EPAPER
Kirrak Couples Episode 1

Hyderabad apartments rates: హైదరాబాద్‌లో తక్కువ ధరకే అపార్ట్‌మెంట్లు, ఆశపడ్డారో ఇక అంతే..

Hyderabad apartments rates: హైదరాబాద్‌లో తక్కువ ధరకే అపార్ట్‌మెంట్లు, ఆశపడ్డారో ఇక అంతే..

హైదరాబాద్ ఫ్లాట్ ఉంటే లైఫ్ చూసుకోవాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తున్నారు. తమ సొంతూళ్లలో ఏమైనా ల్యాండ్ ఉంటే అమ్మేసి.. సిటీలో చిన్న ఫ్లాటు తీసుకునేవారు కోకొల్లలు. ఈ మధ్య పేపర్ చూసినా, మొబైల్ ఫోన్ చూసినా, సిటీ ఎక్కడిపడితే అక్కడ ఒకటే ప్రకటనలు. తక్కువ ధరకే ఫ్లాట్స్ అంటూ నానాహంగామా చేస్తున్నాయి. వాటిని క్లిక్ చేసి లోపలికి వెళ్తే అసలు విషయం బయటకువస్తుంది.


గడిచిన రెండునెలలుగా హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా తక్కువ ధరకే అపార్ట్‌మెంట్స్ ప్రకటనలు దర్శన మిస్తున్నాయి. ఆ తరహా ప్రకటనలు సహజమేనంటూ చాలామంది వీటిని లైట్‌గా తీసుకున్నారు. కొద్దిపాటి వర్షం వస్తే నీరంతా రోడ్లమీదే దర్శనమిస్తోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, బఫర్‌ జోన్లు, ఎఫ్‌టీఎల్‌లను కబ్జా చేసి నిర్మాణాలు కట్టేశారు. గడిచిన పదేళ్లలో ఇది మరింత ఎక్కవైంది. దీంతో కొత్తగా వచ్చిన రేవంత్ సర్కార్ అటు వైపు దృష్టి పెట్టింది. హైడ్రాను తెరపైకి తెచ్చింది. ఇటీవల కాలంలో హైడ్రా (HYDRA) వీర విహారం చేస్తోంది.

హైడ్రా ప్రధాన లక్ష్యం ప్రభుత్వ భూములను కాపాడడం, చెరువులు లేదా లేక్‌లు నాలాలను రక్షించడం. వాటిని కబ్జా రాయుళ్ల బారినపడకుండే చేయకుండా నిరోధించడమే దాని కర్తవ్యం. కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ల పరిధిలో నది హద్దు నుంచి 50 మీటర్లు, స్థానిక సంస్థల వెలువల అయితే 100 మీటర్ల వరకు గ్రీన్ బఫర్ జోన్‌గా ఉంటుంది.


25 ఎకరాల పైబడిన చెరువులకు 30 మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది. 25 ఎకరాల లోపు అయితే 9 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. కాలువలు, వాగు, నాలాలు అయితే 10 మీటర్ల కంటే ఎక్కువ ఉంటే 9 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. 10 మీటర్ల లోపు అయితే రెండు మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది.

ALSO READ: లేకులను కేకుల్లా తినేశారు.. చివరికి ఆ నగరానికి ఏమైందో తెలుసా.. నాగార్జున గారు!

గ్రేటర్ హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఏరియాలను పరిశీలిస్తే.. ఒక్కో ఏరియా ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్నవి ఐదు వేలకు పైగానే అక్రమ నిర్మాణాలున్నట్లు అంతర్గత రిపోర్ట్. వాటిలో సొంతిళ్లు, ఫ్లాట్లు ఉన్నాయి. చాలావరకు చెరువులు, ఎఫ్‌టీఎల్ కబ్జా చేసిన భూములే ఎక్కువగా ఉన్నాయి. వీటిని నిర్మాణాలు పునాదులు దాటేశాయి.

గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడాలపై ఓ అంచనాకు వచ్చింది హైడ్రా. ఇప్పటికే కట్టుకుని ఉంటున్నవారి జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకుంది. ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్న వాటిని టార్గెట్ చేసింది. ఇప్పటికే కొంతమంది బిల్డర్లకు నోటీసులు ఇచ్చింది. నిర్మాణం మధ్యలో ఏం చెయ్యాలో వారికి అంతుబట్టలేదు. ఈ క్రమంలో తక్కువ రేటుకే ఫ్లాట్లను అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు.

కొంతలో కొంతైనా తేరుకోవాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ఏరియాల్లో భారీ ఎత్తున ప్రకటనలు కనిపిస్తున్నాయి. హైడ్రా గురించి ఏమీ తెలీకున్నా కొనుగోలు చేస్తే.. వినియోగదారులు బుక్కయినట్టే. ఇలాంటి ప్రకటన విషయంలో తస్మాత్త జాగ్రత్త.

ఫ్లాట్స్ కొనుగోలు చేసే ముందు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని వెబ్‌సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొనుగోలు చేయవచ్చు.

Hmda: https://lakes.hmda.gov.in/

Bhuvan: https://bhuvan-app1.nrsc.gov.in/bhuvan2d2.0/

Prohibited Properties Telangana: https://registration.telangana.gov.in/openProhibitedProperties.htm

Dharani Portal: https://dharani.telangana.gov.in/gis/

Related News

PAC Meeting: పీఏసీ మీటింగ్, బీఆర్ఎస్ వాకౌట్.. ఆ సంగతేంటి?

Sitaram Yechury: ఆయన పోరాట స్ఫూర్తితో జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాడుతాం : సీఎం రేవంత్

Uppal Police Station Reel: సెంట్ బాటిల్ పై పోలీస్ స్టేషన్ లో రీల్.. పోలీసుల రియాక్షన్ ఇది.. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ?

Kokapet: కూల్చివేతలు.. ఈసారి కోకాపేట్, భారీ బందోబస్తు మధ్య

Muscle Atrophy : నలభై ఏళ్లుగా మంచానికే పరిమితం.. ప్రభుత్వానికి శరీరం ఇస్తానంటున్న బాధితుడు

Revanth govt decision: హైడ్రాకు మరిన్ని అధికారాలు, బెంబేలెత్తిన ‘ఆ’ బిల్డర్లు.. రండి బాబు రండి తక్కువ ధరకే..

Big Stories

×