EPAPER

Telangana BJP: తెలంగాణ బీజేపీలో విభేదాలు.. రాష్ట్ర అధ్యక్ష పదవికి.. కొత్త నేతలకు అర్హత లేదా..?

Telangana BJP: తెలంగాణ బీజేపీలో విభేదాలు.. రాష్ట్ర అధ్యక్ష పదవికి.. కొత్త నేతలకు అర్హత లేదా..?

Internal Clashes In Telangana BJP: తెలంగాణ బీజేపీలో ఆంక్షలున్నాయా? మీడియా సమావేశం నిర్వహించాలన్నా అనుమతి తీసుకోక తప్పదా? సీనియర్ నేతలు జూనియర్లను తొక్కేస్తున్నారా? నీతిమంతులంతా బీజేపీలోకి రావాలని నినాదాలిచ్చే నేతలు .. పార్టీలోకి వచ్చాక ఎదుగుదలకు అడ్డుపడుతున్నారా ? రాష్ట్ర అధ్యక్ష పదవికి కొత్త నేతలకు అర్హత లేదా..?


తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేధాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. కొత్త నేతల ఫేస్ లు ఫ్లెక్సిలపై కూడా ఉంచనివ్వడం లేదని తీవ్ర ఆరోపణలు బయటపడుతున్నాయి. పార్టీ కార్యక్రమాల ప్రచారంలో కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హవా మాత్రమే కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా బీజేపీ ఫ్లోర్ లీడర్ గా వున్న యేలేటి మహేశ్వర్ రెడ్డి.. బీజేపీ మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కార్యక్రమాలు, మీడియా సమావేశాలు పట్టించుకోవద్దనే తీర్మానాలు కూడా పార్టీలో జరగాయని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే కొత్త నేత అయిన యేలేటి మహేశ్వర్ రెడ్డికి శాసన సభా పక్షనేతగా అధిష్టానం ఛాన్స్ ఇచ్చింది. యేలేటికి పదవి కట్టబెట్టడం కిషన్ రెడ్డికే కాకుండా.. పాత క్యాడర్ లో ఎవరికి నచ్చడం లేదనే చర్చ ఓ వైపు బలంగా జరుగుతోంది. మరోవైపు అధ్యక్ష పదవి సైతం ఈటల రాజేందర్ కు ఇస్తే పెత్తనమంతా కొత్త నేతలదే అవుతుందని.. అందుకే పాత నేతలకు అధ్యక్ష పదవి ఇప్పించేందుకు.. ఢిల్లీలో కిషన్ రెడ్డితో పాటు ఆయన వర్గాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కమలం వర్గాల్లో జోరుగా సాగుతోంది.


గతంలో కూడా బండి సంజయ్ కు పార్టీ అధ్యక్ష పదవి వరించడం.. పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు మింగుడు పడలేదనే వాదనలు ఉన్నాయి. బండి సంజయ్ ను అలాగే వదిలేస్తే అందరిని మించిపోతారనే కారణంతోనే.. బండిని అధ్యక్ష పదవి నుంచి సైడ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ వ్యవహారంలో నాటి సీనియర్ నేతలు కీలక పాత్ర పోషించారని పార్టీలోని ఓ వర్గం ఆరోపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ఇంచార్జ్ గా పనిచేసిన మంత్రి శ్రీనివాస్ తో పాటు.. బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనా రెడ్డి, విద్యసాగర్ రావు, కిషన్ రెడ్డిల హస్తం ఉందని బలంగా పుకార్లు వినిపించాయి. అందుకోసం ఏకంగా ఢిల్లీలో సైతం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రణాళిక ప్రకారం బండిని.. అధ్యక్ష పదవి నుంచి తొలగించి.. కిషన్ రెడ్డికి మళ్లీ అధ్యక్ష పదవి అప్పజెప్పడానికి కృషి చేశారని టాక్ వినిపించింది.

కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులయ్యాక ఆయనతో ఉన్న సత్సంబంధాల మేరకు మంత్రి శ్రీనివాస్ మళ్లీ రాష్ట్ర సంస్థాగత ఇంచార్జ్ గా రావాలని ట్రై చేసినప్పటికీ.. పెద్దలు కరుణించక రాలేకపోయారని అంటూ ఉంటారు. బండి సంజయ్ మారుమూల ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ.. సంఘ్ బీజాలున్న నేత అయినప్పటికీ.. సొంత పార్టీ నేతలే టార్గెట్ చేసి పదవి నుంచి సైడ్ చేశారంటే.. కొత్త నేతలను ఇక ఎదగనిస్తారా అనే అనుమానాలు కొత్తగా వచ్చిన నేతల్లో వ్యక్తం అవుతున్నాయి.

Also Read: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒవైసీ ఉపముఖ్యమంత్రా?: బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి ఫైర్

ఇక ప్రస్తుతం అధ్యక్ష పదవి రేసులో.. కొత్త వర్సెస్ పాత నేతలు అంటూ పలు గ్రూపులతో పార్టీ అంతర్గతంగా దహించుకుపోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతా జరుగుతున్నప్పటికీ పాత నేతలు మాత్రం అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు విరమించకుండా పోటీ పడుతున్నారని అంటున్నారు. అలానే కొత్త నేతలపై ఇంకా ఆగ్రహం తోనే ఉంటున్నారని భావిస్తున్నారు. తక్కువ కాలంలోనే యేలేటి మహేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్లు రాష్ట్ర బీజేపీ లో కీ రోల్ పోషించే స్థాయికి ఎదగడం పట్ల గుర్రుగా ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వర్గాలను తప్పించి.. ఈటల అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు అధిష్టానం నుంచి అనుమతులు తెచ్చుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. దీంతోనే కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల మద్య గ్యాప్ ను పెంచాయని అంటున్నారు. అంతే కాకుండా గెలిచిన 8 ఎమ్మెల్లేల్లో అందరిని కాదని.. అధిష్టానం ఏలేటీ మహేశ్వర్ రెడ్డికి ఫ్లోర్ లీడర్ గా ప్రకటించడం పట్ల మిగతా ఎమ్మెల్లేలు అసహనంగా ఉన్నారని అనుకుంటున్నారు. ఏలేటీకి ఫ్లోర్ లీడర్ రావడం వెనక ఈటల రాజేందర్ మంతనాలు ఉన్నాయని కూడా పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.

ఇదంతా ఒక ఎత్తైతే.. కొత్త నేతల ఎంట్రీతో.. పార్టీలో సీనియర్ గా ఉన్న కిషన్ రెడ్డి మాత్రం.. పార్టీలో ఏ కార్యక్రమం జరిగినా.. ఎవరు మీడియా సమావేశం నిర్వహించినా.. తనకు తెలియాలి అని ఆదేశాలు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షులు పర్మిషన్ లేకుండా ఎవరు లిమిట్ క్రాస్ చేయకూడదనే ఆంక్షలు పెట్టారనే టాక్ బీజేపీ పార్టీలో వినిపిస్తోంది. దీంతో అధికార ప్రతినిధులతో పాటు మిగితా క్యాడరంతా పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాకా తలలు పట్టుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో ఏలేటీ మహేశ్వరెడ్డి మేఘా కృష్ణ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా.. కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారనే టాక్ వినిపిస్తోంది. అందుకే యేలేటిని దూరం పెట్టేందుకు కిషన్ రెడ్డి వర్గం ప్రయత్నం చేస్తుందనే ప్రచారం తెరమీదకు వస్తోంది. ఈ క్రమంలోనే యేలేటి బీజేపీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి మకాం మార్చారని చర్చ జరుగుతోంది. శాసన సభా పక్షా నేతగా ఉన్న ఆయనకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేయకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

మొత్తానికి రాష్ట్ర అధ్యక్షుడి అనౌన్స్ మెంట్ తర్వాత.. పార్టీలో అంతర్గత విభేదాలు బట్టబయలవ్వడం.. ఖాయం అని చర్చించుకుంటున్నారు. పదవి వ్యవహారం కాస్త అటు ఇటు అయినా రాష్ట్ర బీజేపీకి గట్టి దెబ్బ తగిలే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయినా పర్లేదు కొత్త నేతలు మాత్రం తమ ముందు ఎదగొద్దు అనే మూడ్ లో పాత నేతలంతా ఫిక్స్ అవుతారా ? ముదురుతున్న నేతల తీరుతో రాష్ట్ర బీజేపీ భవితవ్యం ఎటు వెళ్తుందో అని ప్రశ్నార్ధకంగా మారింది.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×