EPAPER

Karnataka: మోదీ ఎంట్రీతో వార్ వన్‌సైడేనా? తెలంగాణలోనూ కర్నాటకం తప్పదా?

Karnataka: మోదీ ఎంట్రీతో వార్ వన్‌సైడేనా? తెలంగాణలోనూ కర్నాటకం తప్పదా?
MODI bandi bjp

Karnataka: కర్నాటక కాషాయమయంగా మారింది. బెంగళూరులో మోదీ మెగా రోడ్ షో గ్రాండ్ సక్సెస్. రోడ్ షో అంటే.. అదేదో కిలోమీటరో, రెండు కిలోమీటర్లో కాదు. ఏకంగా 26 కి.మీ. మేర మెగా రోడ్ షో చేశారు. 10 నియోజకవర్గాల మీదుగా ప్రధాని వాహనం కదిలింది. దారి పొడవునా.. కమలనాథులు, ప్రజలు బారులు తీరారు. మోదీని చూసేందుకు పెద్ద ఎత్తున జనం కదలివచ్చారు. రోడ్డుకు ఇరువైపులా నిలుచుని జేజేలు పలికారు. మోదీపై పూలవర్షం కురిసింది. మరి, ఓట్ల వర్షం కూడా కురిసేనా..?


మోదీ రాకకు ముందు…
మోదీ మామూలోడు కాదు. ఆయనెలా దేశ్‌కి నేతా.. అయ్యారో చెప్పేందుక కర్నాటక రాజకీయమే ఉదాహరణ. అక్కడి బీజేపీ ప్రభుత్వం అవినీతి బురదతో బాగా బద్నామ్ అయింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. కాంగ్రెస్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోంది. ఈసారి కర్నాటకలో కాంగ్రెస్ పక్కా.. అనే టాక్ వచ్చింది. ఇదంతా మోదీ రాక ముందు. పోలింగ్‌కు వారం ముందు మోదీ ఎంటర్ అయ్యారు. బీజేపీ వేవ్‌ను అమాంతం మార్చేశారు. అప్పటి వరకూ గెలుపుపై ధీమాగా ఉన్న హస్తం నేతలు.. ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడ్డారు.

మోదీ ఎంట్రీ ఇచ్చాక..
ఒక్క స్పీచ్. ఒకే ఒక్క స్పీచ్. బీజేపీకి బిగ్ బూస్ట్ తీసుకొచ్చింది. బజరంగ్ దళ్‌ను నిషేధిస్తారా? కాంగ్రెస్‌కు బజరంగ్ బలిపై అంత కోపమెందుకు? అందుకే, ఓటు వేసేటప్పుడు జై బజరంగ్ బలి అంటూ నినదిస్తూ ఓటు వేయండంటూ పిలుపు ఇచ్చారు. మోదీ పిలుపు అందుకున్న కాషాయ వాదులు రాష్ట్రమంతా హనుమాన్ చాలిసా పఠనంతో పాలిటిక్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లారు. ఊరూరా హనుమాన్ ఆలయాలను నిర్మిస్తామని కాంగ్రెస్ అప్పటికప్పుడు మరో హామీ ఇవ్వాల్సి వచ్చింది. అయినా.. అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. బజరంగ్ బలి జోష్‌కు.. లేటెస్ట్‌గా మోదీ చేసిన 26 కి.మీ. రోడ్ షో మరింత బలం చేకూర్చింది. ఆదివారం మరో ఎనిమిదిన్నర కి.మీ. మేర రోడ్ షో. ప్రచారం ముగిసే సమయానికి పరిస్థితులు పూర్తిగా తారుమారు కావడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ గెలవాల్సిన చోట.. బీజేపీ గెలుపు గుర్రంగా మారి దౌడు తీస్తోంది. మోదీనా మజాకా.


కమలం ట్రాప్‌లో హస్తం..
బీజేపీ ట్రాప్‌లో కాంగ్రెస్ ఈజీగా పడిందని అంటున్నారు విశ్లేషకులు. అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని, ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ PFIని నిషేధిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది బీజేపీ. ఎలాగూ ముస్లిం ఓట్లు బీజేపీకి పడవనే ధీమాతో.. ఈ హామీతో హిందువుల మద్దతు కూడగట్టొచ్చనేది కమలం ప్లాన్. అయితే, ఇక్కడే బీజేపీని తక్కువ అంచనా వేస్తూ.. కౌంటర్‌ హామీని ప్రకటించింది కాంగ్రెస్. హిందూ విధ్వేష సంస్థలను కూడా నిషేధిస్తామని మేనిఫెస్టోలో తెలిపింది. ఈ రియక్షన్ కోసమే కాచుకుకూర్చున్న కమలనాథులు.. అదిగో బజరంగ్ దళ్‌ను కాంగ్రెస్ నిషేధిస్తుందట.. అంటూ టాపిక్‌ను పూర్తిగా అటువైపు టర్న్ చేశారు. మోదీ రాకతో జై బజరంగ్ బలి నినాదం తారాస్థాయికి చేరింది. ఇప్పుడదే స్లోగన్ బీజేపీని గెలిపు పీఠానికి చేరువ చేస్తోంది. కాంగ్రెస్ కనుక.. బీజేపీని చూసి మేనిఫెస్టోలో ఆ హామీ ఇచ్చుండకపోతే.. పరిస్థితి ఇప్పుడిలా తయారయ్యేది కాదు. కమలనాథులను తక్కువ అంచనా వేశారు హస్తం నేతలు.

తెలంగాణలోనూ కర్నాటకం!
కర్నాటక రచ్చ.. తెలంగాణకు కూడా పాకింది. కాంగ్రెస్ కార్యాలయాల ముందు బీజేపీ ఆందోళనలకు దిగింది. హనుమాన్ చాలిసా పారాయణాలు జరిగాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అమలు చేసే వ్యూహాలకు ఇండికేషన్ అంటున్నారు. ఎన్నికల నాటికి ఇక్కడా అలాంటి రాజకీయాలు తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ వివాదాన్ని గుర్తు చేస్తున్నారు.

బండి కావాలనే అలా..?
కొన్ని వారాల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తెలంగాణలో మసీదులన్నీ తవ్వుదాం.. శివుడొస్తే మాకు.. శవం ఉంటే మీకు.. అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే, బండి సంజయ్ అంతటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. మిగతా పార్టీల నుంచి పెద్దగా రియాక్షన్ రాలేదు. అధికార బీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం పాటించింది. మజ్లిస్ సైతం ఆ సమయంలో సైలెంట్‌గా ఉండిపోయింది. కర్నాటక కాంగ్రెస్ మాదిరి కౌంటర్ ఇవ్వలేదు. ఒకవేళ మజ్లిస్ కనుక.. మరి, మీ ఆలయాలు కూడా.. అనిఉంటే.. తెలంగాణ మరో కర్నాటకలా మారి ఉండేదని అంటున్నారు.

బైరి కూడా రాజకీయమేనా?
బైరి నరేశ్ విషయంలోనూ అలాంటి ప్రయత్నమే చేయబోయిందని చెబుతున్నారు. బైరి మాట్లాడిన పాత వీడియోను బయటకు తీసి.. కావాలనే వైరల్ చేశారనే అనుమానం అప్పట్లోనే కొందరు వ్యక్తం చేశారు. అయ్యప్ప భక్తుల పేరుతో బీజేపీ కార్యకర్తలు పలుచోట్ల ఆందోళనలకు దిగారని అన్నారు. కొద్దిరోజుల్లోనే ఆ ఇష్యూ ముగిసిపోయింది. కర్నాటకలోని బజరంగ్ బలి వివాదాన్ని తెలంగాణకు తీసుకొచ్చి.. ఇక్కడా హనుమాన్ చాలీసా పఠనాలతో ఆందోళన చేస్తుండటం.. రానున్న రాజకీయానికి ముందస్తు సిగ్నలా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలు.

Related News

Press Freedom: మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ..!

Kargil War: కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది?.. 25 ఏళ్ల తర్వాత నిజం ఒప్పుకున్న పాక్

Big Shock to YS Jagan: పూర్తిగా ఖాళీ అవుతున్న వైసీపీ.. వీళ్లంతా జంప్

US Presidential Election 2024: కమలా హారిస్ విన్ అవుతుందని.. అలన్ ఎలా చెప్తున్నాడు?

TDP Office Attack Case: పరారీలో జోగి రమేశ్‌, దేవినేని అవినాశ్‌?

YSRCP VS TDP: వరద పాలిటిక్స్.. బురదలో ప్రజలు.. నేతల గొప్పలు

Natural Disaster: క్లౌడ్‌ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?

Big Stories

×