EPAPER

Telangana State Song: రాష్ట్ర గీతానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. నిడివి ఎంత ఉందంటే..?

Telangana State Song: రాష్ట్ర గీతానికి ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. నిడివి ఎంత ఉందంటే..?

Telangana State Song Good, Says Leaders: తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జూన్ 2న ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని జాతికి అంకితం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటు కాంగ్రెస్, మిత్రపక్ష నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతం బాగుందంటూ పేర్కొన్నారు. సచివాలయంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ తోపాటు పలువురు నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, ఆయన బృందం గీతాన్ని ఆలపించారు. ఆ గీతంలో చేసిన పలు మార్పులను కవి అందెశ్రీ అందరికీ వివరించారు. 13 చరణాలతో ఉన్న పూర్తి గీతం నిడివి 13.30 నిమిషాలు ఉంటుందని ఆయన తెలిపారు. చరణాలు తగ్గించి రెండున్నర నిమిషాలతో రూపొందించిన గీతాన్ని కూడా ఆయన వినిపించారు. అయితే, ఈ రెండూ కూడా బాగున్నాయంటూ నేతలు చెప్పారు. కొమురం భీం, ముఖ్ధూం మొహినుద్దీన్, షేక్ బందగీ వంటి తెలంగాణ యోధుల పేర్లను కూడా ఆ గీతంలో చేర్చాలని వారు సూచించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆ దిశగా పరిశీలించారంటూ అందెశ్రీకి సీఎం సూచించారు.

Also Read: అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా


అదేవిధంగా రాష్ట్ర అధికార చిహ్నం గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అధికార చిహ్నాన్ని ఇంకా ఖరారు చేయలేదని తెలిపారు. చిహ్నంపై ఎటువంటి భేషజాలు, పంతాలు లేవని సీఎం పేర్కొన్నారు. చిహ్నం విషయంలో అందరి సూచనలు తీసుకుంటామన్నారు. అవసరమైతే కేబినెట్, అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 

Tags

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×