EPAPER

Vote Power: ఓటు విలువ తెలుసుకో.. సరైన నాయకుడిని ఎన్నుకో !

Vote Power: ఓటు విలువ తెలుసుకో.. సరైన నాయకుడిని ఎన్నుకో !

Lok Sabha Elections 2024: ఓటు విలువ తెలుసుకో, ఓటు వెయ్యండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ ఓ పక్క ఎన్నికల సంఘం, మరో పక్క స్వచ్ఛంధ సంస్థలు ఎంతగా చెబుతున్నా ఓటర్లలో మాత్రం అంత ఉత్సాహం కనిపించడం లేదు. ఇప్పటి వరకూ దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఓటింగ్ ముందకొడిగానే నమోదైంది. 2019తో పోలిస్తే పోలింగ్ తగ్గింది. తక్కువ ఓటింగ్ మన దేశంలో కొత్తేమీ కాదు.


ఓటు..దేశ పౌరుడికి వజ్రాయుధం. ఓటు హక్కు పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితి గతులను మార్చే శక్తి ఓటుకు ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెంది మనం బాగుపడాలి అనే తాపత్రయం ఉండటమే కాదు. ఓటు వేయడం కూడా ముఖ్యమే. అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలి. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓటుతో మన భవిష్యత్తును మార్చుకోవచ్చు. అందుకే ప్రతీ ఒక్కరు ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి.

ప్రలోభాలకు గురి కాకుండా ఓటును నిర్భయంగా వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలి. ప్రజల చేత, ప్రజల కొరకు పని చేసే ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే ప్రతి పౌరుడు ఓటు వినియోగించుకోవాలి. అందుకే ఓటు వేయండి బాబూ అంటూ ఎన్నికల సంఘంతో పాటు స్వచ్ఛంధ సంస్థలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాయి. అయినప్పటికీ ఓటర్లలో మాత్రం అంత ఉత్సాహం కనిపించడం లేదనేది టాక్. ముఖ్యంగా యువత ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు.


ఓటరు భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఎన్నికల సంఘం అనేక ప్రచారాలు, కార్యక్రమాలు చేపడుతోంది. చాలా మంది యువత నాయకత్వంలో మార్పును కోరుతున్నప్పటికీ పోలింగ్ బూత్ లకు దూరంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. గ్రామీణ ప్రాంతాల పోలింగ్ సంఖ్యతో పోలిస్తే పట్టణ వాసుల ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోంది.

నగరంలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉన్నా..ఎన్నికలకు సంబంధించి నిరక్షరాస్యుల్లా వ్యవహరిస్తూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం లేదు. తమ భవిష్యత్ కోసం తగిన ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని పోలింగ్ కేంద్రాలకు మళ్లించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఉద్యోగరిత్యా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వారి సంఖ్య పెరగటం కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి ఓ కారణంగా తెలుస్తోంది.

Also Read: పోలింగ్‌కు భారీ భద్రతా ఏర్పాట్లు: డీజీపీ రవి గుప్తా

ఓటు వేయకపోతే ఏమిటి నష్టం అనుకుంటాం. కానీ..పరోక్షంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఒక నియోజవకర్గంలో కనీసం సగం మంది కూడా ఓటు వేయకపోతే సగం కన్నా ఎక్కువ మంది తిరస్కరించిన అభ్యర్థి మనల్ని పాలిస్తున్నారని అర్థం. పోలింగ్ శాతం తక్కువైతే పాలకులకు ప్రజలంటే లోకువగా ఉంటుంది. ఏదైనా సమస్యపై ప్రశ్నిస్తున్నప్పుడు మీరు అసలు మాకు ఓటు వేయలేదు కదా అని ప్రశ్నిస్తారు. మంచి అభ్యర్థికి ఓటేయకపోతే.. డబ్బు, ప్రలోభాలతో వేరొకరు అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఒక్కరు మేల్కొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Big Stories

×