EPAPER

Kaleswaram Project : మేడిగడ్డపై బీఆర్ఎస్ అబద్ధాలు.. ఎల్ అండ్ టీ లేఖతో బయటపడ్డ నిజాలు..

Kaleswaram Project : మేడిగడ్డపై బీఆర్ఎస్ అబద్ధాలు.. ఎల్ అండ్ టీ లేఖతో బయటపడ్డ నిజాలు..

Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకంగా నిర్మించిన ప్రాజెక్ట్‌ ఇది. కేసీఆర్‌ అపర భగీరథుడుగా తనకు తాను కితాబిచ్చుకున్న ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు నిర్మించింది. అయితే మేడిగడ్డ నిర్మించిన మూడేళ్లకే కుంగిపోయి.. ప్రజలను బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఎలా ముంచిందో చెప్పకనే చెప్పింది. లక్షల కోట్లు ఖర్చు చేసిన కట్టిన ప్రాజెక్టు మూడునాళ్ల ముచ్చటగా మారింది. అప్పటి వరకు మాటకు ముందో సారి.. వెనుకోసారి కాళేశ్వరం పేరు ఎత్తే గులాబీ నేతలు.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ఆ మాటే ఎత్త లేదు.


కుంగిన పిల్లర్ల విషయంలో ఒక్క మాట మాట్లాడని బీఆర్‌ఎస్ సర్కార్.. ప్రాజెక్ట్ కుంగిన తర్వాత పిల్లర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థదే అని బల్లగుద్దీ మరీ చెప్పారు. దీని కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి చెల్లింపులు అవసరం లేదని తేల్చి చెప్పారు. తీరా ఏమైంది. కారు పార్టీ నేతలు చేసిన మాటలన్ని కారుకూతలైని రుజువైంది. రిపేర్లతో తమకేమీ సంబంధం లేదని ఎల్అండ్ టీ కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేసింది.చేపట్టాల్సిన రిపేర్లకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిందేనని కుండబద్దలు కొట్టింది. దీంతొ కాళేశ్వరం తెలంగాణకు గుదిబండలా మారడం ఖాయం కానుంది. ఆ భారం కూడా ప్రజలపై పడనుంది.

అంతేకాదు బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టుగా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఐదేళ్లు కాదని రెండేళ్లు మాత్రమే అని.. ఆ గడువు కూడా ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసిందనే నిజాన్ని ఎల్అండ్ టీ వెల్లడించింది. బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేయడానికి ఖర్చయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని.. అందుకోసం తమ సంస్థతో మళ్లీ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో మేడిగడ్డ రిపేర్ల భారం ప్రజలపైనే పడనుంది.


కాగా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసిందని తెలిసినా ఎన్నికల్లో గెలుపు కోసమే.. అప్పటి కేసీఆర్ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టించిందనే విషయం ఇప్పుడు ఎల్అండ్ టీ లేఖతో బయటపడడంతో బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే.. నిన్న.. శాసన మండలిలో.. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో జరిగిన డ్యామేజీలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రసంగించే సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి మేడిగడ్డ గురించి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ ఎందుకు కుంగిపోయిందో.. ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకుంటామని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తామని కూడా చెప్పారు.

ఈ ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ ఏడో బ్లాక్ లోని పిల్లర్లు కుంగాయి. దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చని మొదట ప్రాజెక్టు ఇంజినీర్లు పోలీసులకు కంప్లయింట్ చేయగా.. సాంకేతిక కారణాలతోనే బ్యారేజీ కుంగినట్టుగా తేలింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ ఆధ్వర్యంలోని ఎక్స్ పర్ట్ టీమ్ బ్యారేజీని పరిశీలించి డిజైన్ల లోపం.. నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టకపోవడంతోనే కుంగినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.

ఇప్పటికే కాళేశ్వరం, ఇతర ప్రాజెక్ట్‌ల కోసం ఉపయోగించిన విద్యుత్ బిల్లులు ఏకంగా 14 వేల కోట్లకు పైగా ఉన్నట్టు తేలింది. వీటికి తోడు ఇప్పుడు రిపేర్ ఖర్చులు కూడా చెల్లించాలంటే.. ప్రాజెక్ట్ ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ అని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై ఉన్నత స్థాయి విచారణ జరిపితే లోపాలు బహిర్గతమవుతాయాన్నారు. అంతేకాదు అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై కూడా విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు నిపుణులు. అప్పటి కేసిఆర్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించి పనులను తొందరగా చేయాలని ఒత్తిడి తీసుకురావడం వల్లే నాణ్యత లోపించదన్నారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై ఇంటర్నేషనల్ ఇంజనీర్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఇప్పుడు తెరపైకి వస్తోంది.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగుబాటుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పిల్లర్లు కుంగుబాటుపై నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ENC మురళీధర్, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశం అయ్యారు. త్వరలోనే ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులను పరిశీలిస్తానని.. ఆ సమయంలో ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉండాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు.

Tags

Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×