EPAPER

Shamshabad: ఎయిర్‌పోర్టులో సాంకేతికలోపం.. 5 గంటలు ఆలస్యం

Shamshabad: ఎయిర్‌పోర్టులో సాంకేతికలోపం.. 5 గంటలు ఆలస్యం

Shamshabad: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఓ విమానంలో సాంకేతికలోపం ఏర్పడింది. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అలర్ట్ అయ్యారు. అయితే విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.


వివరాల ప్రకారం.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని ఎయిర్ పోర్టులోనే నిలిపివేశారు. దాదాపు 5 గంటలుగా ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారు. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ విమానం ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా.. 5 గంటలుపైగా ఆలస్యమైంది. అయితే సాంకేతిక లోపం తలెత్తిన అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మరో విమానం సిద్ధం చేయకపోవడంతో అసహనానికి గురయ్యారు.


Also Read: గ్రూప్- 1 రద్దు చేయాలని నిరసన.. ఎవరేం చేసినా పరీక్ష ఆగదని చెప్పేసిన సీతక్క

ఇండిగో యాజమాన్యం మరో విమానాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. చిన్నారులతో ఇబ్బంది ఎయిర్ పోర్టులో ఇబ్బందులు పడ్డామని వాపోయారు. ఇదిలా ఉండగా, దేశంలో విమానాల సమస్యలు ఎక్కువగా చోటుచేసుకోకడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

Related News

GO 317 : సీఎం రేవంత్ చేతికి 317 జీవో కమిటీ నివేదిక

MLC kodandram : నిరుద్యోగులు గులాబీ మాయలో పడొద్దు – ఎమ్మెల్సీ కోదండరాం

Group 1 Exam : గ్రూప్ 1 అభ్యర్థులకు ప్రభుత్వం భరోసా

 Hyderabad Mmts : రాజధాని భవిష్యత్‌కు ఎమ్ఎమ్‌టీఎస్ విస్తరణ అవశ్యం

Governor bandaru dattatreya: బండారు దత్తాత్రేయ కారుకు రోడ్డు ప్రమాదం.. ఢిల్లీ వెళ్తుండగా ఘటన

pubs task force raids: దారి తప్పుతున్న పబ్ కల్చర్.. అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే ఏకంగా..!

Metro Police Hotel : మెట్రో పోలీస్ యజమాని అరెస్ట్, హోటల్ సీజ్, హైదరాబాద్ పోలీసులు, ముంబయికి వెళ్లి మరీ ?

Big Stories

×