Big Stories

BRS: బీఆర్ఎస్‌లో కర్నాటక టెన్షన్!.. ‘పట్నం’ జోస్యం నిజమౌతుందా?

cm-kcr-brs

BRS party news(Telangana latest news): కర్ణాటక ఫలితం తెలంగాణలో రీసౌండ్ ఇస్తోంది. అక్కడి ఎఫెక్ట్.. ఇక్కడ ఉండదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినా.. ఆయన పార్టీ నాయకులు మాత్రం మళ్లీ మళ్లీ గుర్తుచేస్తున్నారు. తాజాగా.. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిదీ అదే మాట. వికారాబాద్ జిల్లా తాండూరులో మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్‌ రెడ్డి పంచాయతీ తెగలేదు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారని మహేందర్‌రెడ్డి అన్నారు. కర్ణాటకలో అదే జరిగిందంటూ గుర్తుచేశారాయన. తెలంగాణలోను అలాగే జరుగుతుందని జోస్యం చెప్పారు.

- Advertisement -

అంతేకాదు.. మహేందర్ రెడ్డి మాటలతో తాండూరు BRS పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. తాను తాండూరు నుంచి బీఆర్ఎస్ క్యాండేట్‌గానే నిలబడతానంటూ స్పష్టంగా చెప్పారు. అంతేకాదు కారు గుర్తుపై గెలిచేది నేనేనంటూ ధీమా వ్యక్తంచేశారు. అన్ని రకాల సర్వేలతో పాటు ప్రజలు కూడా తనకు అనుకూలంగా ఉన్నారని మహేందర్ రెడ్డి మాట. 2018 ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు.. ఇప్పుడు మరో పార్టీలో తిరుగుతున్నారంటూ పరోక్షంగా పైలట్ రోహిత్‌రెడ్డిపై సెటైర్లు వేశారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం వివరణ కోరినా ఉన్నమాటే చెప్తానంటూ సమర్థించుకున్నారు.

- Advertisement -

గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తాను ఓడినా.. తాండూరులో తన కేడర్‌ చెక్కు చెదరలేదని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. హైకమాండ్ దగ్గర గ్రిప్ ఉంది కాబట్టే ఎమ్మెల్సీ అయ్యానన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ గుర్తుపై గెలిచి, బీఆర్ఎస్ వైపు వెళ్లిన సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌ రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదంటూ విమర్శలు గుప్పించారు మహేందర్ రెడ్డి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు వచ్చినట్లే తాండూరుకు కూడా SDF నిధులు 136 కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. అందులో ఎమ్మెల్యే గొప్పతనం ఏముందని పట్నం ప్రశ్న. కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తుకు కొందరు ఓట్లు వేయడం వల్లే గత ఎన్నికల్లో తాను ఓడానంటూ విశ్లేషణ చేశారు మహేందర్‌రెడ్డి. భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో అలాంటి పొరపాటు జరగదన్నారు.

పట్నం, పైలట్ అనే కాదు.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన మిగతా ఎమ్మెల్యేల్లోనూ ఓటమి భయం పట్టుకుంది. పార్టీ మారినందుకు కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యేలను తిరస్కరించినట్టే.. తెలంగాణలోనూ జంపింగ్ ఎమ్మెల్యేలను ఓడిస్తారా? అని తెగ టెన్షన్ పడుతున్నారు. తాము ఓడిపోతామని సర్వేల్లో తేలితే.. అసలు కేసీఆర్ టికెట్ ఇస్తారో లేదోననే అనుమానమూ వారిని వేధిస్తోంది. పట్నం మహేందర్ రెడ్డి మాటలు ఆ వాదనకు మరింత బలం చేకూర్చుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News