EPAPER

KCR Silent: ఎమ్మెల్యేల అనర్హత ఇష్యూ.. కేసీఆర్ హ్యాపీగా లేరా? ఆ విషయం ముందే తెలుసా?

KCR Silent: ఎమ్మెల్యేల అనర్హత ఇష్యూ.. కేసీఆర్ హ్యాపీగా లేరా? ఆ విషయం ముందే  తెలుసా?

KCR Silent: ప్రజా ‌క్షేత్రంలో ఓడిపోయినా.. న్యాయస్థానంలో గెలిచామని గులాబీ నేతలు డబ్బా కొట్టుకుంటున్నా రా? ఈ విషయంలో కేసీఆర్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? ఎమ్మెల్యేలపై వేటు కష్టమనే విషయం ఆయనకు ముందే తెలుసా? అందుకోసమే న్యాయస్థానం తీర్పు ఇచ్చినా సైలెంట్ ఉన్నారా? పార్టీ నుంచి వెళ్లబోయే ఎమ్మెల్యేలను ఆపేందుకు ఈ ఎత్తుగడ వేశారా? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.


తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై బీఆర్ఎస్ నేతలు వేసిన అనర్హత పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ అంశాన్ని కేవలం నాలుగు వారాల్లో తేల్చాలని స్పీకర్ కార్యాలయం కార్యదర్శిని ఆదేశించింది.

ALSO READ: రాష్ట్రానికి మరో పెను ముప్పు.. భారీ నుంచి అతిభారీ వర్షాలు!


న్యాయస్థానం తీర్పుపై గులాబీ పార్టీ నేతలు ఎంజాయ్ చేశారు.. చేస్తున్నారు. కేసు గురించి ఏం జరుగుతుందో కూడా బీఆర్ఎస్ నేతలకు అంతా తెలుసు. న్యాయస్థానం తీర్పు రాగానే అదిగో ఉప ఎన్నికలు వస్తున్నాయంటూ హడావుడి తప్పితే.. ఏమీ ఉండదని వాళ్లకూ తెలుసు.

ఇక్కడ చాలా అంశాలను ప్రస్తావిస్తున్నారు కాంగ్రెస్ వాదులు. ఎమ్మెల్యేల అనర్హత గురించి నిర్ణయం తీసుకునే అధికారం న్యాయస్థానాలకు లేదని చెబుతున్నారు. ఏది జరిగినా స్పీకర్ నిర్ణయం మేరకు మాత్రమే ఉంటుంది. ఆయన నిర్ణయంపై న్యాయస్థానం రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం కలిగి ఉంటాయని కొన్ని కేసుల సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.

న్యాయస్థానం గడువు ఇచ్చిన నాలుగువారాలు అంటే ఒక నెల. నాలుగు వారాల తర్వాత న్యాయస్థానం ఇచ్చే తీర్పును డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయవచ్చు. ఇక్కడ కుదరదంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. ఈ తతంగమంతా అయ్యేసరికి మూడు లేదా నాలుగేళ్లు పడే ఛాన్స్ వుందని అంటున్నారు.

అందుకే ఈ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ సైలెంట్‌గా వున్నారని, అంత హ్యాపీగా లేరని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ తరహా పనులే చేసిందని గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

బీఆర్ఎస్ నుంచి వెళ్లిన, త్వరలో వెళ్లబోతున్న ఎమ్మెల్యేలను కాస్త భయపెట్టడం తప్పితే మరొకటి లేదన్నది ఆ పార్టీ నేతలే స్వయంగా చెబుతున్నారు. ఎమ్మెల్యేల అనర్హత గురించి మాట్లాడే నైతిక హక్కు కారు పార్టీకి లేదంటున్నారు. గడిచిన పదేళ్లు కేసీఆర్ వివిధ పార్టీలను బీఆర్ఎస్‌లో కలిపేశారని గుర్తు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేయలేదని అంటున్నారు. ఆ పార్టీలో లైఫ్ ఉందని భావించిన నేతలు వస్తున్నారని అంటోంది. ఎమ్మెల్యే అనర్హతపై బీజేపీ నేతలు నోరు ఎత్తే ఛాన్స్ లేదని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. గడిచిన పదేళ్లు కేంద్రంలోని మోదీ సర్కార్ ఆ తరహా ఎత్తుగడులు ఎన్నో చేసిందని అంటున్నారు.

పెద్దల సభలో మెజార్జీ లేకుండా ప్రత్యర్థి పార్టీ నేతల చేత రాజీనామా చేయించి బలాన్ని పెంచుకుందని అంటున్నారు. ఇప్పుడూ అదే చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రీసెంట్‌గా టీఎంసీ రాజ్యసభ సభ్యుడు రాజీనామా వెనుక ఇదే జరిగిందని గుర్తు చేస్తున్నారు. గతంలో టీడీపీ ఎంపీలను ఆ పార్టీకి రాజీనామా చేయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

Related News

Khairatabad Ganesh Nimajjanam Live Updates: గంగమ్మ ఒడికి గణనాథుడు.. ఆద్యంతం “జై గణేశా” నామస్మరణతో మారుమ్రోగిన భాగ్యనగర వీధులు

Telangana Liberation Day: బలిదానాలు, త్యాగాలతోనే తెలంగాణకు స్వాతంత్య్రం.. కిషన్ రెడ్డి

Telangana Vimochana Dinotsavam : ఢిల్లీ బంగ్లాదేశ్‌లో లేదు.. ఎన్నిసార్లైనా వెళ్తా: బీఆర్ఎస్‌‌కు సీఎం రేవంత్ కౌంటర్

Balapur Ganesh 2024 Laddu Auction: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. ఆల్ టైమ్ రికార్డు ధర

Ganesh Laddu All Time Record: ఆల్‌టైం రికార్డ్.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డూ.. ఎక్కడంటే?

Khairatabad Ganesh: ప్రారంభమైన ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర.. ఉత్కంఠగా బాలాపూర్ లడ్డూ వేలం

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

Big Stories

×