EPAPER
Kirrak Couples Episode 1

KCR : దేశ నాయకత్వంలో మార్పురావాలి.. నాందేడ్ సభలో కేసీఆర్ పిలుపు..

KCR : దేశ నాయకత్వంలో మార్పురావాలి.. నాందేడ్ సభలో కేసీఆర్ పిలుపు..

KCR : మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ మోడల్ ను కేసీఆర్ వివరించారు. బీఆర్ఎస్ కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని తెలిపారు. దేశ నాయకత్వంలో మార్పురావాలని పిలుపునిచ్చారు. దేశంలోని రైతుల సమస్యలను ప్రధానంగా లేవనెత్తారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలో తెలంగాణ మోడల్ ను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.


దేశానికి తెలంగాణ మోడల్..
తెలంగాణలో ఒకప్పుడు దారుణ పరిస్థితులు ఉండేవని కేసీఆర్ చెప్పుకొచ్చారు. గతంలో రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేవారని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రూపురేఖలను మార్చేశామన్నారు. రైతుల నుంచి పంటలను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. చేనేతలకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్ , నీళ్ల సమస్యలు లేవన్నారు. కులవృత్తులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి సాధ్యమైనప్పుడు మిగతా రాష్ట్రాల్లో ఎందుకు సాధ్యం కాదన్నారు. దేశంలో మార్పురావాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేది బీఆర్ఎస్ తొలి నినాదం అని కేసీఆర్ చెప్పారు.

భారత్ పేద దేశం కాదు.. మేధావుల దేశం..
భారత్ పేద దేశం కాదని మేధావుల దేశమని కేసీఆర్ స్పష్టం చేశారు. చిత్తశుద్ధితో పనిచేస్తే అమెరికా కంటే బలమైన శక్తిగా ఎదగవచ్చునని చెప్పారు. దేశం వెనుకబాటుతనానికి కాంగ్రెస్ , బీజేపీనే కారణమన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లులో 70 ఏళ్లు ఈ రెండు పార్టీలే దేశాన్ని పరిపాలించాయని తెలిపారు. ఒకరు అంబానీ అంటే మరొకరు అదానీ అంటారని విమర్శలు చేశారు.


కేంద్రంపై ఫైర్..
దేశానికి ఏమైనా లక్ష్యం ఉందా అని కేసీఆర్ ప్రశ్నించారు. జెండా రంగులు చూసి జనం మోసపోతున్నారని తెలిపారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి కొన్నిపార్టీలు గెలుస్తున్నాయని పరోక్షంపై బీజేపీపై విమర్శలు గుప్పించారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. రైతుల దుస్థితికి కారణం ఎవరని ప్రశ్నించారు. దేశంలో భూమి ఉంది, నీళ్లూ ఉన్నాయని …కానీ రైతు ప్రభుత్వం వస్తేనే కరువు ప్రాంతాలకు న్యాయం జరుగుతుందన్నారు. చాలా దేశాల్లో 5 వేల టీఎంసీల కెపాసిటీ కలిగిన ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. కానీ మనదేశంలో ఎందుకు నిర్మించలేకపోతున్నామని ప్రశ్నించారు. ఢిల్లీలో రైతులు 7 నెలల పాటు ఆందోళన చేశారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా రైతులకు ఉచితంగా సాగు నీరు, కరెంట్ అందాలన్నారు కేసీఆర్.

మేకిన్ ఇండియా ఏమైంది?..
చిన్న పట్టణాల్లోనూ చైనా బజార్లు ఎందుకని కేసీఆర్ నిలదీశారు. దేశంలో చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలన్నారు. మాంజా నుంచి జాతీయ జెండా వరకు చైనా నుంచేనా? కొనుగోలు చేయాలా అని నిలదీశారు. మేకిన్ ఇండియా జోకిన్ ఇండియాగా మారిందని సెటైర్లు వేశారు. మన్ కీబాత్ పేరుతో ప్రజలను ప్రధాని మోదీ వంచిస్తున్నారని మండిపడ్డారు. తాము బలవంతులం అనుకునే నేతల పతనం తప్పదని హెచ్చరించారు.

మహారాష్ట్రలో మార్పు..
బీఆర్ఎస్ ను గెలిపిస్తే 2 ఏళ్లలో మహారాష్ట్రలో అద్భుతాలు చేసి చూపిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న పథకాలు మహారాష్ట్రలో ఎందుకు లేవని ప్రశ్నించారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మహారాష్ట్ర రైతులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అప్పుడే మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గరకు దిగి వస్తుందని స్పష్టం చేశారు. నాందేడ్ బహిరంగ సభలో మారాఠ యోధులకు కేసీఆర్ నివాళులు అర్పించారు. కేసీఆర్ సమక్షంలో పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు.

Related News

Bigg Boss: ప్రేయసితో ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్..!

Bigg Boss 8 Day 22 Promo: నామినేషన్ రచ్చ షురూ.. మళ్ళీ అదే పెంట..!

Megastar: నెల రోజులుగా ఆ వ్యాధితో బాధపడుతున్న చిరు.. దగ్గరుండి ఆ పని చేసిన సాయి తేజ్..!

Chiranjeevi : గిన్నిస్ రికార్డులో మెగాస్టార్ కి చోటు.. అమీర్ ఖాన్ చేతుల మీదుగా..!

Bigg Boss 8 Day 21 Promo: గెస్ ది సౌండ్ .. కొత్త టాస్క్ తో తికమక పెట్టించిన బిగ్ బాస్..!

Jani Master: నువ్వు మామూలోడివి కాదయ్యో.. ఇంతమందిపై లైం*గి*క దాడా..?

Bigg Boss 8 Day 21 Promo: సెట్ ఆర్ కట్.. రియల్ ఫన్ డే అయ్యిందిగా..?

Big Stories

×