EPAPER

MLAs Disqualification Petition: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా..? తెలంగాణలో బైపోల్స్ రానున్నాయా?

MLAs Disqualification Petition: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా..? తెలంగాణలో బైపోల్స్ రానున్నాయా?

BRS MLAs Disqualification Petition: రాజ్యాంగంలో శాసనసభ అధికారాలు, న్యాయవ్యవస్థ అధికారాలు వేరువేరుగా ఉన్నాయి. అయితే, తాజాగా ఈ అంశం చర్చకు దారి తీసింది. ఎందుకంటే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ పై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ హైకోర్టు అసెంబ్లీ స్పీకర్ కు సూచించింది. ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే తామే మళ్లీ ఈ కేసును సుమోటోగా చేపట్టి విచారిస్తామంటూ చెప్పటం ఈ కేసులో టర్నింగ్ పాయింట్ గా మారింది.


నిజానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయడమా? లేదా అన్నది పూర్తిగా స్పీకర్ పరిధిలోని అంశం. అయితే, ఇది స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయం. కాగా, న్యాయస్థానాలకు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన నిర్ణయం తీసుకునే అధికారంలేదు. ఈ విషయంలో ఏది జరిగినా కూడా స్పీకర్ నిర్ణయం మేరకే జరగాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయంలో స్పీకర్ కు అంతిమ నిర్ణయాధికారాలు ఉన్నప్పటికీ.. స్పీకర్ నిర్ణయంపై న్యాయస్థానాలు, రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం కలిగి ఉంటాయని ఓ రెండు కేసుల సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2014 లేదా అంతకుముందు కూడా దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా పార్టీ పిరాయింపులు కొనసాగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కేసులు కూడా కొనసాగాయి. నిజానికి ఒక పార్టీ గుర్తింపుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లకుండా ఉండేందుకు 1985లోనే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే, ఈ చట్టంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వాటి ఆధారంగానే పార్టీలను మారడం, ఎల్పీలను విలీనం చేసుకోవడం అనేటువంటివి ఇన్నాళ్లూ జరుగుతూ వచ్చాయి. నిజానికి ఈ చట్టానికి చాలా సార్లు సవరణలు చేశారు. అయినా సరే అంతంత మాత్రంగానే మిగిలిపోయింది. పార్టీ ఫిరాయింపులను ఈ చట్టం ఆపలేకపోతుంది.

Also Read: తెలంగాణ అసెంబ్లీలో కమిటీల నియామకం.. అరికెపూడికి బిగ్ ఆఫర్


అయితే, విషయం ఏమిటంటే.. హైకోర్టు తీర్పు తమ విజయమంటూ ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గత పదేళ్లలో రెండుసార్లు టీడీఎల్పీ విలీనం, సీఎల్పీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం వంటివన్నీ చేశారు. గత బీఆర్ఎస్ సర్కారు కోర్టు తీర్పులను అమలు చేయలేదని కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం గుర్తుచేస్తున్నారు. హైకోర్టు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సూచన ఇచ్చింది. దీంతో ప్రస్తుతం తరువాత ఏం జరుగుతది..? స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? అనేదానిపైన రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ కొనసాగుతుంది.

నిజానికి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకుంటే పార్టీ మారిన మరో ఏడుమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లైన్లో ఉంటారు. ఈ అందరికీ కూడా ఒకే నిర్ణయం వర్తింపజేయాల్సి వస్తుంది. అయితే, అనర్హత వేటుపై విచారించి ఇంత సమయంలోనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న రూలేమీ లేదు. గతంలో ఇలాంటి సందర్భంలో వారాలు, నెలలు, సంవత్సరాల సమయం తీసుకున్న సందర్భాలు లేకపోలేదు. సో.. ప్రస్తుతం స్పీకర్ ఎంత సమయం తీసుకుంటారన్నది కీలకంగా మారింది. అయితే, స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు సమయం ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం లేకపోలేదని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది అంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఇది. ఈ తీర్పుపై సదరు ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్ కు వెళ్లే స్కోప్ కనిపిస్తున్నది. ఈ విషయంలో న్యాయసలహాలు తీసుకుంటామంటూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు వెనుకాడమంటూ వారు చెబుతున్నారు. అయితే, తుది నిర్ణయానికి ఇంకా సమయం పట్టే అవకాశంలేకపోలేదు. బీఆర్ఎస్ అనుకుంటున్నట్లుగా రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. పరిస్థితులకు తగ్గట్టుగా ఎమ్మెల్యేల నిర్ణయాలు ఉంటాయని, అందువల్ల దానిని పార్టీ ఫిరాయింపుల కింద చూడలేమంటున్నారు ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు. ఈ విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా ఉంటుందన్నారు.

ఈ అంశంపై కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉంటుంది..? కాంగ్రెస్ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? అనేదానిపై ఎట్ ప్రజెంట్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. మరింతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆకర్శించి బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకోవడమా..? లేదా న్యాయస్థానాల్లో రివ్యూలు కోరటమా? అన్నది కీలకంగా మారింది. అయితే, బీఆర్ఎస్ నుంచి మూడింట రెండింతల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితేనే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మృతితో అక్కడ బైపోల్ రావటం.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవటంతో బీఆర్ఎస్ పార్టీ బలం 38కి తగ్గింది. ఆ 38 మందిలో నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లోకి చేరిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇంకో 16 మంది ఎమ్మెల్యేలు వస్తే హస్తంలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కానున్నది.

Also Read: తప్పు తెలుసుకున్న కేసీఆర్.. వాళ్ళతో చర్చలకు సిద్ధం

ఇటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామంటున్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం సిగ్గుచేటని, వాజ్ పేయీ హయాంలో ఒక్క సీటుతో బీజేపీ అధికారం కోల్పోయినా కూడా ఎప్పుడూ కూడా ఫిరాయింపులకు పాల్పడలేదంటున్నారు.

నిజానికి పార్టీ ఫిరాయింపుల కేసుల్లో కోర్టుల తీర్పులు కూడా భిన్నంగా ఉంటున్నాయి. ఇదో విస్తృతమైన సబ్జెక్టుగా మారిపోయింది. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరగడం.. ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరిన్ని అధికారాలు ఇవ్వడం.. సవరణలు చేపట్టడం.. ఇవన్నీ కూడా కీలకంగా మారాయి.

Related News

Telangana Liberation Day: బలిదానాలు, త్యాగాలతోనే తెలంగాణకు స్వాతంత్య్రం.. కిషన్ రెడ్డి

Telangana Vimochana Dinotsavam : ఢిల్లీ బంగ్లాదేశ్‌లో లేదు.. ఎన్నిసార్లైనా వెళ్తా: బీఆర్ఎస్‌‌కు సీఎం రేవంత్ కౌంటర్

Balapur Ganesh 2024 Laddu Auction: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. ఆల్ టైమ్ రికార్డు ధర

Ganesh Laddu All Time Record: ఆల్‌టైం రికార్డ్.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డూ.. ఎక్కడంటే?

Khairatabad Ganesh: ప్రారంభమైన ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర.. ఉత్కంఠగా బాలాపూర్ లడ్డూ వేలం

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Big Stories

×