EPAPER

Jupally Krishna Rao : ‘బంగారు తెలంగాణ అని అప్పుల కుప్పగా మార్చారు’.. బీఆర్ఎస్‌పై మంత్రి జూపల్లి ఫైర్..

Jupally Krishna Rao : తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే అదానీని సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం బంగారుపళ్లెం కాదు.. అప్పుల కుప్పగా మార్చారని పేర్కొన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారని తెలిపారు. రూ.40 వేల కోట్లు వడ్డీలకే పోతోందని వాపోయారు. గాంధీ భవన్‌లో మంత్రి మాట్లాడుతూ బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంటులో బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. ఇరుపార్టీల స్నేహాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. అందువల్లే రూ.వేల కోట్లు కుమ్మరించినా.. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలవలేదని చెప్పారు.

Jupally Krishna Rao : ‘బంగారు తెలంగాణ అని అప్పుల కుప్పగా మార్చారు’.. బీఆర్ఎస్‌పై మంత్రి జూపల్లి ఫైర్..
Jupally Krishna Rao

Jupally Krishna Rao : తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే అదానీని సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం బంగారుపళ్లెం కాదు.. అప్పుల కుప్పగా మార్చారని పేర్కొన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారని తెలిపారు. రూ.40 వేల కోట్లు వడ్డీలకే పోతోందని వాపోయారు. గాంధీ భవన్‌లో మంత్రి మాట్లాడుతూ బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంటులో బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. ఇరుపార్టీల స్నేహాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. అందువల్లే రూ.వేల కోట్లు కుమ్మరించినా.. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలవలేదని చెప్పారు.

2018 ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ చాలా హామీలు ఇచ్చి అమలు చేయలేదని పేర్కొన్నారు. గతంలో విపక్షాలు రెండేళ్ల తర్వాత విమర్శిస్తే.. పసికందును విమర్శిస్తున్నారా? అని వాపోయారని చెప్పారు. మరి ప్రస్తుత బీఆర్ఎస్ నేతలు 2 నెలలు కూడా ఎందుకు ఆగలేకపోతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేసిందని అన్నారు. మిగతా గ్యారంటీల అమలు కోసమే ‘ప్రజాపాలన’ నిర్వహించామని స్పష్టం చేశారు. దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగానే మిగతా గ్యారంటీలు అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్‌ను వీడటానికి ఇప్పటికే చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీ ప్రతినిధులే అవిశ్వాసాలు పెడుతున్నారని పేర్కొన్నారు. గత రెండేళ్లలో కృష్ణా బేసిన్‌లో నిండుగా నీరు ఉన్నప్పటికీ సాగుకు నీళ్లివ్వలేదని గుర్తుచేశారు. ఈ ఏడాది వర్షాలు లేక నాగార్జునసాగర్‌లో జలాలు అడుగంటిపోయాయని.. కృష్ణా బేసిన్‌లో నీరు లేనప్పుడు రెండో పంటకు నీరివ్వడం ఎలా సాధ్యమవుతుందని మంత్రి జూపల్లి అన్నారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×