EPAPER

Telangana Governor: గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం

Telangana Governor: గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం

Telangana: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత జిష్ణు దేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించి కంగ్రాట్స్ చెప్పారు.


తెలంగాణ రాజ్‌భవన్‌లో ఈ రోజు సాయంత్రం జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందర రాజన్ రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆమె తమిళనాడు నుంచి లోక్ సభు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్ ఇంచార్జీగా ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయనను మహారాష్ట్రకు బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నూతన గవర్నర్‌గా జిష్ణ దేవ్ వర్మను నియమించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇందుకు సంబంధించి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.


Also Read: ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చిన రాజ్ తరుణ్.. లీగల్ గానే ముందుకెళ్తా

జిష్ణు దేవ్ వర్మ త్రిపుర మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. త్రిపుర శాసనసభకు పలుమార్లు ఎన్నికైన జిష్ణు దేవ్ వర్మ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగానూ పని చేశారు. ఆయన రామజన్మ భూమి ఉద్యమ సమయంలో బీజేపీలో కూడా చేరడం గమనార్హం.

Related News

Hydra: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Big Stories

×