EPAPER

Kaleshwaram Project: కాళేశ్వరంలో మీ పాత్ర ఏమిటి?: ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం

Kaleshwaram Project: కాళేశ్వరంలో మీ పాత్ర ఏమిటి?: ఘోష్ కమిషన్ ప్రశ్నల వర్షం

Jutice PC Ghose Commission: కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ విచారణను వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో బుధవారం కమిషన్ చేపట్టిన బహిరంగ విచారణకు మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు హజరయ్యారు. గతంలో మురళీధర్ సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా విచారణ చేపట్టారు. విచారణలో అన్ని నిజాలే చెబుతానని మురళీధర్‌తో ప్రమాణం చేయించిన అనంతరం పలు కీలక అంశాలపై కమిషన్ చీఫ్ ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది.


క్రాస్ ఎగ్జామ్..
గతంలో 57 మంది కమిషన్ ముందు హాజరై అఫిడవిట్లు దాఖలు చేయగా.. వారిలో ఒక్కొక పిలిచి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే పనిలో కమిషన్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్‌చీఫ్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన మురళీధర్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఈఎన్సీగా కాళేశ్వరం ప్రాజెక్టులో మీ పాత్ర ఏంటి? డీపీఆర్‌ను ఎవరు సిద్ధం చేశారు? వంటి పలు ప్రశ్నలను కమిషన్ ఆయనను అడిగినట్లు తెలుస్తోంది.

Also Read: Achyutapuram Sez Blast: పెను విషాదం.. రియాక్టర్ పేలుడులో 14కు పెరిగిన మృతుల సంఖ్య..సీఎం దిగ్భ్రాంతి


ఆరోపణల నేపథ్యంలోనే?
ఉమ్మడి ఏపీలో ఇరిగేషన్ ఈఎన్సీగా రిటైరైన మురళీధర్ రావు పదవీకాలాన్ని నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పొడిగించింది. తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా కేసీఆర్ సర్కారు మురళీధర్‌రావును కొనసాగించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల్లో ప్రధాన ప్రాత్ర ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావుదే. తొమ్మిదేళ్ల పాటు తన ముందుకు వచ్చిన ప్రతి బిల్లును రిలీజ్‌ చేశారని, తప్పులు జరిగితే హెచ్చరించి బిల్లులు ఆపిన సందర్భం ఒక్కటీ లేదనే ఆరోపణలను మురళీధర్ ఎదుర్కొన్నారు. క్వాలిటీ పట్టించుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని ఒక ఏటీఎం లా వాడుకుని, కొడుకు సాయి అభిషేక్ రావుకు పాలమూరుతో పాటు , కాళేశ్వరంలో భారీగా సబ్ కాంట్రాక్టులు ఇప్పించాడనే వార్తలూ వచ్చాయి.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×