EPAPER
Kirrak Couples Episode 1

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

– రూ.16 కోట్ల ప్లాట్‌ని దర్జాగా అమ్మేసిన వైనం
– ఇళ్లు కట్టుకోవడానికే ఏర్పడిన సొసైటీ
– 36 ఏండ్లుగా ఖాళీగా ఉన్న జాగా.. గంటలోనే మళ్లీ అమ్మకం
– బైలాస్‌ని ఉల్లంఘించి మరీ సర్దార్ దల్జీత్ సింగ్ కొనుగోలు
– అప్పట్లోనే ఐఏఎస్‌కి ప్లాట్ కేటాయింపు.. అనేక ఆరోపణలు
– ఇప్పుడు ఆయన కుమారుడికి రిజిస్ట్రేషన్ చేయడంతో అవినీతి మరకలు
– గంటలోనే మళ్లీ అమ్ముకోవడంతో అనేక అనుమానాలు
– బినామీలు ఎవరు? సొమ్ము చేరింది ఎవరికి?
– కో ఆపరేటివ్ సొసైటీ, కమర్షియల్ సొసైటీగా మారిందా?
– 51 ఎంక్వైరీ తీరు చూస్తే చిత్రపురి సొసైటీ పెద్దలకు పడిన శిక్షే పడుతుందా?
– జూబ్లీహిల్స్ బడాబాబుల సొసైటీపై స్వేచ్ఛ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ


దేవేందర్ రెడ్డి చింతకుంట్ల. 9848070809

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: హైదరాబాద్‌లోని అత్యంత కాస్ట్లీ ఏరియాలో జూబ్లీహిల్స్ ఒకటి. ఇక్కడ ఓ ప్లాట్ కొనాలంటే అంత ఈజీ కాదు. కానీ, రూల్స్‌కి విరుద్ధంగా అయితే, కమిటీ వెంటనే క్లియర్ చేసేస్తుంది. అమ్మిన ప్లాట్స్‌లో ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోదు. రాజకీయాలకు వేదికగా మార్చుకుని, చేసిన ప్రతీది సమర్ధించుకుని ప్రచారం కాకుండా, కేసులు లేకుండా జూబ్లీహిల్స్ హౌజింగ్ సోసైటీ పాలక వర్గంలో జరుగుతున్న చిత్రాలు అన్నీ ఇన్నీ కావు. నిత్యం కోర్టుల చుట్టూ తిరుగుతూ అందిన కాడికి దోచేయడమే పని. ఎన్నో విజిలెన్స్, సీబీసీఐడీ, అసెంబ్లీ హౌజ్ కమిటీలు, సోసైటీల కమిటీల రిపోర్టులు, 51 దర్యాప్తు నివేదికలు ఇలా ఎన్ని జరిగినా, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇందుకు చక్కటి ఉదాహరణే నందగిరి హిల్స్ వ్యవహారం. ఆ సొసైటీ ప్రెసిడెంట్ మీడియా ముందుకు వచ్చి జరిగిందంతా పూస గుచ్చినట్టు వివరించడంతో, అసలు బండారం బయటకొచ్చాయి. నెట్ నెట్ వెంచర్స్ ఓనర్స్ జూబ్లీహిల్స్‌లో రెండు ప్లాట్స్ కొనుగోలు చేసి, పక్కనే ఉన్న నందగిరి హిల్స్‌లోని భూముల్లో అక్రమంగా అదనపు అంతస్తుల నిర్మాణం చేస్తున్నారు. దీంతో స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం జూబ్లీహిల్స్ సొసైటీ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్‌ని పరిశీలించింది. అందులో భయంకరమైన నిజాలు ఉన్నాయి. రూ.16 కోట్ల ప్లాట్ ఒక్క గంటలోపే రెండుసార్లు అమ్మినట్టు తేలింది. బినామీల వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది.


ఐఏఎస్‌కి ప్లాట్ కేటాయింపు!

304/జీ/111 నెంబర్ గల 529 గజాల ప్లాట్‌ని 1988, మార్చి 21న నటరాజన్ అనే ఐఏఎస్ అధికారికి కేటాయించారు. ఆయన మెంబర్ షిప్ నెంబర్ 4153. నటరాజన్ మరణం తర్వాత కుమారుడు శంకర నారాయణన్‌కి సభ్యత్వం బదిలీ అయింది. ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రభుత్వ విలువపై సొసైటీకి డబ్బులు చెల్లించాలి. శంకర నారాయణన్ డబ్బులు చెల్లించలేదు. కానీ, 2019 మే 29న సభ్యత్వం పునరుద్దరించారు. అయితే, అతనికి కేటాయించిన ప్లాట్ 36 ఏండ్లుగా ఖాళీగానే ఉంది. అతను రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, ఆ తర్వాత వెయింటింగ్ లిస్ట్‌లో ఉన్న వారికి కేటాయించి చేయాలి. కానీ, అలా జరగలేదు. 36 ఏండ్ల తర్వాత ఒక్క గంటలోనే రూ.5 కోట్లు సంపాదించేలా కుట్రలు చేశారు కొంతమంది పాలకమండలి సభ్యులు. ఇల్లు నిర్మించకుండానే సర్దార్ దల్జీత్ సింగ్‌కి విక్రయించడం సొసైటీ యాక్ట్ ప్రకారం చట్ట విరుద్ధం.

ఓనర్ కాకుండానే డబ్బులు ఎలా?

2024 జూన్ 28 నాటికి శంకర నారాయణన్ అమ్మకం జరిపిన ప్లాట్‌కి ఓనర్ కాదు. కానీ, స్టాంప్ డ్యూటీ చార్జెస్ కోసమంటూ రూ.25,89,735 లు చెల్లించాడు. 2024 జులై 1న సొసైటీ నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అవి అవసరయ్యాయి. 2024 జూన్ 29న మరో రూ.60,80,550 లు స్టాంప్ డ్యూటీ కోసం చెల్లించాడు. అదే రోజున ప్లాట్ డబ్బులు సొసైటీకి చెల్లించాల్సి ఉండగా రూ.3,40,67,600 లు ఆయనకు అకౌంట్ ద్వారా బదులాయించారు. ఆ నగదును 2024 జులై 1న శంకర నారాయణన్ అకౌంట్ నుంచి జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌజింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌కి బదిలీ చేశారు. సర్దార్ దల్జీత్ సింగ్ బదిలీ చేసిన అమౌంట్ యే సొసైటీకి బదలాయించారు. గతంలో రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన డబ్బులను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు షిఫ్ట్ చేశారు. దీంతో రూ.16 కోట్ల విలువ చేసే భూమి(డాక్యుమెంట్ నెంబర్ 4244/2024 – 529 గజాలు) ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

గంటలోనే సర్దార్‌కి అమ్మకం

భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసమే తనపై ప్లాట్ లేకుండానే ప్లాట్‌కి అంటూ డబ్బులు ఆర్టీజీ చేసిన సర్దార్, శంకర నారాయణన్‌కి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత గంటలోపే మళ్లీ రిజిస్ట్రేషన్ తన పేరు మీదుగా చేయించుకున్నాడు. అక్షరాలా రూ.8 కోట్లు ఇస్తున్నట్లు తెలిపాడు. గతంలో చెల్లించిన అమౌంట్‌తో పాటు రూ.4,25,42,665 లు చెల్లించాడు. డాక్యుమెంట్ నెంబర్ 4257/2024. ఈసీ అప్లోడ్ కాకుండానే సబ్ రిజిస్ట్రార్ సూపర్ పాస్ట్‌గా రిజిస్ట్రేషన్ చేశారంటే ఏం మాయ చేశారో అర్ధం చేసుకోండి. శంకర నారాయణన్ డాక్యుమెంట్‌లో 4, 5 పేజీల్లో సొసైటీ రూల్స్ ఉంటాయి. ఇళ్లు నిర్మించకుండా అమ్మరాదని నిబంధనలు ఉన్నాయి. అవేమీ పట్టించుకోకుండానే గంటలోనే రిజిస్ట్రేషన్ చేయడం వెనుక నేరపూరతమైన కుట్రలు దాగి ఉన్నాయి. బినామీల వ్యవహారం ఉందని తెలుస్తోంది. డాక్యుమెంట్ రావడానికే 4 రోజులు పట్టే ఈ కాలంలో 2024, జనవరి 18 అంటే, 15 రోజుల్లోనే జీహెచ్ఎంసీ వద్ద ఇంటి అనుమతులు తీసుకుంటున్నట్లు, అదే ప్లాట్‌ని మార్టిగేజ్ కూడా చేసినట్లు ఈసీలో కనిపిస్తోంది. అంటే జూబ్లీహిల్స్ బడాబాబులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని చెప్పడానికి ఇదో ఉదాహరణ.

3 గంటల్లోనే వాల్యుయేషన్‌లో సగం కంటే ఎక్కువ

జూబ్లీహిల్స్ హౌజింగ్ సోసైటీ నుంచి శంకర నారాయణన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు గజానికి రూ.64,400 చొప్పున రూ.25,89,720 స్టాంప్స్ డ్యూటీ చెల్లించారు. ఇప్పుడు ప్లాట్ విలువ రూ.3,40,67,600 గా పేర్కొన్నారు. అదే గంటలో సర్దార్ కొనుగోలు చేసినప్పుడు మార్కెట్ విలువ గజానికి రూ.1,54,228 చొప్పున రూ.60,80,550 లు చెల్లించారు. దీంతో ప్లాట్ ధర రూ.8 కోట్లకు చేరుకుంది. నిజానికి ఇక్కడ మార్కెట్‌లో గజం రూ.3.20 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు పలుకుతోంది. ఈ డబ్బంతా ఎవరికి చేరిందనేది ఏసీబీ లాంటి దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేస్తే గానీ బయటపడదు. రిజిస్ట్రేషన్ కాని డాక్యుమెంట్స్ కూడా రెండు రోజుల ముందు చలాన్లు జనరేట్ చేశారంటే ఎన్ని లొసుగులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసుకోకపోయినా, అలాట్మెంట్ రద్దు చేయవచ్చనే రూల్స్ ఉన్నా, కనీసం ఎలాంటి నిర్మాణాలు చేయకుండానే అమ్ముకోవడం సొసైటీ యాక్ట్ ఉద్దేశానికే మచ్చ తెచ్చే వ్యవహారం. ఈ లొసుగులను చట్టాలకు అంటగట్టి, చుట్టంగా మార్చుకుని కోర్టుల్లో భూమిని క్లియర్ చేసుకోవడం అలవాటుగా మారింది. వెయింటింగ్ లిస్టులో ఉండే సభ్యులకు ఎప్పుడూ నిరాశే మిగులుతోంది.

అక్రమాలపై సీఎంతో పాటు ఐటీ, ఈడీకి ఫిర్యాదులు

ఇప్పటికే ఎన్నో అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న సొసైటీ పాలక వర్గాలు ఇప్పుడు మరో కేసును ఎదుర్కొవాల్సి వస్తోంది. అందులో అన్ని ఫిర్యాదులతో పాటు ఇటీవల హైకోర్టుకు సమర్పించిన ఎంక్వైయిరీ 51 రిపోర్ట్ కూడా త్వరలోనే ఆయా దర్యాప్తు సంస్థలకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిత్రపురి కాలనీలో జరిగిన అవినీతి ఎలా బయటపడుతోందో, జూబ్లీహిల్స్ సొసైటీ గుట్టంతా బయటకు వస్తుందని, త్వరలోనే కేసులు నమోదు అవుతాయని విశ్వసనీయ సమాచారం. సీఎంతో పాటు ఐటీ, ఈడీకి ఫిర్యాదులు అందజేయనున్నట్టు తెలుస్తోంది.

Related News

Alla Nani: వైసీపీ రాజీనామా నేతలకు జనసేన డోర్లు తెరుచుకుంటాయా ? ఆళ్ల నాని పరిస్థితి ఏంటి ?

Hydra Demolitions: కూల్చివేతలపై భిన్న స్వరాలు.. కేసీఆర్ అలా.. కేటీఆర్ ఇలా..

World War III Fix: ఇజ్రాయెల్-హిజ్బుల్లా వార్.. మూడో ప్రపంచ యుద్ధం ఫిక్స్?

Chevireddy Bhaskar Reddy: ఏమైనా కానీ నేను ఏం మాట్లాడను.. భయంలో చెవిరెడ్డి

Tourism Corporation: బోయినపల్లి బంధుప్రీతి.. టూరిజం కార్పొరేషన్ అధోగతి..!

YS Jagan: పిన్నెల్లే దిక్కయ్యారా?.. జగన్ వ్యూహమేంటి?

Big Stories

×