EPAPER

Telangana BJP: కిషన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యేలు.. వార్‌.. ఇన్‌ సైడ్ వార్‌

Telangana BJP: కిషన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యేలు.. వార్‌.. ఇన్‌ సైడ్ వార్‌

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా.. గత ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు సాగిన కమలదళం కేవలం ఎనిమిది సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. గతంతో పోలీస్తే..  బీజేపి మంచి సీట్లు, ఓట్లు సాధించినా.. అనుకున్న లక్ష్యానికి దారిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. ఈ అంశాన్ని అలా ఉంచితే.. గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి.. అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాల్సిందిపోయి.. ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడం స్ఫష్టంగా కనిపించిందని పార్టీ వర్గాలతో పాటు రాజకీయ నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో.. కొంతమంది ఎమ్మెల్యేలకు పొసగడం లేదని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేలు ఉండటంతో.. BJP వర్సెస్ BJLP అన్నట్టుగా పరిస్థితి తయారైందనే వాదనలు ఉన్నాయి. దీంతో ఏలేటి తన మకాం అసెంబ్లీకి మార్చారట. మీడియా కార్యక్రమాలన్నీ పార్టీ ఆఫీసులో కాకుండా అసెంబ్లీ బీజేఎల్పీ కార్యాలయానికి షిఫ్ట్ చేసుకున్నారు. ఇప్పటికే సగం మంది ఎమ్మెల్లేలు.. శాసనసభాపక్ష నేతగా ఏలేటిని ఇష్టపడడం లేదు. ఎమ్మెల్యేలే కాదు.. రాష్ట్ర అధ్యక్షుడు కూడా దీనిపై వ్యతిరేకంగా ఉన్నట్టు సమాచారం. ఏలేటి వ్యవహారం.. కిషన్‌రెడ్డికి నచ్చడం లేదనే చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా వినిపిస్తోంది.


మరోవైపు.. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి, ఆ పార్టీ ఎమ్మెల్యేల మధ్య మరో వార్ మొదలైనట్లు విస్తృతంగా చర్చ నడుస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా గెలిచిన ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకత్వం సముచిత స్థానం కల్పించడంలేదని పలువురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సొంత నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకత్వం.. ఎమ్మెల్యేలకు ఎలాంటి దిశానిర్థేశం చేయలేదు. దీంతో.. ఎమ్మెల్యేలు సభలో ఏం మాట్లాడాలో అర్థంకాక సతమతమయ్యారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఇద్ధరికీ మాత్రమే అనుభవం ఉంది. మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు.. కొత్తగా శాసనసభకు ఎన్నికయ్యారు. సభలో లేవనెత్తాల్సిన సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై సబ్జెక్ట్‌ అందించాల్సిన పార్టీ అధినాయకత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని ఎమ్మెల్యేలు వాపోయారు. పార్టీకి, ఎమ్మెల్యేలకు మధ్య నడుస్తున్న అంతర్గతపోరుతో సతమతమవుతుంటే.. ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లోనూ కూడా రెండు గ్రూపులుగా విడిపోయినట్లుగా ప్రచారం జోరుగా నడుస్తోంది.

Also Read: హైదరాబాద్‌లో పాపన్న విగ్రహం ఏర్పాటు.. డిప్యూటీ సీఎం

అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న అంతర్గత గందరగోళంతో సమన్వయం లేదని స్పష్టంగా తెలుస్తోంది. శాసనసభాపక్ష నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. అందరినీ కలుపుకోని పోవాల్సింది పోయి… అన్ని తానే అన్నట్లుగా వ్యవహారంచడంతో మిగితా ఎమ్మెల్యేలంతా.. అసహానాన్ని బయట పెట్టుకున్నారట. తాము ఎమ్మెల్యేలమేనని.. పార్టీ తరపున ప్రజల గొంతును వినిపించాల్సిన బాధ్యత ఉందని బహిరంగంగానే చెప్పుకొంటున్నట్లు సమాచారం. దీంతో శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మిగతా ఎమ్మెల్యేలకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినా.. సబ్జెక్ట్ అందించడంలో బీజేపీ, బీజేఎల్పీ విఫలమైనట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. అంతేకాదు.గత ప్రభుత్వ వైఫల్యంలో భాగంగా సుంకిశాల ప్రాజెక్టు కుప్పుకూలిపోవడంతో.. ఆ ప్రాజెక్టు సందర్శించాలని బీజేఎల్పీ పిలుపునిచ్చింది. కానీ.. సుంకిశాల సందర్శనకు ఐదుగురు ఎమ్మెల్లేలు డుమ్మా కొట్టడంతో ఎమ్మెల్యేల మధ్య ఉన్న గ్రూపులు మరోసారి బయటపడ్డాయి. పార్టీని బలోపేతం కోసం పని చేయాల్సిన శాసన సభ్యలు తలోదారి అన్నట్లుగా వ్యవహారించడం వల్ల కాషాయశ్రేణులు అయోమయంలో పడ్డాయి.

సుంకిశాల ప్రాజెక్టు సందర్శనకు ఎమ్మెల్యేల బృందం వెళ్లాలని బీజేఎల్పీ తీర్మానం చేసింది, దానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు భిన్నంగా వ్యవహారం నడిచింది. కేవలం సుంకిశాల పర్యటనకు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మాత్రమే వెళ్లి అక్కడ పరిశీలన చేశారు. మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరు కావటం పెద్ద రచ్చే రేపుతోందట. శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ముథోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ AVN రెడ్డి మాత్రమే సుంకిశాల సందర్శనకు వెళ్లారు. మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలైన.. రాజాసింగ్‌, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్‌ శంకర్‌, ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, ఫైడి రాకేష్‌ రెడ్డి సందర్శనకు వెళ్లలేదు. సమాచారం అందించినా.. నియోజకవర్గాల్లో కార్యక్రమాల నేపథ్యంలో రాలేకపోయారని మిగతా సభ్యులు చెబుతున్నారు. అయితే విభేదాల కారణంగానే వారు ఆ కార్యక్రమానికి హాజరుకాలేదనేది పార్టీల్లో చర్చించుకుంటున్నారట.

మరోవైపు కిషన్‌రెడ్డి వర్గ ఎమ్మెల్యేలు సుంకిశాల పర్యటనకు దూరంగా ఉన్నారని.. కిషన్ రెడ్డి పిలుపు మేరకే వారంతా పర్యటనకు రాలేదనే చర్చ సాగుతోంది. అంతేకాదు.. సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిన ఘటనపై BJLP పర్యటన తరువాత బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి కనీసం ప్రకటన విడుదల చేయకపోవడం…. ఇప్పుడు వస్తున్న గ్రూపుల రాజకీయాలకు బలం చేకూరినట్లు అవుతోంది. శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రమే దీనిని ఖండించారు. ఏలేటిపైన రాష్ట్ర నాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. సుంకిశాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని పార్టీ చెప్పనందుకే మిగతా ఎమ్మెల్యేలు వెళ్లలేదనే ప్రచారమూ నడుస్తోంది. మరోవైపు.. బీజేఎల్పీనేత ఏలేటి వ్యవహారశైలి వల్లే ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తానికి ఈ ఎపిసోడ్‌ ఎక్కడవరకూ దారి తీస్తుందో తెలియక బీజేపీ కార్యకర్తలు ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×