EPAPER
Kirrak Couples Episode 1

BRS: కర్నాటక ఫలితాలతో బీఆర్ఎస్‌లో జోష్.. ఎందుకో తెలుసా?

BRS: కర్నాటక ఫలితాలతో బీఆర్ఎస్‌లో జోష్.. ఎందుకో తెలుసా?


BRS: కర్నాటక ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌లో బిగ్ జోష్. కాంగ్రెస్‌లో మాత్రమే కాదు.. బీఆర్ఎస్‌కూ ఈ ఫలితాలు బిగ్ బూస్ట్‌ని ఇస్తున్నాయి. అదేంటి? కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్‌కెలా బూస్ట్? అనిపించొచ్చు. కానీ, గులాబీ దళంలో హుషారుకు కారణం కాంగ్రెస్ గెలుపు కాదు.. బీజేపీ ఓటమి.

అవును, కన్నడిగులు బీజేపీని బండకేసి కొట్టడంతో కేసీఆర్ ఫుల్ బిందాస్ అవుతున్నారు. తెలంగాణలో బీజేపీనే తమకు ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది బీఆర్ఎస్. అందుకే, పదే పదే మోదీని టార్గెట్ చేస్తున్నారు కేసీఆర్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేసి ఎలాగూ హస్తం పార్టీని దెబ్బతీశాం.. ఒక బీజేపీకి సైతం గట్టి దెబ్బ కొట్టాలని చూస్తున్నారు గులాబీ బాస్. ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్‌కు ఉచ్చు బిగిద్దామని అనుకున్నా.. కోర్టు తీర్పుతో ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది. బండి సంజయ్‌ను పలుమార్లు అరెస్ట్ చేసి లోపలేసినా.. ఆయన మాత్రం తగ్గేదేలే అంటున్నారు. బీజేపీ దూకుడు.. బీఆర్ఎస్‌ను టెన్షన్‌కు గురి చేస్తుందనే చెప్పాలి. ఇలాంటి సమయంలో కర్నాటకలో బీజేపీ దారుణంగా ఓడిపోవడం.. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్‌నే ఎక్కువ హ్యాపీ చేస్తోంది.


బీజేపీ మార్క్ రాజకీయాలు దక్షిణాది రాష్ట్రాల్లో వర్కవుట్ కావని.. కర్నాటక ఎన్నికలతో తేలిపోయింది. ఎన్నెన్ని చేశారు.. ఎన్నెన్ని అన్నారు.. అయినా, కమలనాథులను గద్దె దింపారు. విద్వేష రాజకీయాలకు బుద్ధి చెప్పారని అంటున్నారు. మోదీ తన క్రేజ్‌ను ఫుల్‌గా క్యాష్ చేసుకోనేలా రెండు మెగా రోడ్ షోలు నిర్వహించి బలప్రదర్శన చేశారు. 20కి పైగా నియోజక వర్గాలు కవర్ చేస్తూ.. బెంగళూరులో చేతులు ఊపుతూ.. పూల వర్షం కురిపిస్తూ.. హంగామా చేశారు. రోడ్ షోతో వేవ్ మొత్తాన్ని బీజేపీ వైపు డైవర్ట్ చేయాలని అనుకున్నారు. కానీ, గట్టి పట్టున్న బెంగళూరులోనే ఆ పార్టీ కంగుతినాల్సి వచ్చింది. షోలు, సభలకు ఓట్లు రాలవని తేల్చారు ప్రజలు. కర్నాటకలానే తెలంగాణలోనూ మోదీ మేజిక్కులేమీ పనిచేయవని తేలిపోయిందని గులాబీ నేతలు ఖుషీ అవుతున్నారు.

కర్నాటకలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది బీజేపీ. సేమ్ టు సేమ్.. ఇటీవల తెలంగాణకు వచ్చిన అమిత్‌షా సైతం ఇక్కడ అదే హామి ఇచ్చి వెళ్లారు. అంటే, అక్కడలానే ఇక్కడా బీజేపీ హామీకి ఓట్లు పడవనే ధీమా బీఆర్ఎస్‌లో పెరిగిందంటున్నారు.

కర్నాటక ఎన్నికల సమయంలోనే కేరళ స్టోరీ రిలీజ్ కావడం రాజకీయమే అంటారు. మోదీ సైతం తన ప్రసంగంలో కేరళ స్టోరీ గురించి ప్రస్తావించారు. అయినా, అలాంటి సినిమా ట్రిక్స్ సైతం అక్కడ పని చేయలేదు. ఎన్నికల సమయానికి తెలంగాణలోనూ పాతబస్తీ ఫైల్స్, రజాకార్ల స్టోరీ తీసుకొస్తారని అంటున్నారు. అలా తీసుకొచ్చినా.. ఏం కాదనే భరోసా కర్నాటక ఎన్నికలు ఇచ్చాయనే చెప్పాలి.

ఇక, జై బజరంగ్ భలీ నినాదం. కర్నాటక ఫలితాలను అమాంతం మార్చేస్తుందని అన్నారు చాలామంది. కానీ, ఆ బజరంగ్ భలీ దెబ్బ బీజేపీకే తగిలిందని తాజా ఫలితాలతో తేలిపోయింది. ముందుముందు తెలంగాణలోనూ సమాధులు తవ్వుతాం.. లాంటి వివాదాలు తీసుకొచ్చినా.. ఇక్కడా కర్నాటక స్టైల్ మోదీ మార్క్ పాలి-ట్రిక్స్ చేసినా.. ఏం కాదులే అనే ధైర్యాన్ని కేసీఆర్‌లో కలగజేశాయి కర్నాటక రిజల్ట్స్. అందుకే, కర్నాటక ఫలితాలు అందరికంటే బీఆర్ఎస్‌లోనే ఎక్కువ జోష్ తీసుకొచ్చాయని అంటున్నారు.

Related News

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

YS Jagan: జగన్‌ను లైట్ తీసుకున్న.. కొడాలి నానీ, వంశీ

Black Units Into Action: రంగంలోకి బ్లాక్ యూనిట్.. వణికిపోతున్న ఇజ్రాయెల్

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Kolikapudi Srinivasa Rao: ఇవేం పనులు.. పార్టీ నుండి కొలికపూడి సస్పెండ్..?

Balineni vs YV Subba Reddy: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

Big Stories

×