EPAPER

KCR : 2024 తర్వాత బీజేపీ ఖతం.. కేంద్రంపై కేసీఆర్ ఫైర్..

KCR : 2024 తర్వాత బీజేపీ ఖతం.. కేంద్రంపై కేసీఆర్ ఫైర్..

KCR : తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ మరోసారి కేంద్రంపై ఫైర్ అయ్యారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సుదీర్ఘంగా ప్రసంగించారు. మోదీ ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. ఏదో చేస్తారని ఆశించి బీజేపీకి దేశ ప్రజలు ఓటు వేశారని కానీ ఆ నమ్మకాన్ని మోదీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఇప్పుడు దేశ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లు అయిందని అన్నారు.


తెలంగాణకు అన్యాయం..
75 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఇప్పటికీ పక్షపాత ధోరణులు కనపడుతున్నాయని కేసీఆర్ అన్నారు. కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో 157 మెడికల్‌ కాలేజీ‌లకు అనుమతులు ఇచ్చారని కానీ ఒక్కటీ కూడా తెలంగాణకు ఇవ్వలేదని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యమా? కో-ఆపరేటివ్‌ ఫెడరలిజం అంటే ఇదేనా? అని నిలదీశారు. తెలంగాణకు రావాల్సిన రూ.495 కోట్లను ఏపీ ఖాతాలో వేశారని కేసీఆర్ ఆరోపించారు. ఆ నిధులు తిరిగి ఇవ్వాలని ఏడేళ్లుగా అడుగుతున్నా ఇంకా ఇవ్వలేదన్నారు. మోదీ ప్రభుత్వ విధానాల వల్ల తెలంగాణ రూ.3 లక్షల కోట్లు నష్టపోయిందన్నారు.

దేశంలో దారుణ పరిస్థితులు..
దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత 20 లక్షల మంది భారతీయ పౌరసత్వం వదిలేసుకున్నారని తెలిపారు. ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని ప్రజలు ఓడిపోతున్నారని అన్నారు. మన్మోహన్‌ సింగ్‌ మంచి వ్యక్తి. పని ఎక్కువ చేస్తారు. ప్రచారం తక్కువ చేసుకుంటారు. మోదీ కన్నా ఆయనే ఎక్కువ పని చేశారని కేసీఆర్ ప్రశంసించారు. పూజా మెహ్రా రాసిన ‘ది లాస్ట్‌ డికేడ్‌’ పుస్తకం అందరూ చదవాలని పిలుపునిచ్చారు. దేశం నుంచి పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు. పరిశ్రమలు మూతబడుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని కేసీఆర్ అన్నారు.


అదానీ వ్యవహారంపై ..
దేశంలో ప్రతి రంగం దెబ్బతిందని కేసీఆర్ అన్నారు. అదానీ వ్యవహారం ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని కనీసం కమిటీ వేసి విచారణ జరుపుతామని కూడా చెప్పటం లేదని కేసీఆర్ మండిపడ్డారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. అదానీ సంపద 112 బిలియన్‌ డాలర్లు కరిగిపోయిందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, అదానీ సంస్థల్లో పలు బ్యాంకులతోపాటు, ఎల్‌ఐసీ కూడా పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. మోదీ అసలు విషయం పక్కన పెట్టి నెహ్రూ, ఇందిరా గాంధీల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాళ్లు ఏం చేశారో చెప్పటం ఇప్పుడు అవసరమా? అని ప్రశ్నించారు . చైనా, జపాన్‌ దేశాల పురోగతి ఎలా ఉందో చూడరా? అత్యంత అసమర్థ ప్రధాని మోదీ అని కేసీఆర్ విమర్శించారు. 2024 తర్వాత బీజేపీ ఖతం అయిపోతుందని కేసీఆర్ జోస్యం చెప్పారు.

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Big Stories

×