Big Stories

Junior Doctors Strike: రాష్ట్రవ్యాప్తంగా జూడాల సమ్మె.. నిలిచిపోయిన ఓపీ, ఓటీ సేవలు!

Junior Doctors Strike in Telangana: తెలంగాణలో జూనియర్ డాక్టర్లు మరోసారి సమ్మెబాట పట్టారు. తమకు ప్రతీనెలా సక్రమంగా స్టై ఫండ్ చెల్లించడంతో పాటు.. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. నాలుగు రోజులుగా జూడాలు నిరసనలు చేస్తున్నా.. ప్రభుత్వం వారి నిరసనలపై స్పందించకపోవడంతో నేడు ఓపీ, తాత్కాలిక ఓటీ సేవల్ని బహిష్కరించి సమ్మె బాట పట్టారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

- Advertisement -

ప్రభుత్వ ఆస్పత్రులలో కనీస వసతులు లేవని, ప్రతీ నెలా తమకు స్టై ఫండ్ అందక నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అందుకే తమ డిమాండ్లను పరిష్కరించుకునేందుకు మరోదారి లేక సమ్మెకు దిగినట్లు జూడాలు చెప్పారు. సూపర్ స్పెషాలిటీ పూర్తిచేసిన పీజీలకు ప్రభుత్వ సర్వీస్ కింద నెలకు రూ.2.5 లక్షలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.92 ఇస్తామంటుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

తమకు హాస్టల్ వసతులు కూడా సరిగ్గా ఉండటం లేదని వాపోతున్నారు. అలాగే పేషంట్లకు ఏదైనా అయితే బంధువులు తమపై దాడులు చేస్తున్నారని, అలాంటి వాటిని కట్టడి చేసేలా చర్యలు చేపట్టాలని, తమ పని ప్రాంతాల్లో భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. పీజీలకు 2 నెలలు, హౌస్ సర్జన్లకు 3 నెలలు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు 6 నెలల స్టైఫండ్స్ రావాల్సి ఉందని, ప్రభుత్వం వాటిని వెంటనే విడుదల చేయడంతో పాటు ప్రతీనెలా సకాలంలో స్టైఫండ్స్ అందించాలని జూడాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే సుమారు వెయ్యిమంది జూనియర్ డాక్టర్లుండగా.. తెలంగాణ వ్యాప్తంగా 60 వేల మంది జూడాలు సమ్మెకు దిగారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News