EPAPER

Big Shock To KCR: కాళేశ్వరం అసలు కథ.. జైలుకు గులాబీ బాస్

Big Shock To KCR: కాళేశ్వరం అసలు కథ.. జైలుకు గులాబీ బాస్

Kaleshwaram Project Controversy(Breaking news in Telangana): కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మాటల మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ తో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పుకోవాలన్న ఆరాటంలో బీఆర్ఎస్ ఉంది. అందుకే కేటీఆర్ సహా గులాబీ నేతల బృందం కాళేశ్వరం వెళ్లి పరిశీలించి వచ్చారు. అక్కడితో మ్యాటర్ ఆపకుండా కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టును దెబ్బతీశారని తనకు ఎప్పటినుంచో అనుమానం ఉందని కేటీఆర్ చెప్పడం ఇప్పుడు అసలు ట్విస్ట్. ఇక ముందు కూడా కాళేశ్వరాన్ని ఏదైనా చేస్తారనే అనుమానం కూడా ఉందన్నారు. మరి నిజంగా కేటీఆర్ చెప్పినదాంట్లో వాస్తవం ఉందా? కాళేశ్వరం కథలో అసలు ట్విస్ట్ ఏంటి?


కాళేశ్వరంపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చాలా డైలాగ్ వార్ నడిచింది. కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని అని బీఆర్ఎస్.. అప్పుల కుప్ప ఒక్క ఎకరాకూ నీళ్లు దక్కే పరిస్థితి లేదని కాంగ్రెస్ ఇలాంటివెన్నో మాటల యుద్ధాలు నడిచాయి. అసలు ప్రాజెక్టు తుమ్మడిహెట్టి దగ్గర కాకుండా కట్టడం, డిజైన్లు మార్చడం, నాసిరకం నిర్మాణాలంటూ కాంగ్రెస్ ఎదురుదాడులు చేసింది. అటు మేడిగడ్డ కుంగడంతో బీఆర్ఎస్ కూడా డిఫెండ్ చేసుకునేలా అన్ని ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. తాజాగా ఇదే కాళేశ్వరంపై తెరపైకి వచ్చిన కొత్త విషయం ఏంటంటే.. గులాబీ నేతలు మొన్నామధ్య కాళేశ్వరం పర్యటనకు వెళ్లివచ్చారు.

మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ తో ఇప్పుడు మరోసారి ఈ ప్రాజెక్టు గురించి చర్చ మొదలైంది. అసలు కేటీఆర్ ఏమన్నారంటే.. మేడిగడ్డ 28 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకుని నిలబడిందని అలాంటిది… ఏ వరదా లేనప్పుడు ప్రాజెక్టు ఎలా కుంగిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టును దెబ్బతీశారని తనకు ఎప్పటినుంచో అనుమానం ఉందంటూ మాట్లాడారు. రేపు ప్రాజెక్టుకు ఏదైనా జరగకూడనిది జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని, కాళేశ్వరాన్ని ఏదైనా చేస్తారనే డౌట్ కూడా ఉందన్నారు కేటీఆర్.


కాబట్టి కాళేశ్వరంపై కొత్త కథలను కేటీఆర్ ఎత్తుకున్నారు. ఇప్పటికే మేడిగడ్డ కుంగడం, అన్నారం, సుందిళ్లలో బుంగలు పడడం, ఎక్కువ నీటిని నిల్వ చేస్తే అసలుకే ప్రమాదం అని ఇప్పటికే NDSA స్పష్టం చేసింది. దీంతో వరద వచ్చింది వచ్చినట్లు కిందికి వదిలేస్తున్నారు. అలాంటిది లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకున్న మేడిగడ్డ బరాజ్.. ఏ వరదా లేనప్పుడు ఎలా కుంగిందో అర్థం కావడం లేదంటూ కొత్త డౌట్లను తెరపైకి తేవడం అంతా పకడ్బందీ ప్లాన్ లో భాగమే అంటున్నారు. కాళేశ్వరం డ్యామేజ్ నుంచి సబ్జెక్ట్ డీవియేట్ చేయడమన్న వాదన వినిపిస్తోంది. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డలోని ఏడో బ్లాక్ లోని నాలుగు పిల్లర్ల దగ్గర పెద్ద శబ్దంతో క్రాక్స్ వచ్చి పిల్లర్లు కుంగాయి.

అప్పుడు బరాజ్ కుంగిపోవడానికి ముందు పేలుడు వంటి శబ్దం వచ్చిందన్న స్టోరీలు వినిపించారు. మహారాష్ట్ర వైపు నుండి 3 మీటర్ల దూరంలో 20వ పిల్లర్ వద్ద శబ్దం వచ్చిందన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రవాణాకు సంబంధించి ఈ రెండు వ్యవస్థలు నిత్యం నిశిత పరిశీలన జరుపుతుంటాయి. అయినప్పటికీ మేడిగడ్డ కుంగుబాటును ఇంకేదో ఖాతాలో వేసుకుని తప్పించుకునే ప్రయత్నాలు అప్పుడు జరిగాయి. కానీ విద్రోహ చర్య ఏదీ లేదని అప్పట్లోనే నిపుణులు, భద్రతా సిబ్బంది తేల్చేశారు. NDSA టీమ్ ఢిల్లీ నుంచి వచ్చి పరిశీలన జరిపి, కుంగుబాటుకు కారణాలు వెల్లడించింది. మధ్యంతర నివేదిక ఇచ్చింది. రిపేర్లు పూర్తయ్యేదాకా గేట్లు ఓపెన్ చేసి పెట్టాలన్నది.

Also Read: నేడే రెండో విడత పంట రుణమాఫీ..రైతుల ఖాతాల్లో 7వేల కోట్లు జమ!

లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టారు. అసలు డిజైన్ చేసింది తానే అని ఒక సందర్భంలో కేసీఆర్ చెప్పుకున్నారు. మెదడు, రక్తం కరిగించి కట్టానన్నారు. బరాజ్ కుంగిన తర్వాత ప్రశ్న అడిగితే.. తనకు తెలియదని, అంతా ఇంజినీర్లదే అని అన్నారు. సో ఒక అబద్దాన్ని నిజం చేయడం కోసం, అలాగే ఒక తప్పును కప్పి పుచ్చుకోవడం కోసం కొత్త వ్యూహాలకు బీఆర్ఎస్ నేతలు తెరలేపుతున్నారన్న వాదన వినిపిస్తోంది. కేసీఆర్‌ కుటుంబం కమీషన్ల కక్కుర్తి కోసం రాష్ట్ర నీటిపారుదలరంగాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టును సర్వనాశనం చేసిందని కేసీఆర్‌, కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ విరుచుకుపడ్డారు. కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ.. ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, తప్పుడు ప్రచారంలో గోబెల్స్‌ను కేటీఆర్‌ మించిపోయారంటూ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం కట్టినప్పుడు.. కూలినప్పుడు అధికారంలో ఉన్నది కేసీఆర్‌ కుటుంబమే అన్న విషయాన్ని కేటీఆర్ కు గుర్తు చేశారు.

కూలిన తర్వాత 45 రోజులు వారే అధికారంలో ఉన్నారన్నారు. రీ-డిజైనింగ్‌, రీ-ఇంజనీరింగ్‌తోనే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు. సో ఇప్పుడు గోదావరిలో వరద వస్తోంది. ఆ నీటిని ఎత్తి పోయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. నిజానికి ఎక్కడికి ఎత్తిపోయాలి.. ఎక్కడ నిల్వ ఉంచాలి.. నిల్వ ఉంచితే వచ్చే ప్రమాదాలు.. ఇవన్నీ తెలియవా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంత చేసి కాళేశ్వరం టూర్ కు వెళ్లిన గులాబీ బ్యాచ్.. మేడిగడ్డలో తప్పు జరగలేదు అన్న విషయాన్ని కూడా చెప్పలేకపోయిందంటున్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారని అంటున్నారు.

NDSA రిపోర్ట్ బీజేపీ ఆఫీస్ లో తయారు చేసిందే అని, ఎన్డీఎస్‌ఏకు పోలవరంపై లేని శ్రద్ధ కాళేశ్వరంపై ఎందుకని కేటీఆర్ ఇటీవలే చేసిన కామెంట్లపై బండి మండిపడ్డారు. అయితే కాళేశ్వరంలో తప్పు జరిగిందని కేటీఆర్ ఒప్పుకున్నట్టేనా అని ప్రశ్నించారు. పోలవరానికి కాళేశ్వరానికి లింక్ ఎందుకన్నారు. పోలవరంలో తప్పు జరిగితే.. ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతేగానీ.. కాళేశ్వరం తప్పులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గుర్తిస్తే తట్టుకోలేకపోతున్నారంటున్నారు. కాబట్టి కాళేశ్వరం కథలకు ఇప్పట్లో పుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. కౌంటర్లు, ఎన్ కౌంటర్లు, డౌట్లు, విచారణలు ఇవన్నీ మరింతకాలం కొనసాగడం ఖాయంగానే కనిపిస్తోంది.

 

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×