EPAPER

BRS : సస్పెన్షన్ పై రగడ.. జూపల్లి, పొంగులేటి కౌంటర్ ఎటాక్..

BRS : సస్పెన్షన్ పై రగడ.. జూపల్లి, పొంగులేటి కౌంటర్ ఎటాక్..

BRS Party Updates : పార్టీ నుంచి సస్పెండైన నేతలకు, బీఆర్ఎస్ నాయకుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇద్దరూ పార్టీ కంటే తామే గొప్ప అన్నట్లు వ్యవహరించారని మండిపడ్డారు. వాళ్ల బ్లాక్ మెయిల్ పాలిటిక్స్‌కు బీఆర్ఎస్ లొంగదని స్పష్టం చేశారు. అన్ని అంశాలు ఆలోచించిన తర్వాతే పొంగులేటి, జూపల్లి‌పై కేసీఆర్ వేటు వేశారన్నారు.


జూపల్లి కృష్ణారావుకు నైతికత లేదని నిరంజన్ రెడ్డి విమర్శించారు. అన్ని పదవులు అనుభవించి నేడు విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వ్యక్తిగత స్వార్థం కోసమే జూపల్లి కేసీఆర్‌పై విమర్శలు చేశారన్నారు. పొంగులేటి, జూపల్లి ఎవరి ట్రాప్‌లో పడ్డారో అందరికీ తెలుసన్నారు. వారిద్దరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

అటు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ జూపల్లి, పొంగులేటి కౌంటర్ ఎటాక్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం ఆనందంగా ఉందని జూపల్లి అన్నారు. పంజరం నుంచి బయటకు వచ్చినట్లు ఉందని తెలిపారు. దొరలగడీ నుంచి బయటపడ్డానని, ఇంత అరాచకం ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. మూడేళ్లుగా పార్టీ సభ్యత్వ బుక్స్‌ కూడా తనకు ఇవ్వలేదని మండిపడ్డారు. తాను బీఆర్‌ఎస్‌లో ఉన్నట్లా.. లేన్నట్లా అనే అనుమానం ఉండేదన్నారు. పార్టీ బండారం బయటపడుతుందని భయపడి తనను సస్పెండ్‌ చేశారని విమర్శించారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని వెయ్యి కోట్లు ఇచ్చినా తనను కొనలేరని స్పష్టం చేశారు. తనను ఎందుకు సస్పెండ్‌ చేశారో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్ చేశారు.


బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తాను పార్టీ సభ్యుడినే కాదన్నప్పుడు ఎలా సస్పెండ్‌ చేశారని ప్రశ్నించారు. జనవరి నుంచి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నానని తెలిపారు. వంద రోజుల తర్వాత బీఆర్‌ఎస్‌ నేతలు ధైర్యం తెచ్చుకొని సస్పెండ్‌ చేశారని అన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు తనను గులాబీ పార్టీలోకి రావాలని ఎన్నోసార్లు ఆహ్వానించారని తెలిపారు. తనపై ఒత్తిడి తీసుకొచ్చి.. కేటీఆర్‌ అనేకసార్లు మాట్లాడి ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్‌ చెప్పారని, ఆయన మాయమాటలు నమ్మి పార్టీలో చేరానని పేర్కొన్నారు. కానీ 5 నెలల్లోనే పరిస్థితి అర్థమైందని పొంగులేటి వివరించారు.

బంగారు తెలంగాణ చేస్తామని ఇప్పుడేం చేస్తున్నారని పొంగులేటి ప్రశ్నించారు. గత ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకపోయినా కేటీఆర్‌ కోసమే పార్టీలో ఉన్నానన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీలో కొనసాగానని తెలిపారు. 2018 లో ఖమ్మం జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యేనే గెలవడానికి కారణం ఏంటో చర్చించారా? ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్‌ వర్సెస్‌ కమ్యూనిస్ట్‌ అని పొంగులేటి స్పష్టంచేశారు.

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×