EPAPER

Sravani :జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భోగ శ్రావణి రాజీనామా.. ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ కంటతడి..

Sravani :జగిత్యాల మున్సిపల్‌  ఛైర్‌పర్సన్‌ భోగ శ్రావణి రాజీనామా.. ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ కంటతడి..

Sravani : జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భోగ శ్రావణిపై కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెడుతామని పార్టీకి చెందిన మెజారిటీ కౌన్సిలర్లు ఇటీవలే ప్రకటించారు. అయితే.. రాజీనామా చేసిన తర్వాత శ్రావణి కంటతడి పెట్టుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అవిశ్వాస డ్రామా ఆడించారని ఆరోపించారు. మూడేళ్లుగా ఎమ్మెల్యే వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందన్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.


మీకు పిల్లలు ఉన్నారు, వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బెదిరించారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల కోసం డిమాండ్‌ చేశారని ఆరోపించారు. దొర అహంకారంతో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక తనపై కక్షగట్టారని మండిపడ్డారు. అన్ని పనులకు అడ్డొస్తూ చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయొద్దని హుకుం జారీ చేశారని, మున్సిపల్‌ ఛైర్ పర్సన్ పదవి తనకు నరకప్రాయంగా ఉందని పేర్కొన్నారు. నడిరోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యానని ఆవేదన చెందారు.

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎన్ని అవమానాలకు గురిచేసినా అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్లానని శ్రావణి చెప్పారు. చెప్పకుండా వార్డు సందర్శన చేసినా ఎమ్మెల్యే దృష్టిలో నేరమేనని.. ఒక్క పనికూడా తన చేతులతో ప్రారంభించకుండా చేశారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్‌ను కలవొద్దని ఎమ్మెల్యే ఆదేశించారని, తనకు అనుకూలంగా ఉన్న కొద్దిమంది కౌన్సిలర్లను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. సబ్బండ వర్గాలు రాజకీయాలకు పనికిరారా? పేరుకే మున్సిపల్‌ ఛైర్ పర్సన్ అయినా పెత్తనం అంతా ఎమ్మెల్యేదేనని పేర్కొన్నారు. తనకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదని ఆయన ఇచ్చిన స్క్రిప్టే చదవాలని ఆదేశించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితను కూడా కలకూడదని, కేటీఆర్‌ పేరు ప్రస్తావించకూడదని ఎమ్మెల్యే హెచ్చరించారని శ్రావణి ఆరోపించారు.


Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×