EPAPER

KCR : భారీ హౌసింగ్ సముదాయం ప్రారంభోత్సవం.. ఎక్కడంటే..?

KCR : భారీ హౌసింగ్ సముదాయం  ప్రారంభోత్సవం.. ఎక్కడంటే..?


CM KCR today news(TS news updates): ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా జిల్లా కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 15,660 డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించారు. ఈ గృహ సముదాయానికి కేసీఆర్‌ నగర్‌ 2బీకే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీగా పేరు పెట్టారు. ఇళ్ల ప్రారంభోత్సవ సమయంలో ఆరుగురు లబ్ధిదారులకు ఇంటి పత్రాలను కేసీఆర్ అందించారు. ఆ తర్వాత గృహాలను కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, ప్రజాప్రతినిధులు పరిశీలించారు.

ఈ గృహ సముదాయంలో ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. 117 బ్లాకులుగా విభజించారు. భవనాలను జీ+9, జీ+10, జీ+11 అంతస్తులుగా నిర్మించారు. 37 శాతం భూమిలో ఇళ్లు కట్టారు. మిగిలిన 63 శాతం స్థలంలో మౌలిక సదుపాయాలు కల్పించారు.


సంగారెడ్డి జిల్లాలో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా 2వేల మందికి ఉపాధి కలుగుతుంది. ఫ్యాక్టరీని కేసీఆర్ పరిశీలించారు.

Related News

Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు

Indira Shoban: ఇంకా కూడా కేటీఆర్‌‌కు సిగ్గు రాలేదు: ఇందిరా శోభన్

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా, తొలిసారి వారికి కూడా..: సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Big Stories

×