాగుంటుంది. చూపు చక్కగా ఆనుతుంది. కాకపోతే, చిన్నచిన్న అక్షరాలు చదవడంలో కాస్త ఇబ్బంది. అందుకే, వైద్యుల సూచన మేరకు అప్పుడప్పుడు కంటి అద్దాలు వాడుతుంటారు. ఫాంహౌజ్ కి వెళ్లినప్పుడు.. బాగా ఎండ ఉన్నప్పుడు.. కూలింగ్ స్పెక్స్ యూజ్ చేస్తుంటారు. ఇంతకీ కేసీఆర్ వాడే కంటి అద్దాల ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ.9 లక్షలు అట.


కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా చేపట్టింది ప్రభుత్వం. పరీక్షలు చేసి.. దృష్టి లోపాలు ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు, కంటి అద్దాలు ఇస్తారు. ఇంతకీ ప్రజలకు ఇచ్చే కంటి అద్దాల కాస్ట్ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.35 అట.

తెలంగాణలో కంటి వెలుగు కార్యక్రమం. ఇది సదుపాయం తెలంగాణ ప్రజలకు మాత్రమే. మిగతా రాష్ట్రాల ప్రజలు కంటి వెలుగుకు అర్హులు కారు. కానీ, కంటి వెలుగు ప్రకటనలు మాత్రం దేశవ్యాప్తంగా ఇచ్చింది సర్కారు. జాతీయ మీడియాలో, పలు రాష్ట్రాల్లో కంటి వెలుగుపై భారీ ప్రచారం చేస్తోంది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ దేశంలోనూ తెలంగాణ కంటి వెలుగు ప్రోగ్రామ్ పై యాడ్ ఇచ్చారు అట.


ఈ ఆరోపణలన్నీ చేస్తున్నది ఓ ప్రముఖ డాక్టర్. గతంలో బీఆర్ఎస్ లో ఉండి ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే…

సీఎం కేసీఆర్ ఆఫ్ఘనిస్తాన్‌లోనూ కంటి వెలుగు పథకానికి సంబంధించిన యాడ్ ఇచ్చుకున్నారని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. కంటి వెలుగుకు కేటాయించిన 200 కోట్ల బడ్జెట్‌లో 50 కోట్లు ప్రచారానికే ఖర్చుపెట్టారని అన్నారు. మిగిలిన 150 కోట్లలో ఒక్కో మనిషిపై ఖర్చు పెట్టేది కేవలం రూ.35 మాత్రమేనని తెలిపారు. ఎలాంటి టెండర్లు పిలవకుండానే కంటి వెలుగు అద్దాల కాంట్రాక్ట్‌ను సొంత పార్టీకి చెందిన వ్యక్తికి కట్టబెట్టారని బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ ధరించే కళ్లద్ధాల ధర.. అక్షరాలా రూ.9 లక్షలు అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.

కంటి వెలుగు పథకంలో భాగంగా చెకప్ చేసేందుకు ఒక్క డాక్టర్‌ను అయినా నియమించారా? అని బూర ప్రశ్నించారు. లక్షన్నర మెషీన్‌ను రెండున్నర లక్షలకు కొనుగోలు చేశారని ఆరోపించారు. తెలంగాణలో 35 వేల కోట్ల మెడికల్ బిజినెస్ నడుస్తోందని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ విద్య, వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని డిమాండ్ చేశారు. రెండు టర్మ్‌లు ప్రజలు అధికారమిస్తే ఒక్క కొత్త ప్రభుత్వ ఆసుపత్రి అయినా కట్టారా? అని ప్రశ్నించారు. 2018 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే చేశారని, ఈసారి కూడా ఎన్నికలు సమీపిస్తున్న వేళ కంటివెలుగును మళ్లీ తీసుకొచ్చారని అన్నారు. బాహుబలి పార్ట్-1, పార్ట్-2 లాగా కంటి వెలుగు పథకం కూడా పార్టు పార్టులుగా వస్తోందంటూ సెటైర్లు వేశారు. మొదటి విడత కంటి వెలుగులో ఆపరేషన్ల కారణంగా 18 మంది అంధులయ్యారనే విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని సూచించారు బీజేపీ నేత డాక్టర్ బూర నర్సయ్య గౌడ్.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×