EPAPER
Kirrak Couples Episode 1

Kaleshwaram CAG Report | కాళేశ్వరం నిండా అవినీతే.. తెలంగాణను నిండా ముంచిన బిఆర్ఎస్!

Kaleshwaram CAG Report | కాళేశ్వరం మహా అద్భుతమని, ప్రపంచంలోనే ఇంజినీరింగ్ వండర్ అని, నదులకు నడకలు నేర్పామని, లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చామని ఇలా ఎన్నెన్నో ఘనంగా చెప్పుకుంది గత కేసీఆర్ సర్కార్. కాళేశ్వరం అవినీతి కథలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.

Kaleshwaram CAG Report | కాళేశ్వరం నిండా అవినీతే.. తెలంగాణను నిండా ముంచిన బిఆర్ఎస్!

Kaleshwaram CAG Report | కాళేశ్వరం మహా అద్భుతమని, ప్రపంచంలోనే ఇంజినీరింగ్ వండర్ అని, నదులకు నడకలు నేర్పామని, లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చామని ఇలా ఎన్నెన్నో ఘనంగా చెప్పుకుంది గత కేసీఆర్ సర్కార్. కాళేశ్వరం అవినీతి కథలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. తెలంగాణను, భవిష్యత్ ఆశలను నిండా ముంచేసిన ప్రాజెక్టు ఇది. అందుకు సాక్ష్యం తాజాగా కాళేశ్వరం గుదిబండ అంటూ కాగ్ విడుదల చేసిన రిపోర్టే.


మహా అద్భుతమని గత కేసీఆర్ సర్కార్ ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజలకు ఉపయోగం గుండు సున్నా అని తేలింది. ఉపయోగం కంటే తెలంగాణ భవిష్యత్ ను పణంగా పెట్టి, భారీ వడ్డీలకు అప్పులు తెచ్చి.. అవి గుదిబండగా మారి ఇప్పుడు కుంగిపోయి నిర్జీవంగా మారిపోయింది. ఏకంగా తెలంగాణ అభివృద్ధినే అడ్డుకున్న పరిస్థితి. హాయిగా సాగిపోతున్న రాష్ట్రానికి కాళేశ్వరం ఓ పీడకలగా మిగిలిపోయింది. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు.. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఇచ్చిన నివేదిక ఇది. రెండున్నరేళ్ల పాటు స్టడీ చేసి, ఇరిగేషన్ ఆఫీసర్లకు 250కి పైగా ప్రశ్నలు వేసి లిఖిత పూర్వక సమాధానాలు రాబట్టి… అంతటితో సంతృప్తి చెందక… ఇండిపెండెంట్ గా ప్రాజెక్టును పరిశీలించి శోధించి నివేదించిన కాగ్ రిపోర్టు కాళేశ్వరం కథల్ని సాక్ష్యాలతో సహా వెలుగులోకి తెచ్చింది.

కాళేశ్వరంపై పెట్టిన ప్రతి రూపాయి తెలంగాణ ప్రజల కష్టార్జితం. కానీ అది చూస్తుండగానే గంగపాలు అయిపోయింది. కట్టిన మూడేళ్లకే బ్యారేజీలన్నీ కుంగిపోయి తమ వల్ల కాదంటూ చేతులెత్తేశాయి. ఇంతటి ఘోరం ఎక్కడైనా ఉంటుందా? ఇదో విజయగాధ అని చెప్పుకుంటున్న వారికి కాళేశ్వరం బ్యారేజీలు.. విఫలగాధను విలపిస్తూ చెబుతున్నాయి. కాళేశ్వరంలో ఫెయిల్యూర్ స్టోరీలు ఒకటా రెండా.. అడుగడుగునా అవినీతే. అంతటా అసమర్థతే. ఇదే తాజాగా కాగ్ నివేదికలో రూపంలో రిఫ్లెక్ట్ అయింది.


పేపర్ పై ప్రాజెక్టును అద్భుతమని చూపించింది గత ప్రభుత్వం. 13 జిల్లాలు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు 1698 గ్రామాలకు లబ్ది అంటూ ఆహా ఓహో అన్నారు. సీన్ కట్ చేస్తే సినిమా మొత్తం మారిపోయింది. 28 ప్యాకేజీలు, 7 మెగా లింకులుతో నిర్మించిన కాళేశ్వరం కథలను కాగ్ ఒక్కొక్కటిగా విడమరిచి చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు ఆనకట్టలు, 22 లిఫ్టులు, 21 భారీ పంప్ హౌస్‌లు, సొరంగ మార్గాలు వీటన్నింటిని 36 నెలల టైంలోనే పూర్తి చేశామని బీఆర్ఎస్ క్లైయిమ్ చేసుకుంది. హడావుడి పనులు, రికార్డులు సృష్టించాలని ఏదో చేసి అంతా గందరగోళం చేశారు. ప్రతి స్టెప్ లో అసమర్థ నిర్ణయాలే కనిపిస్తున్నాయి. కాంట్రాక్టు సంస్థలకు దోచి పెట్టిందే కాగ్ లెక్కల ద్వారా అర్థమవుతోంది. ప్రజాధనం మంచినీళ్లలా ఎలా వృధా చేశారో కాగ్ రిపోర్ట్ కళ్లకు కట్టింది. పెంచిన అంచనాలు.. చేయని పనులు చేసినట్లు.. చేసిన పనులు వృధా అయ్యేట్లు…, తక్కువ రేటువి ఎక్కువకు కొనడం, కొన్ని పనులు ఎందుకు చేశారో కూడా అర్థం కాని పరిస్థితిని కాగ్ కళ్లకు కట్టింది.

కొత్తగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రాజెక్టు కట్టాలని మాజీ సీఎం కేసీఆర్ అనుకున్నారు. ప్రాణహిత చేవెళ్ల కడితే ఎక్కడ కాంగ్రెస్ కు పేరు వస్తుందనుకున్నారో ఏమో గానీ కాళేశ్వరం డిజైన్ ను తెరపైకి తెచ్చారు. ఇది అంత వయబుల్ కాదని చెప్పినా.. ప్రాణహితతో మహారాష్ట్రలో ముంపు ఎక్కువుంటుందని ఏదో జరిగిపోతుందని చెప్పి బాగా కిందికి వచ్చిన నీళ్లను మళ్లీ తోడి ఎత్తిపోసేలా డిజైన్ అనుకున్నారు. సొంత డిజైన్ తో సీన్ అంతా మార్చేశారు. సీన్ కట్ చేస్తే కాళేశ్వరం గుదిబండ అయి కూచుంది. డీపీఆర్ దగ్గర్నుంచి పనులు దాకా.. అంచనాల నుంచి పెరిగిన ఎస్టిమేషన్ల దాకా అంతా గందరగోళమే. అడగుడగునా మాయాజాలమే కనిపిస్తోంది. అదెలాగో ఓసారి చూద్దాం.

డీపీఆర్ లో మొదట ప్రాజెక్ట్ అంచనా వ్యయం 63,352 కోట్లుగా చూపారు. దాన్ని రివైజ్ చేసి 1,02,267 కోట్లకు పెంచారు. సీడబ్ల్యూసీకి ఇచ్చిన డీపీఆర్ లో 81,911 కోట్లుగా చెప్పారు. కాళేశ్వరం మొత్తంగా పూర్తయ్యే నాటికి 1,49,317 కోట్లకు వెళ్తుందని సాక్షాత్తూ ఇప్పుడు కాగ్ లెక్కగట్టి రిపోర్ట్ రిలీజ్ చేసింది. కాగ్ పూర్తి రిపోర్ట్ బయటకు రావడంతో నిలువుదోపిడీ అంటే ఇదే అన్న విమర్శలు పెరుగుతున్నాయి. పైగా చెప్పిందొకటి చేసింది ఇంకొకటి అన్నట్లుగా పరిస్థితి మారింది. డీపీఆర్ ను సీడబ్ల్యూసీ ఆమోదించక ముందే 25,049 కోట్ల రూపాయల విలువైన 17 వర్క్స్ ను ఇరిగేషన్ శాఖ కాంట్రాక్టర్లకు కేటాయించేసింది. ముందు కేటాయింపులు.. తర్వాత పాలనా అనుమతులు అన్న విధానంతోనే గత సర్కార్ పని చేసింది.

ప్లానింగ్ డిజైనింగ్ ను పట్టించుకోకుండా డీపీఆర్ ను కేవలం ఓ పేపర్ మాదిరిగానే ట్రీట్ చేశారని కాగ్ అక్షింతలు వేసింది. డీపీఆర్ ప్రిపేర్ కు ముందే 2016-18 మధ్య వర్క్స్ కేటాయింపులు చేయడాన్ని కాగ్ ఆక్షేపించింది. అంచనాలు మార్చి, పెంచి ఖజానాకే నష్టం చేకూరేలా నిర్ణయాలు సాగాయన్నది కాగ్ రిపోర్టు. వరద నీటిని మళ్లించేందుకు కాలువల తవ్వకం కూడా ఓ బ్లండర్ మిస్టేక్ అని నివేదికలో చెప్పింది. రివర్స్ పంపింగ్ కోసం కాకతీయ FFC కెనాల్ తో 1999 కోట్లు వృధా చేశారని, సహజ గ్రావిటీతో జరిగే పనికి కెనాల్ తవ్వడం ఏంటో అని ప్రశ్నించింది.

లింక్ 4లో భాగంగా నిర్మితమైన కొములవెల్లి మల్లన్నసాగర్ కోసం 2017లో నాలుగు కాంట్రాక్ట్ సంస్థలకు వర్క్స్ కేటాయించారు. 2020 అక్టోబర్ డిసెంబర్ నాటికి పూర్తవ్వాలన్నారు. అయితే 2021 నుంచి ఈ రిజర్వాయర్ ను నింపే ప్రయత్నాలు మొదలయ్యాయి. తీరా చూస్తే నిర్మించిన ఫీడర్ చానల్ మొత్తం రిజర్వాయర్ లో మునిగిపోయే పరిస్థితి. దీనికి 74 కోట్లు వృధా అయ్యాయి. ఇదే కాళేశ్వరం అద్భుత చిత్రాలు అంటూ, ఫెయిల్యూర్ స్టోరీ అంటూ కాగ్ కళ్లకు కట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్‌, ఎల్‌అండ్‌టీ, నవయుగ కంపెనీలకు భారీగా ముట్ట చెప్పినట్టు కాగ్ ఆడిట్ రిపోర్టులో తేల్చింది.

Related News

Kutami Strategy: ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఛాలెంజ్ నిజమవుతోందా ? సీనియర్లు ఏమంటున్నారు ?

BRS BC Plan: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Big Stories

×