EPAPER

Ekashila Housing Society: ఏకశిలలో ఏకఛత్రాధిపత్యం, సొసైటీ మాటున అక్రమాలెన్నో.. ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

Ekashila Housing Society: ఏకశిలలో ఏకఛత్రాధిపత్యం, సొసైటీ మాటున అక్రమాలెన్నో.. ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

⦿ హన్మకొండలో ఏకశిలా హౌజింగ్ సొసైటీ చిత్రాలు
⦿ లే అవుట్ పూర్తి అయినా ఏర్పడని వెల్ఫేర్ అసోసియేషన్
⦿ బ్యాంక్ అకౌంట్స్ లేకుండానే ఎన్నో ఏళ్ల నుంచి దందాలు
⦿ పేపర్ల మీదనే మీటింగులు, సొసైటీ పనులు
⦿ ఫిజికల్‌గా ఎక్కడా కనిపించని ఆఫీస్
⦿ కాస్ట్లీ ఏరియా కావడంతో బంధువులు, స్నేహితులతో నిండిపోయిన సొసైటీ
⦿ రికార్డులు మాయం చేసి ఎంతోమందిని ఆగం చేస్తున్న పుల్లూరు సమ్మయ్య
⦿ వాళ్లు చేసిందే చట్టం, అనుసరించేదే రూల్
⦿ దూర ప్రాంతాల్లో ఉన్నవారే టార్గెట్‌గా బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలు
⦿ 234 మంది సభ్యుల్లో ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా ఆ 15 మందే అంతా!
⦿ హన్మకొండ ఏకశిలా ఏకశిలా హౌజింగ్ సొసైటీపై ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ


దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ అక్రమాలపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేటివ్ కథనాలు ఇచ్చింది. నిజానిజాలేంటో నిర్భయంగా పక్కా ఆధారాలతో జనం ముందు ఉంచింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సొసైటీలపై చర్చ మొదలైంది. ఒక్క జూబ్లీహిల్స్ సొసైటీలోనే వందల కోట్ల రూపాయల స్కాములు వెలుగుచూస్తే, మిగిలిన సొసైటీల్లో ఇంకెన్ని అక్రమాలు జరిగాయో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైసా పైసా కూడబెట్టుకుని సొసైటీల్లోని సభ్యులు అయి ప్లాట్ దక్కించుకుంటే, పాలక వర్గం పేరుతో పంచుకుతినడం ప్రతీచోట అలవాటుగా మారింది. సొసైటీ యాక్ట్ 1965 ఎంతో కఠినంగా, పకడ్బందీగా చట్టాలు ఉన్నా ఏ ఒక్కటి ఫాలో కావడం లేదు. కేసులు అయినా, రాజకీయ అండదండలతో బయటపడుతున్నారు. హన్మకొండలోని అడ్వకేట్స్ కాలనీకి ఆనుకుని ఉన్న ఏకశిలా కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ కూడా అంతే. ఇక్కడి వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా, పుల్లూరు సమ్మయ్య అనే సభ్యుడు ఇష్టారీతిన సాగిస్తున్న దందాలు లెక్కలేనన్ని. తన పూర్వ స్నేహితులైన 12 మంది సభ్యులతో కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. ట్విస్ట్ ఏంటంటే వీరిలో నలుగురు తన బంధువులే. ఎలాంటి అధికారం లేకున్నా, డబుల్ రిజిస్ట్రేషన్స్ చేస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. క్రిమినల్ కేసులు అయినా భయపడకుండా బరితెగిస్తున్నారు.


ఫిర్యాదుల వెల్లువ

ఏకశిలా కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ 1978లో ఏర్పడింది. 234 మంది సభ్యులు ఉన్నట్లు ప్రకటించారు. 1981లో 10 ఎకరాల 35 గుంటల భూమిని 114 మంది సభ్యులకు కేటాయించారు. కుడా(కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) అనుమతితో లే అవుట్ వచ్చింది. అయితే, దగ్గరలో ఇళ్ల స్థలాలు లేనివారికి కేటాయించాలని సొసైటీ నిర్ణయం. అప్పట్లో లెక్చరర్స్, ప్రభుత్వ ఉద్యోగులు 1985లో డబ్బులు చెల్లించారు. రిసిప్ట్స్ లేకుండానే డబ్బులు తీసుకుని అలాట్మెంట్ అయిన పత్రాలను అందజేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సోసైటీ పేరు మీద ఒక్క బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయకుండా దందా చేస్తున్నారు. అందులో సమ్మయ్య వ్యవహారంపై అనేక ఫిర్యాదులు సొసైటీకి అందాయి. గత 27 ఏండ్లుగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రెటరీగా పదవులు వారే తీసుకున్నారు. మొత్తం సభ్యులు 400 మందికి సభ్యత్వం ఉన్నట్లు ప్రకటించుకున్నా, 15 మందికి మించి జనరల్ బాడీ మీటింగ్ జరగదు. ఇందులో 12 మంది ఓట్లు వేస్తే నలుగురు డైరెక్టర్స్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రెటరీ, ట్రెజరర్స్‌ అవుతారు. గత 15 ఏండ్లుగా సొసైటీలో వారే ఉన్నట్లు వారితోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒత్తిడి చేయడం, లిటిగేషన్స్ పెట్టి డబుల్ రిజిస్ట్రేషన్స్ చేయించి సెటిల్మెంట్స్ చేయడం అలవాటుగా చేసుకున్నారు. రిటైర్ అయ్యాక ఇల్లు కట్టుకుందామని అనుకున్న వారి ప్లాట్లపై పెత్తనం చేసి కోట్ల స్కాంకి తెరతీశారు. దీంతో 2013 నుంచి జరుగుతున్న ప్లాట్ కేటాయింపుదారులు ఏకమయ్యారు. 2020లో ఈ పేపర్ సొసైటీని అడ్డుకుని ఎదురు తిరిగారు. దీంతో ఒకే రోజు 10 ఏండ్ల మినిట్స్ బుక్ రాసుకుని ఇష్టం వచ్చిన వారికి ప్లాట్స్ కేటాయింపులు, ఎదురు తిరిగిన వారి ప్లాట్స్ రద్దు చేస్తున్నట్లు నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో పొలిటికల్ అండదండలతో ఎవరేం చేస్తారనే ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ ఏకశిలా సొసైటీ మేనేజింగ్ కమిటీ దందాలను తవ్వి తీస్తున్నారు. ప్రభుత్వానికి, కో ఆపరేటివ్ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

అంతా వారే

పుల్లూరు సమ్మయ్య వీఎంఆర్ పాల్ టెక్నిక్ కాలేజీలో ట్యూటర్. ఇతను 1985 నుంచి సభ్యుడు. అయితే, ఇతనికి ప్లాట్ కేటాయించలేదు. ప్లాటింగ్ అయిన ఏరియా అంతా డెవలప్ అయింది. దీన్ని వెల్ఫేర్ అసోసియేషన్‌గా మార్చుకోవాలి. లేదంటే మొత్తం సభ్యుల కంటే 10 శాతానికి మించి సభ్యులను తీసుకోరాదని సొసైటీ యాక్ట్ ప్రకారం 2000 సంవత్సరంలో ఉత్తర్వులు ఉన్నాయి. ఇవేమీ ఫాలో కాకుండా కనీసం బ్యాంకు అకౌంట్, ఆఫీస్ లేకుండానే 27 ఏండ్లుగా కాగితాలపైనే 12 మంది సొసైటీని జనరల్ బాడీగా నడిపారు. ఇందులో ఇతని బంధువులు బజ్జురి శోభారాణి(డైరెక్టర్), ఆమె భర్త బజ్జురి పురుషోత్తం(వైప్ ప్రెసిడెంట్). బావమరిది అనంతుల రమేష్‌లు ఉన్నారు. ఇక చిన్ననాటి స్నేహితులైన పురం ప్రసాద్, జీ రామచంద్రం ఉన్నారు. వీరితోపాటు మనోహార్ రెడ్డితో పాటు, గోలి రాజేందర్, పెండ్రు అశోక్ రెడ్డి, బుక్యా వెంకన్న, నరేందర్‌‌లను దగ్గర పెట్టుకుని దందా నడిపిస్తున్నారని ప్లాట్ ఓనర్స్ ఆరోపిస్తున్నారు. 2016లో 22 సంవత్సరాలు ఉన్న రూపిరెడ్డి ఈశ్వర్ రెడ్డికి 2020లో ప్లాట్ కేటాయిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రూ.2,500లు తీసుకొని రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. 430 మంది ఉన్న సభ్యులను కాదని ఈ యువకునికి ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో అర్థం చేసుకోండి. ఇలాంటి వ్యవహారాలపై ఫిర్యాదులు అందడంతో స్పెషల్ ఆఫీసర్ పాలనకు ఆదేశాలొచ్చాయి. అయితే, ఆ ఒక్క రోజుకంటే ముందే 3 ప్లాట్స్‌ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు.

ఎవరూ రాలేదంటే కబ్జా చేయడమే!

మొదటగా ప్లాట్ ఎవరికి కేటాయించారో చూస్తారు. సాఫ్ట్‌గా ఉండేవాళ్లు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్లు, పిల్లలు విదేశాల్లో సెటిల్ అయిన వారిని ఎంచుకుని, మీ ప్లాట్ రద్దు అయిందని రిజిస్ట్రేషన్ కాదని చెబుతారు. ఎంతో కొంత ఇస్తాం అలాట్మెంట్ చేసిన పత్రం ఇచ్చి వెళ్లాలని డిమాండ్ చేస్తారు. ఆ ప్లాట్‌కి వేరే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేస్తారు. సభ్యత్వం నెంబర్, ప్లాట్ నెంబర్ అంటూ కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ తర్వాత రాటిఫికేషన్ పెట్టుకుని పూర్తిగా కబ్జాకు తెరతీస్తారు. కేసు పోలీస్ స్టేషన్ వరకు చేరుకుంటే ఇరు పక్షాలను పిలుచుకుని కాంప్రమైజ్ చేస్తారు. రూ.70 వేలకు గజం ఉండే ప్లాట్‌ని రూ.15 వేలకు కొనుగోలు చేస్తామని, లేదంటే మీరు అసలు డబ్బులే కట్టలేదని ఉల్టా ఫిర్యాదులు చేస్తారు. ఆనాడు డబ్బులు కట్టింది తెల్ల పేపర్ పైనే, ఆ పేపర్స్ చెల్లవంటూ కొత్త వాదన ముందుకు తెస్తారు. డబ్బులు ఇవ్వకుంటే అలాట్మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి, ప్లాట్ ఓనర్స్‌కి చుక్కలు చూపిస్తుంటారు. ఇప్పటికీ బ్యాంకు అకౌంట్ కూడా తీసుకోకుండానే, ఆడిట్ లేకుండానే సొసైటీని నడిపిస్తున్నారంటే వీరి బాగోతాలెన్నో అర్థం చేసుకోండి. అన్ని ఆధారాలు సమర్పించినా, ఏదో వంకతో లిటిగేషన్ పెట్టడం వీరికి అలవాటు. ఇలా సుమారు 30 ప్లాట్స్‌ని కబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఎప్పుడో ఇళ్లు కట్టుకున్న వారికి మేమే రిజిస్ట్రేషన్ చేయాలని వారి వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయడం, రాజకీయ నాయకులతో చేతులు కలిపి దందాలు చేస్తుండటంతో హన్మకొండలో ఏకశిలా సొసైటీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: దేవిశ్రీ ఈవెంట్ కోసం గచ్చిబౌలీ స్టేడియం ట్రాక్‌పై భారీ సెట్.. ప్రశ్నించిన ‘బిగ్ టీవీ’ ప్రతినిధిపై దౌర్జన్యం

రికార్డులు మాయం

అవకతవకలకు చెక్ పెట్టేందుకు పర్సన్ ఇంచార్జీని కో ఆపరేటివ్ సొసైటీ డిపార్ట్‌మెంట్ నియమించింది. గత రికార్డులు సమర్పించాలని కోరినా ఇవ్వడం లేదు. ఏడాదికోసారి 12 మందితో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ బుక్స్, 5 ఏండ్లకోసారి జరిగిన 12 మందిలో అదే 8 మందిని ఎన్నుకున్నట్లు జరిగిన ఎలక్షన్ వివరాలు మాత్రమే సమర్పించారు. అవ్వన్నీ కూడా ఒకే రోజు రాసినట్లు అనుమానాలున్నాయి. ఒకే స్ట్రోక్, ఒకే పెన్ను, ఒక్కరే రాసినట్లు స్పష్టంగా అనిపిస్తోంది. ఇక ఏటా సమర్పించే ఆడిట్ రిపోర్టులు, జనరల్ బాడీ తీర్మానాలు, లావాదేవీలు, రిసిప్ట్స్, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ సమర్పించడం లేదు. ట్రై సిటీ నడిబొడ్డున ఇన్ని అక్రమాలు చేస్తున్నారంటే కో ఆపరేటివ్ సొసైటీల పాలక వర్గాల దందాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి.

Related News

CM Revanth Reddy: దిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి, సీడబ్ల్యూసీ భేటీ, క్యాబినెట్ బెర్తులపైనా కీలక సమావేశం

GHMC : గ్రేటర్ హైదరాబాద్ కొత్త కమిషనర్‌గా ఇలంబర్తి, పలువురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు

Mlc Kodandaram : గురుకులాలకు బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసింది – ఎమ్మెల్సీ కోదండరాం

Special Powers To Hydra: హైడ్రా కోరలకు మరింత పదును.. జీవో జారీ, ఇక వాటిపై కమిషనర్‌దే ఫైనల్ నిర్ణయం

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వంపై హారీష్ రావ్ ఫైర్

Telangana, Ap IAS Officers : ఐఏఎస్ ఐపీఎస్’లకు ఏపీ, తెలంగాణ సర్కారు ఝలక్, హైకోర్టు తీర్పు కంటే ముందే రిలీవ్ ఆర్డర్స్ ?

Big Stories

×