EPAPER

BRS: బీఆర్ఎస్‌లో ఇంఛార్జ్‌ల కిరికిరి.. పోటీ చేయనిస్తారా? పక్కన పెట్టేస్తారా?

BRS: బీఆర్ఎస్‌లో ఇంఛార్జ్‌ల కిరికిరి.. పోటీ చేయనిస్తారా? పక్కన పెట్టేస్తారా?

BRS: తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలకు ధీటుగా వరుస కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. రానున్న మూడు నెలల పాటు నిత్యం ప్రజల్లో ఉండే విధంగా కార్యక్రమాలను రూపొందించింది. నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలతో పాటుగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనుంది. అలాగే పార్టీ జెండా పండుగను గ్రామ స్థాయి నుంచి నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. ఇక పార్టీ ప్లీనరీని కూడా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాలను పార్టీ తరపున జిల్లా మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకునేందుకు తాజాగా జిల్లాల వారీగా ఇంఛార్జ్ లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. ఎమ్మెల్సీలకు, సీనియర్ నాయకులకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ కార్యక్రమాల సమన్వయం కోసం సీనియర్లకు బాధ్యతలు అప్పగించడం వెనుక ఆంతర్యమేంటి? సీనియర్లకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందా?


గులాబీ పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం మొత్తం 18 మంది ఎమ్మెల్సీలకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వీరిలో చాలా మంది నేతలు… వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారు. నల్గొండ జిల్లా ఇంఛార్జ్ గా నియమితులైన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం పోటీ చేయాలని భావిస్తున్నారు. వికారాబాద్ ఇంఛార్జ్ గా నియమితులైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి… వచ్చే ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు.

కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంఛార్జ్ గా నియమితులైన మాజీమంత్రి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య … వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అశిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇంఛార్జ్ గా వున్న మాజీమంత్రి, ఎమ్మెల్సీ ఎల్.రమణ వచ్చే ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంఛార్జ్ గా వున్న ఎమ్మెల్సీ భానుప్రసాదరావు వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.


ఇక మహబూబ్ నగర్, నారాయణ పేట జిల్లాల ఇంఛార్జ్ గా వున్న కసిరెడ్డి నారాయణ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఇంఛార్జ్ గా వున్న మాజీమంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల ఇంఛార్జ్ గా వున్న అరికెల నర్సారెడ్డి నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. జనగామ జిల్లా ఇంఛార్జ్ గా వున్న ఎమ్మెల్సీ కోటిరెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్నట్లు సమాచారం.

పెద్దపల్లి జిల్లా ఇంఛార్జ్ గా వున్న ఎర్రోళ్ల శ్రీనివాస్.. జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి లేదా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్ ఇంఛార్జ్ గా వున్న దాసోజు శ్రవణ్ వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా ఇంఛార్జ్ గా ఉన్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఉన్నప్పటికీ కేవలం రాష్ట్ర కమిటీకి మాత్రమే పరిమితం అయింది. తాజాగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అసెంబ్లీ నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కమిటీలను నియమించడం ద్వారా వారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడతారని గులాబీ దళం భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు నియామకం కాని అనుబంధ కమిటీలపై ఫోకస్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఇప్పుడు పార్టీ కార్యక్రమాల కోసం ఇంఛార్జ్ బాధ్యతలు ఇవ్వవడంతో వీరందరికీ అగ్ని పరీక్షే అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కీలక భాధ్యతలు అప్పగించారు. ఐతే ఆ బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే అధినేత ఆగ్రహానికి గురికాక తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇది పెద్ద టాస్క్ గానే భావిస్తున్నారనే చర్చ బీఆర్ఎస్ లో నడుస్తోంది.

Related News

Press Freedom: మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ..!

Kargil War: కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది?.. 25 ఏళ్ల తర్వాత నిజం ఒప్పుకున్న పాక్

Big Shock to YS Jagan: పూర్తిగా ఖాళీ అవుతున్న వైసీపీ.. వీళ్లంతా జంప్

US Presidential Election 2024: కమలా హారిస్ విన్ అవుతుందని.. అలన్ ఎలా చెప్తున్నాడు?

TDP Office Attack Case: పరారీలో జోగి రమేశ్‌, దేవినేని అవినాశ్‌?

YSRCP VS TDP: వరద పాలిటిక్స్.. బురదలో ప్రజలు.. నేతల గొప్పలు

Natural Disaster: క్లౌడ్‌ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?

Big Stories

×