EPAPER

Jagital News: వెంటపడ్డాడు.. ప్రేమించానన్నాడు.. చివరకు? కానీ ఈ లవ్ స్టోరీలో ట్విస్ట్ తెలిస్తే..

Jagital News: వెంటపడ్డాడు.. ప్రేమించానన్నాడు.. చివరకు? కానీ ఈ లవ్ స్టోరీలో ట్విస్ట్ తెలిస్తే..

Jagital News: ఔను వారిద్దరు ఒక్కటయ్యారు. వారి ప్రేమకు సమాజం ఒప్పుకుంది. పెళ్లి అంగరంగ వైభవంగా సాగింది. ఏమిటి ఇంతలా గొప్పగా చెప్పుకోదగ్గ ప్రేమజంటనా అనుకుంటున్నారా.. ఔను అటువంటి జంటే ఈ జంట. కాస్త భిన్నమైన ప్రేమ జంట. కానీ చివరికి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక అసలు విషయంలోకి వెళితే..


ప్రేమ అనేది రెండు అక్షరాలే అయినప్పటికీ, అది ఎవరిలో ఎప్పుడు పుడుతుందో చెప్పడం కష్టం. ప్రస్తుత సమాజంలో ప్రేమ పెళ్లిళ్లు కామన్ గా మారాయి. అమ్మాయి, అబ్బాయి ఒక్కటైతే పెద్దలు కూడా, ఓకే చెప్పేస్తున్నారు. అన్నీ ప్రేమలు సఫలం అవుతాయని చెప్పలేం కానీ, కొన్ని విఫలం కూడా అవుతుంటాయి. అయితే తాజాగా ఓ కుర్రాడు ప్రేమించాడు.. పెద్ద వాళ్లని ఒప్పించాడు. అలాగే పెళ్లి చేసుకున్నాడు. ఇంతకు ప్రేమించి ఎవరినో తెలుసా ఓ ట్రాన్స్ జెండర్ ని. ఈ పెళ్లికి వచ్చిన ఔరా అంటూ.. నోరు తెరిచినా, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. మరి మీకేంటి అనే సమాధానం వినిపించింది వారికి. అందుకే పెళ్లికి వచ్చారు.. అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.

జగిత్యాల జల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ కి చెందిన కుమార్, మ్యాడంపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ కరుణాంజలితో ప్రేమలో పడ్డాడు. అయితే తన ప్రేమ విషయం ఆమెకు చెప్పలేక మదనపడేవాడు. సమాజం ఏమైనా అనుకోని నాకు నా ప్రేమ ముఖ్యం.. ఇక ఆలస్యం వద్దనుకొని అసలు విషయం చెప్పేశాడు కరుణాంజలికి. అయితే కరుణాంజలి అంత త్వరగా ఒప్పుకోలేదు. రోజులు గడుస్తున్నాయి కరుణాంజలి కరుణించలేదు. చివరికి నా ప్రేమలో నిజాయితీ ఉంది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ కుమార్ చెప్పగానే.. ఆమె ఒప్పుకుంది. వీరి ప్రేమ విషయం చిన్నగా పెద్దల చెంతకు చేరింది.


Also Read: TDP Leader Video Leak: టీడీపీ నేత రాసలీలలు.. కూతురు వయసున్న అమ్మాయితో..

ఇక పెద్దలకు చెప్పాల్సిన రీతిలో చెప్పిన ఈ జంట, తమ ప్రేమను ఒప్పుకోవాలని కోరి, చివరికి ఒప్పించారు. పెద్దలు కూడ ఒప్పుకోవడంతో వీరిద్దరూ బుధవారం ఓ శుభ ముహుర్తాన వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి ట్రాన్స్ జెండర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ట్రాన్స్ జెండర్ ని వివాహమాడినందుకు కుమార్ ని అభినందించారు. పెళ్ళి తరువాత బారాత్ లో స్టెప్పులు వేసి సందడి చేసారు. చివరికి తన ప్రేమ సక్సెస్ ఫుల్ కావడంతో కుమార్ ఆనందానికి అవధుల్లేవు.

ఓ ట్రాన్స్ జెండర్ ను వివాహం చేసుకోవడం అక్కడ కొందరికి వింతగా అనిపించినా.. ప్రేమించాడు.. ప్రేమకు హద్దులు లేవు.. చివరకు సక్సెస్ అయ్యాడు అంటూ అక్కడి యువత చర్చించుకున్నారు. సమాజం గురించి ఆలోచించకుండ, ట్రాన్స్ జెండర్ ను వివాహం చేసుకున్న కుమార్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు ట్రాన్స్ జెండర్స్. సరే ఇక మనం కూడా ఈ దంపతులను ఆశీర్వదిద్దాం.. కలకాలం చల్లగా ఉండాలని, పెళ్లికి వచ్చిన ప్రజలు అక్షింతలు చల్లి తమ పెద్ద మనసు చాటుకున్నారు.

Related News

BRS Party: ఓరుగల్లులో కారు ఖాళీ అయినట్లేనా?

TSPSC Group -1: వాయిదాల జాతర.. తెరవెనుక ఉన్నదెవరు.. అడ్డుపడుతున్నదెవరు?

Musi Riverfront Document: మూసీ నది పునరుజ్జీవనం.. ఆపై హైదరాబాద్‌కు పునరుత్తేజం

Revanth On Musi River: సీఎంతో జాగ్రత్త.. నేతలతో కేసీఆర్ మంతనాలు..!

Anvitha Builders : అన్విత… నమ్మితే అంతే ఇక..!

BRS Working President Ktr : మంత్రి కొండా సురేఖ కేసులో రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్, వాంగ్మూలాలు తీసుకోనున్న న్యాయస్థానం

Kcr Medigadda : మరోసారి కోర్టుకు కేసీఆర్ డుమ్మా.. న్యాయపోరాటం ఆగదన్న పిటిషనర్

Big Stories

×