EPAPER
Kirrak Couples Episode 1

Jeevanreddy : వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ సంఘీభావం.. ఆడబిడ్డపై దాడులేంటని ప్రశ్న

Jeevanreddy : వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ సంఘీభావం.. ఆడబిడ్డపై దాడులేంటని ప్రశ్న

Jeevanreddy : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై వరంగల్ జిల్లాలో జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. షర్మిల విషయంలో టీఆర్ఎస్ కార్యకర్తల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీకి అధ్యక్షురాలుగా మహిళలు ఉండకూడదా అని ప్రశ్నించారు. ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల చేస్తున్న పాదయాత్రలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ విగ్రహం ధ్వంసం చేయడం రాష్ట్రంలోని రైతులు, విద్యార్థులు, మహిళల మనోభావాలను దెబ్బతీయటమేనని అన్నారు. ధ్వంసం చేసిన చోటే వైఎస్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.


రాజకీయాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సాధారణమని జీవన్ రెడ్డి అన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా భౌతిక దాడులకు దిగడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా యాత్రలు చేపడితే అనుమతులున్నా పోలీసులు అడ్డుకోవడాన్ని జీవన్ రెడ్డి తప్పుపట్టారు.

వైఎస్ షర్మిల చేపట్టిన యాత్రకు రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని జీవన్ రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు పోలీసులు ఉండగానే షర్మిల వాహనాలకు నిప్పు పెట్టడంపై మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నేతల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని జీవన్ రెడ్డి తప్పుపట్టారు. అధికార పార్టీ కార్యకర్తలు ఇలా చర్యలకు పాల్పడటం తగదన్నారు.


Related News

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు నైనికా వెన్నుపోటు, సీత చేతికి ఆయుధం.. ఈసారి చీఫ్ అయ్యేది ఎవరు?

Medigadda: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు!

Monkeypox Virus: డేంజర్ బెల్స్.. మరో మంకీపాక్స్‌ కేసు.. ఎమర్జెనీకి దారితీసిన వైరస్ ఇదే!

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Big Stories

×